Auto

Indian Passenger Vehicle Market Record: జోష్‌లో భారతీయ కార్ల మార్కెట్, 2024 సంవత్సరంలో రికార్డుస్థాయి విక్రయాలు

VNS

కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి (Personal Mobility) ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజు రోజుకు స్పేసియస్‌గా మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఎస్‌యూవీ (SUV Cars) కార్ల వైపు మొగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో 2024లో 43 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయి.

Honda Unicorn 2025: మార్కెట్లోకి వ‌చ్చేసిన‌ హోండా యూనికార్న్ 2025 మోడ‌ల్ బైక్, కేవ‌లం రూ. 1.19వేల నుంచే ప్రారంభం

VNS

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశీయ మార్కెట్లో హోండా యూనికార్న్ 2025 (Honda Unicorn 2025) ఆవిష్కరించింది. దీని ధర రూ.1,19,481 (EX Showroom) పలుకుతుంది. ఓబీడీ2బీ కంప్లియంట్ ఇంజిన్, అదనపు ఫీచర్లతో ఈ మోటారు సైకిల్ అప్ డేట్ చేశారు.

Honda SP 160: హోండా నుంచి ఎస్‌పీ160 బైక్ వచ్చేసింది, హైదరాబాద్‌లో దీని ధర ఎంతంటే..

Hazarath Reddy

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా ఇండియా.. దేశీయ విపణిలోకి కొత్త బైకు ‘ఎస్‌పీ160’ని విడుదల చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ హోండా ఎస్‌పీ 160 మాడల్‌ సింగిల్‌ డిస్క్‌ ధర రూ. 1,21,951 కాగా, డబుల్‌ డిస్క్‌ ధర రూ. 1,27,956గా నిర్ణయించింది. అయితే ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి

Lamborghini Car Catches Fire: వీడియో ఇదిగో, ముంబై నడిరోడ్డు మీద మంటల్లో కాలిపోయిన ల‌గ్జరీ బ్రాండ్ కారు లంబోర్గినీ, కదులుతున్న కారులో ఒక్క‌సారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

ముంబ‌యిలోని కోస్టల్ రోడ్‌లో బుధవారం రాత్రి కదులుతున్న లంబోర్గినీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేద‌ని అధికారులు వెల్ల‌డించారు. వెంటనే ఒక ఫైరింజ‌న్‌ను సంఘటనా స్థలానికి పంపినట్లు అగ్నిమాపక శాఖ‌ అధికారి ఒక‌రు తెలిపారు. దాదాపు 45 నిమిషాల్లో మంటలను ఆర్పివేసిన‌ట్లు పేర్కొన్నారు.

Advertisement

Honda New SP 160: మార్కెట్లోకి కొత్త బైక్ రిలీజ్ చేసిన హోండా, ఎక్స్ షో రూం ధ‌ర కేవ‌లం రూ. 1.21 ల‌క్ష‌ల నుంచే ప్రారంభం

VNS

ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్‌ (Honda) అండ్‌ స్కూటర్‌ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి నయా బైకు ‘ఎస్‌పీ160’ని (Honda New SP 160) పరిచయం చేసింది. హై-టెక్‌ ఫీచర్‌తోపాటు అధిక పనితీరుతో రూపొందించిన ఈ బైకు కస్టమర్లకు నూతన రైడింగ్‌ అనుభవం కల్పించే విధంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Bajaj Chetak: చేతక్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జింగ్‌ తో 153 కి.మీ... గరిష్ఠ ధర రూ.1.27 లక్షలు

Rudra

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్‌ ఆటో.. చేతక్‌ బ్రాండ్‌ తో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 35 సిరీస్‌ లో భాగంగా సంస్థ విడుదల చేసిన మూడు స్కూటర్లు 3501, 3502, 3503 వెరైటీలుగా లభించనున్నాయి.

