Business

Stock Market:మార్కెట్ పై కరోనావైరస్ ప్రభావం, భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు, 2 వేల పాయింట్లు నష్టపోయిన సెన్సెక్, 570 పాయింట్లు పతనమైన నిఫ్టీ, ఏడాది కనిష్ఠానికి పతనమైన రూపాయి

Vikas Manda

సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ సుమారు 6 శాతం వరకు పతనమైంది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 2000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 35,723.38 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 9 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 7 శాతం, టాటా స్టీల్ 6 శాతం పతనంతో నష్టపోయిన షేర్ల సూచిలో అగ్రస్థానంలో కనిపించాయి.....

Rana Kapoor: కోర్టులో ఏడ్చేసిన రాణా కపూర్, నా పాస్ పోర్ట్‌ను తీసుకోండి, పాప పోయినప్పటి నుంచి సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్‌లో ఉన్నా, ముంబై కోర్టుకు విన్నవించుకున్న యస్ బ్యాంక్ ఫౌండర్

Hazarath Reddy

యస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభం (Yes Bank Crisis) దేశంలో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్రం ఈ సంక్షోభాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరిష్కరించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా సీబీఐ, ఈడీలు (ED, CBI) యస్ బ్యాంకు అక్రమార్కుల తాట తీసేందుకు రెడీ అయ్యాయ. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్ పై (Rana kapoor) సీబీఐ, ఈడీలు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించాయి. ఈ సంధర్భంగా రాణా కపూర్ కోర్టులో ఏడ్చేశారు.

Rana Kapoor Arrested: ‘యస్’ అక్రమార్కుల తాట తీస్తోన్న సీబీఐ,ఈడీ, పలు చోట్ల సీబీఐ దాడులు, ఎఫ్ఐఆర్ నమోదు, రాణా కపూర్ అరెస్ట్, మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు

Hazarath Reddy

యస్ బ్యాంక్ సంక్షోభంలో (YES Bank crisis) అసలు దోషుల బెండు తీసేందుకు ఈడీ, సీబీఐ (ED And CBI) రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఈ బ్యాంకు కో– ఫౌండర్‌‌, మాజీ సీఈఓ రాణా కపూర్‌‌ను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టర్‌‌ (ఈడీ) శనివారం అరెస్టు (YES Bank co-founder Rana Kapoor) చేసింది.

YES Bank Collapse: రాణా కపూర్ ఇంట్లో ఐటీ సోదాలు, దేశం విడిచిపోకుండా లుక్‌ ఔట్‌ నోటీసు జారీ, డీహెచ్ఎఫ్ఎల్‌కు భారీ ఎత్తున నిధులు తరలించారని ఆరోపణలు

Hazarath Reddy

యస్ బ్యాంకుకు ఆర్‌బిఐ మారటోరియం విధించిన కొద్ది గంటల్లోనే యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్ నివాసంలో ఈడీ (Enforcement Directorate) సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణలో భాగంగా ముంబై వర్లిలోని ఆయన (YES Bank founder Rana Kapoor) ఇంట్లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించింది. అనంతరం ఆయనపై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ చేసింది. రాణాకపూర్‌ దేశం విడిచిపోవడాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈడీ అధికారి ఒకరు చెప్పారు.

Advertisement

YES Bank Reconstruction: యస్ బ్యాంకులో 49 శాతం వాటాల కొనుగులుకు ఎస్‌బిఐ బోర్టు ఆమోదం, ప్రాథమికంగా రూ.2450 కోట్ల పెట్టుబడి, మీడియాకు వెల్లడించిన ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్ కుమార్

Hazarath Reddy

యస్‌ సంక్షోభం (Yes Bank Crisis), ఆర్‌బీఐ డ్రాప్ట్‌ ప్లాన్ల (RBI Draft Plan) తదితర పరిణామాల నేపథ్యంలో ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్ కుమార్ ( Chairman Rajnish Kumar) శనివారం ఉదయం మీడియాకు తెలిపారు. యస్‌ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్‌బీఐ బోర్డు (SBI Board) సూత్ర ప్రాయ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ముసాయిదా పథకం ఎస్‌బీఐ వద్దకు చేరిందని తెలిపారు.

