Health Tips: మన శరీరానికి విటమిన్లు మినరల్స్ చాలా ముఖ్యమైనవి అయితే కొన్ని విటమిన్లు మన శరీరంలో అనేక రకాల జబ్బులు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా బి12 విటమిన్ మానవ శరీరానికి చాలా అవసరమైనది దీనిలోపం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. గుండె సంబంధ జబ్బులు రక్తహీనత ఆటో ఇమ్యూనిటీస్ వంటివి బి12 లోపం వల్ల వస్తాయి. అయితే లోపం ఉందని ప్రారంభ సంకేతాలు కొన్ని చూపిస్తాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిగ్మెంటేషన్.. బి12 లోపం వల్ల శరీరంలో చాలా చోట్ల పిగ్మెంటేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా మోచేతుల్లో నుదుటిపైన ప్యాక్సెస్ లాగా కనిపిస్తాయి. అంతేకాకుండా చేతులు పసుపు రంగులోకి మొహం కూడా పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ సంకేతాలు కనిపించినట్లయితే అది బి 12 లోపం కావచ్చు.
Health Tips: ఎన్ని వ్యాయామాలు చేసిన బరువు తగ్గట్లేదా
తెల్ల మచ్చలు- కొంతమందిలో మొహం పైన చేతుల పైన తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి కూడా బి12 లోపానికి సంకేతంగా చెప్పవచ్చు. వీటిని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతారు.
చర్మం పెళుసుబారడం- కొంతమందిలో బీటు లోపం వల్ల చర్మం డ్రైగా మారుతుంది. అరికాళ్లలో చేతుల్లో దురదలుగా అనిపిస్తాయి. ముఖ్యంగా కాళ్లలో డ్రై స్కిన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా బి12 లోపం.
జుట్టు రాలడం- తరచుగా జుట్టు రాలిపోతుంటే అది కూడా బి12 విటమిన్ లోపం కావచ్చు. మీకు గనక ఎక్కువగా జుట్టు రాలిపోతుంటే ఒకసారి బీట్ వెల్ లెవల్సినా చెక్ చేసుకోవడం ఉత్తమం.
రక్తహీనత- బి12 లోపం ఉన్నవారిలో ప్రధానంగా కనిపించే సమస్య రక్తహీనత బీటువెల్ వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇది మహిళల్లో ఏర్పడుతుంది.
నివారణ- ఉన్నవారికి ఎక్కువగా జంతు సంబంధ ఆహారాలు తీసుకోవాలి వీటిలో బి 12 అధికంగా ఉంటుంది. పాలు, గుడ్లు, చేపలు, మాంసం వంటి వాటిలలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. శాకాహారులైతే మీరు సప్లిమెంట్స్ లేదా ఇంజక్షన్స్ రూపంలో విటమిన్ బి12 పొందొచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి