Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆహ్లాద , విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ శుక్ర గ్రహం జనవరి 28వ తేదీన కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఈ మూడు రాశులు వారికి అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి- మేషరాశి వారికి మాలవ్య రాజయోగం అన్ని శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి అఖండ ధన ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగస్తులకు కోరుకున్నచోట బదిలీ అవుతుంది జీతం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. కెరియర్లో ముందుకు వెళ్తారు. విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్తారు.
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
సింహరాశి- సింహరాశి వారికి మంచి శుభ ఫలితాలను అందిస్తుంది వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
కుంభరాశి- కుంభ రాశి వారికి శుక్రుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఏర్పడే మాలవ్యయోగం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారాల విస్తరించడానికి ఇది మంచి సమయం వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. జీతం పెరుగుతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనేక లాభాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నవారికి మంచి పొజిషన్ లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.