YES Bank Reconstruction Scheme: యస్ బ్యాంక్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్, మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ప్లాన్, ఇప్పటికే యస్ బ్యాంకు బోర్డు సస్పెండ్

Hazarath Reddy

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ పునరుద్దరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రభావం ఆర్థిక రంగంపై పడనుందనే సంకేతాలు కనిపిస్తుండటంతో కేంద్రం, ఆర్‌బిఐ యస్ బ్యాంకును గట్టెక్కించడానికి కావాల్సిన అన్ని రకాలు చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే యస్ బ్యాంకు బోర్డును సస్పెండ్ చేసిన భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆ బ్యాంకు పునరుద్ధరణకు ఆ కొత్త ఓ పథకాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ బ్యాంకుపై మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ఈ సరికొత్త ప్లాన్ ను ఆర్‌బిఐ ప్రకటించింది.

YES Bank Crisis: యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆందోళన వద్దు, కస్టమర్ల సొమ్ము ఎక్కడికీ పోదు, డిపాజిట్‌దారులకు భరోసా ఇచ్చిన ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Hazarath Reddy

దేశంలోని నాలుగో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్ అయిన యస్ బ్యాంక్ (Yes Bank) భవిష్యత్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకును ఎలాగైనా కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. యస్‌ బ్యాంకు సంక్షోభం (YES Bank Crisis), డిపాజిట్‌దారుల ఆందోళన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das) స్పందించారు.

YES Bank Crisis: ఓ 'ఎస్' ఇకపై రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకోరాదు, ఎస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు, పతనమవుతున్న ఎస్ బ్యాంక్ షేర్లు, బ్యాంకుల ఎదుట ఖాతాదారుల భారీ క్యూలు

Vikas Manda

ఆర్బీఐ చర్యతో ఎస్ బ్యాంక్ యొక్క ఆన్ లైన్ లావాదేవీలు గురువారం సాయంత్రం నుంచి నిలిచిపోయాయి, ఏటీఎంలలో కూడా నిధులు ఖాళీ అయిపోయాయి. దీంతో ఖాతాదారుల్లో మరింత ఆందోళన నెలకొని డబ్బు విత్ డ్రా కోసం బ్యాంకుల వద్ద బారులు తీరారు....

Advertisement

Vodafone Idea: ఒక జీబీ డేటాకి రూ.35 చెల్లించాల్సిందే, డాట్‌కు లేఖ రాసిన వొడాఫోన్‌ ఐడియా, టెలికాం శాఖకు రూ. 8 వేల కోట్లు చెల్లించిన భార‌తీ ఎయిర్‌టెల్‌

Hazarath Reddy

టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) సంచలన ప్రతిపాదనలు చేసింది. భారీ నష్టాలకు తోడు ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు (AGR dues) వివాదంతో మరింత కుదేలైన ఈ సంస్థ మొబైల్‌ డేటా, కాల్‌ చార్జీలపై కొన్ని సవరణలు చేయాలని కోరుతోంది. డేటా చార్జీలను కనీసం 7 రెట్లు , కాల్‌ చార్జీలను 8 రెట్లు పెంచాలని కోరుతోంది. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది.

Reliance Jio: జియోకి షాకిచ్చిన యూజర్లు, భారీగా క్షీణించిన కొత్త వినియోగదారుల సంఖ్య, బీఎస్‌ఎన్‌ఎల్‌ కంటే వెనకే, వివరాలను వెల్లడించిన ట్రాయ్

Hazarath Reddy

ఉచిత సేవలతో దేశీయ టెలికాం పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్‌ జియోకు (Reliance Jio) తాజాగా పెద్ద షాక్‌ తగిలింది. టారిఫ్‌ సవరింపు కారణంగా డిసెంబరు నెలలో జియో కొత్త వినియోగదారుల సంఖ్యలో భారీగా క్షీణించిందని ట్రాయ్‌ (Telecom Regulatory Authority of India (TRAI) వెల్లడించింది.