New Model Kia Syros Car: మార్కెట్లోకి కియా మ‌రో కొత్త కారు, అదిరిపోయే ఫీచ‌ర్ల‌కు, ఆక‌ట్టుకునే ధ‌ర‌తో తీసుకొస్తున్న కియా

VNS

కంపెనీ నుంచి విడుదలైన మూడో ఎస్‌యూవీ మాడల్‌ ఇదే కావడం విశేషం. 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ మాడల్‌లో ఆరు-స్పీడ్‌ మాన్యువల్‌, 7 స్పీడ్‌ డీసీటీ గేర్‌తో తీర్చిదిద్దింది. అలాగే 1.5 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన మాడల్‌లో ఆరు స్పీడ్‌ మాన్యువల్‌ ఉన్నాయి.

Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఎల‌క్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి వ‌చ్చే తేదీ ఖరారు, మిడ్ రేంజ్ ఎస్ యూవీల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న కారు

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) భారత్ మార్కెట్లో అత్యంత పాపులర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్లు విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో జనవరి 17న తన పాపులర్ ఎస్‌యూవీ కారు హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) కారు ఆవిష్కరించనున్నది.

Advertisement

Skoda Auto India: స్కోడా కార్ల అభిమానులకు షాక్, వాహన ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన దిగ్గజం, జనవరి 1 నుంచి అమలులోకి

Hazarath Reddy

ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా కూడా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరలు పెంచాల్సి వచ్చిందని, ఈ నూతన ధరలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.

Maruti Suzuki: ఏడాదిలో 2 మిలియన్ కార్లు తయారీ, సరికొత్త రికార్డును నెలకొల్పిన మారుతి సుజుకీ, భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటోమొబైల్ దిగ్గజంగా కొత్త బెంచ్ మార్క్

Hazarath Reddy

మారుతీ సుజుకి భారతదేశంలో ఏడాదిలో 2 మిలియన్ కార్లను ఉత్పత్తి చేసిన మొదటి స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్.. 2024లో 2 మిలియన్ ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయడం ద్వారా కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది

Toyota Urban Cruiser EV: మారుతీ సుజుకీ టెక్నాల‌జీతో ట‌యోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ, వ‌చ్చే నెల మార్కెట్లోకి రానున్న స‌రికొత్త కార్

VNS

సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా రూపుదిద్దుకున్నదే టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ. గుజరాత్ లోని మారుతి సుజుకి ప్లాంట్ లో టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ / సుజుకి ఈ విటారా (Maruti Suzuki E Vitara) తయారవుతాయి.

Honda Amaze 2024: హోండా నుంచి అమేజ్ 2024 వచ్చేసింది, ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

హోండా కార్స్ ఇండియా హోండా అమేజ్ 2024 ను ప్రారంభ ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. రేంజ్-టాపింగ్ వేరియంట్ రూ. 10.90 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. అమేజ్ ఇప్పుడు అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలను (ADAS) అందిస్తున్న దేశంలోనే అత్యంత సరసమైన కారుగా చెప్పుకోవచ్చు.

Advertisement

Hero Vida V2 E-Scooter: హీరో నుంచి ఒకేసారి మూడు ఈవీ స్కూటర్లు, ధర రూ. 96 వేల నుంచి ప్రారంభం, అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

ప్రముఖ వాహన తయారీ దిగ్గజం హీరో నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసింది. Vida V2 Lite, Plus, Pro అనే మూడు కొత్త వెర్షన్ Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను హీరో విడుదల చేసింది. వీ2 లైట్ మోడల్ ధర రూ. 96 వేలు కాగా, దీని రేంజ్ 94 కిలోమీటర్లు. వీ2 ప్లస్ మోడల్ ధర రూ. 1.15 లక్షలు. దీని రేంజ్ 143 కిలోమీటర్లు.

