Hyd, Jan 21: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలోని ఏకశిలానగర్‌లో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు.దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు.
దీనిపై స్పందించిన ఈటల, మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. పేదల భూముల అక్రమ వ్యాపారం తనకు తెలిసిన వెంటనే అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను ప్రశ్నించడమే కాకుండా, ఆగ్రహంతో చేయిచేసుకున్నారు. ఈ ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, పేదల భూములు కబ్జా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
“కొందరు రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా హస్తగతం చేసుకుంటున్నారు. ఇది నేరం. తప్పు చేసే బ్రోకర్లకు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి,” అని ఘాటుగా విమర్శించారు.
Etela Rajender attack on real estate broker
బిగ్ బ్రేకింగ్ న్యూస్
మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న ఈటెల
పేదల భూములు కబ్జా చేయడంతో బ్రోకర్ పై దాడి pic.twitter.com/BmU5J08YtX
— Telugu Scribe (@TeluguScribe) January 21, 2025
రియల్ ఎస్టేట్ బ్రోకర్లారా ఇక్కడే ఉన్నా ఎవడొస్తాడో రండి
పోలీసులు ఎవరికి రక్షణగా ఉన్నారు
పోలీసులపై ఇంత ముందు ఇజ్జత్ ఉండే ఇప్పుడు తెలంగాణ పోలీస్ అంటే గౌరవ లేకుండా పోయింది
- ఎంపీ ఈటల రాజేందర్ https://t.co/dunl5kK8RU pic.twitter.com/RHnG594nt7
— News Line Telugu (@NewsLineTelugu) January 21, 2025
పేదల భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించే ఎవరికైనా ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన ఈటల, “బ్రోకర్ల దౌర్జన్యాలకు బీజేపీ భయపడదు. పేదల కోసం పోరాడుతూనే ఉంటాం,” అని అన్నారు.