Mumbai, March 26: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు (Xiaomi EV) రాబోతోంది. ఇప్పటికే ఈ షావోమీ ఎస్‌యూ7 ఈవీ కారును బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ప్రదర్శించింది. గ్లోబల్ మార్కెట్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ కాలేదు. ఎస్‌యూవీ 7 కారు రాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 7 (Xiaomi Su7) కారు ధరకు సంబంధించి వివరాలను కంపెనీ సీఈఓ లీ జున్ రివీల్ చేశారు. ఈ కారు ధర సీఎన్‌వై 500,000 (సుమారు రూ. 57,93,508) కన్నా తక్కువ ధర ఉంటుందన్నారు. షావోమీ ఎస్‌యూవీ 7 కారు లుక్ చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాదు.. అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని చెప్పారు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈవీ కారు అధికారిక ధరల శ్రేణిని ప్రకటించిన తర్వాత ఆర్డర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
Woke up this morning feeling electric!⚡︎ I'm thrilled to announce that Xiaomi SU7 launches in our domestic market on Thursday, March 28th! Let's #DrivingForward together! pic.twitter.com/W7y7mlvxH9
— Lei Jun (@leijun) March 25, 2024
ఎస్‌యూ షార్ట్ స్పీడ్ అల్ట్రాతో వస్తుందని సీఈఓ తన అధికారిక వెయిబో అకౌంట్లో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ కారును షావోమీ ఆవిష్కరించగా.. ప్రపంచంలోని మొదటి ఐదు ఆటోమేకర్‌లలో ఒకటిగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. టెస్లా కార్లు, పోర్షే ఈవీల కన్నా మెరుగైన వేగాన్ని అందించగల టెక్నాలజీని కలిగి ఉందని సీఈఓ లీ తెలిపారు. చైనాలోని షావోమీ స్టోర్‌లు కూడా కారును ప్రదర్శించాయి. కస్టమర్‌లు కూడా ఈ ఎస్‌యూవీ 7 ఓషన్ బ్లూ వెర్షన్‌ను క్యాప్చర్ చేసేందుకు కార్ బ్లాగర్‌లు క్యూ కట్టేశారు.
అదనంగా, కంపెనీ తన షావోమీ కార్ యాప్‌ను కూడా చైనీస్ యాప్ స్టోర్‌లకు అప్‌లోడ్ చేసింది. షావోమీ SU7 మొత్తం రెండు వెర్షన్‌లలో వస్తుంది. అందులో ఒకటి సింగిల్ ఛార్జ్‌పై 668కిలోమీటర్లు (415 మైళ్ళు) వరకు రేంజ్ అందిస్తుంది. మరో వెర్షన్ 800కిమీల రేంజ్‌తో వస్తుంది. టెస్లా మోడల్ ఎస్ మోడల్‌తో పోల్చి చూస్తే.. 650కిమీల పరిధిని మాత్రమే అందిస్తుంది.
చైనా ఐదో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఈవీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు 2021లోనే ప్రకటించింది. ఈవీలను అభివృద్ధి చేసే వాహన తయారీదారులతో భాగస్వామ్యం చేసుకున్న ఇతర చైనీస్ టెక్ కంపెనీలు టెలికాం దిగ్గజం హువావే HWT, సెర్చ్ ఇంజన్ సంస్థ బైడు కూడా ఉన్నాయి. షావోమీ దశాబ్దం పాటు ఆటోలలో 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 83,500 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. చైనా ఈవీ మార్కెట్‌లో ఆమోదం పొందిన అతికొద్ది మంది కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఈ కంపెనీ తమ కార్లను బీజింగ్ ఫ్యాక్టరీలో 2లక్షల వాహనాల వార్షిక సామర్థ్యంతో ప్రభుత్వ-యాజమాన్య వాహన తయారీ సంస్థ బీఏఐసీ గ్రూప్ యూనిట్ ఉత్పత్తి చేస్తోంది.