Honda Activa E Scooter: హోండా నుంచి యాక్టివా ఈ-స్కూటర్‌, జనవరి నుంచి బుకింగ్స్ ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలోని EV ద్విచక్ర వాహనాల్లోకి అధికారికంగా ప్రవేశించింది, ఇది దాని ఐకానిక్ యాక్టివా స్కూటర్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను Activa e అని పిలుస్తారు, దానితో పాటు QC1 అని పిలువబడే మరొక మోడల్‌ను బుధవారం ప్రారంభించింది

Audi Q7 launched in India: ఆడి క్యూ7 భారత మార్కెట్లోకి వచ్చేసింది, ధర రూ. 88.66 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Hazarath Reddy

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ, ఆడి తన మూడు వరుసల SUV, Q7 యొక్క ఆధునీకరించబడిన వెర్షన్‌ను విడుదల చేసింది. 2025 ఆడి క్యూ7 భారతదేశంలోరూ.88.66 లక్షలకు విడుదల చేయబడింది , ఎక్స్-షోరూమ్ మరియు ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది.

2025 Toyota Camry: త్వ‌ర‌లోనే మార్కెట్లోకి 2025 టయోటా కమ్రీ కొత్త వెర్ష‌న్, ఇప్పుడున్న మోడ‌ల్ కు పూర్తి అప్ డేట్ తెస్తున్న కంపెనీ

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్.. తన మిడ్ సైజ్ సెడాన్ 2025 టయోటా కమ్రీ (Toyota Camry) కారును డిసెంబర్ 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దేశీయ మార్కెట్లో తొలిసారి 2013లో ఆవిష్కరించింది. ప్రస్తుతం వస్తున్న నైన్త్ జనరేషన్ టయోటా కమ్రీ కారు పలు అప్ డేట్స్‌తో అందుబాటులోకి వస్తున్నది.

Advertisement

Mahindra Xuv700 Price Hiked: కారు కొనాల‌నుకుంటున్నారా? ఈ మోడల్ ధ‌ర ఏకంగా రూ. 50వేలు పెంచేసిన కంపెనీ

VNS

కొత్త కారు కొంటున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra Xuv700) కారు ధరలను అమాంతం పెంచేసింది. ఇప్పుడు, కస్టమర్లు ఎవరైనా వడ్డీ ద్వారా ఈ మల్టీ వేరియంట్లను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. రూ. 50వేల వరకు అదనంగా చెల్లించాల్సి (Mahindra Xuv700 Price Hiked) ఉంటుంది.

Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది, ఫ్లయింగ్ ఫ్లీ సి6 పేరుతో 2026 జనవరిలో మార్కెట్లోకి..

Hazarath Reddy

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) విద్యుత్‌ ద్విచక్ర వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సి6ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను 'ఫ్లయింగ్ ఫ్లీ' బ్రాండ్ కింద విడుదల చేస్తారు

Mercedes-Benz to Hike Prices: బెంజ్ కార్ అభిమానులకు షాకింగ్ న్యూస్, జనవరి నుంచి 3 శాతం పెరగనున్న ధరలు

Hazarath Reddy

Mercedes-Benz India తన మొత్తం మోడల్ లైనప్‌లో ధరల పెంపును ప్రకటించింది, ఇది జనవరి 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. పెరుగుదల, సగటున 3% వరకు ఉండనుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరియు పెరిగిన కార్యాచరణ ఖర్చులు కారణంగా చెప్పవచ్చు.

CCPA Shock to Ola Electric: ఓలా క‌స్ట‌మ‌ర్ల నుంచి ఏకంగా ప‌దివేల‌కు పైగా ఫిర్యాదులు, కంపెనీపై విచార‌ణ‌కు ఆదేశించిన వినియోగ‌దారుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌

VNS

ఈవీ స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసు ప్రమాణాలు, స్కూటర్లలో తలెత్తే సమస్యల పరిష్కారంలో లోపాలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) విస్తృత విచారణకు ఆదేశించింది. కస్టమర్ల హక్కులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో సీసీపీఏ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

Advertisement
Advertisement