Amazon's Fab Phones Fest: భారీ తగ్గింపులతో అమెజాన్ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, అత్యంత తక్కువ ధరకే ఫోన్లను సొంతం చేసుకోండి, ఈ నెల 29 వరకు సేల్

Hazarath Reddy

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వైబ్‌సైట్లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ను (Amazon's Fab Phones Fest) మళ్లీ ప్రారంభించింది. నేటి నుంచి 29వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. ఇందులో భారీ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. అలాగే ఐసీఐసీఐ (ICICI), కోటక్‌ మహీంద్రా కార్డుల )Kotak Mahindra) ద్వారా జరిపే కొనుగోళ్లపై ఫోన్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

India- USA Deals: 'ఈ పర్యటన మాకెంతో ప్రత్యేకం, మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' హైదరాబాద్ హౌజ్‌లో ట్రంప్ కీలక ప్రకటన, ఇండియా-యూఎస్ మధ్య కుదిరిన 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం

Vikas Manda

భారతదేశం నుంచి ఘనమైన స్వాగతం లభించింది. భారత ప్రజలు చూపిన ప్రేమ, ఆప్యాయతలు అమోఘం. దీనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటామ అని ట్రంప్ అన్నారు. ఈ పర్యటన ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇరు దేశాలు భాగస్వామ్య విలువలు పాటిస్తాయి కాబట్టి ఇండియా- యూఎస్ఎ ఎప్పటికీ మిత్రదేశాలని పేర్కొన్నారు....

Advertisement

Jio 336 Days Validity Plan: ఒక్కసారి రీఛార్జ్ చేయండి, 336 రోజుల పాటు అపరిమిత ప్రయోజనాలు పొందండి, పాత ప్లాన్ల ప్లేసులోకి కొత్త ప్లాన్ తీసుకువచ్చిన జియో

Hazarath Reddy

New Rs.2000 Notes: రూ.2 వేల నోటులో భారీ మార్పులు, కదిలిస్తే రంగులు మారిపోతాయి, మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ, ఇతర మార్పులు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

మరో కొత్త రెండు వేల రూపాయల నోటును తీసుకొస్తోంది. సరికొత్త డిజైన్ మహాత్మాగాంధీ బొమ్మతో ముస్తాబవుతోన్న కొత్తనోటులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కలర్, సైజ్, థీమ్ అన్నింటిలోనూ మార్పులు ఉన్నాయట. మంగళయాన్ రివర్స్‌లో ఉండటమే కాదు మాగెంటా రంగులో రెడీ అయింది.

India's Savings Rate: పొదుపు మంత్రాన్ని మరిచిపోయిన భారతీయులు, 15 ఏళ్ల కనిష్ఠానికి పతనమైన భారతదేశ పొదుపు రేటు, సేవింగ్స్‌పై ఆర్థిక మందగమనం దెబ్బ

Vikas Manda

ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ కొంచెం మెరుగైన స్థితిలో ఉంది. జీడీపీలో భారత పొదుపు రేటు 30.1 శాతం కలిగి ఉండగా బ్రెజిల్ 16 శాతం, మెక్సికో 23 శాతం గ్రాస్ సేవింగ్స్ ను కలిగి ఉంది. ఇక కరోనావైరస్ వ్యాప్తి ద్వారా కూడా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థపై మరో దెబ్బ పడినట్లయింది....

Interchange Fee: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే బాదుడే, బ్యాంకు కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వనున్న ఏటీఏం ఆపరేట్లర్ల సంఘం, ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచాలని ఆర్బీఐకి లేఖ

Hazarath Reddy

ఇకపై ఎటిఎంల్లో నగదు ఉపసంహరణలు (ATM Withdrawal) నిల్వ తనిఖీ చేసుకోవడం మరింత భారం అయ్యే సంకేతాలు కనబడుతున్నాయి. ఇంటర్‌చేంజ్ ఫీజులు (Interchange Fee) పెంచాలంటూ ఆర్బీఐకి ఏటీఎం ఆపరేటర్స్ అసోసియేషన్ (ATM Operators Association) విజ్ఞప్తి చేసింది.

Advertisement

Burgman Street Scooter: బిఎస్6 ప్రమాణాలతో సుజుకి నుండి బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్‌ భారత మార్కెట్లో విడుదల, ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

బిఎస్6 బర్గ్‌మన్ స్ట్రీట్ ప్రీమియం 125 సిసి స్కూటర్‌ కొత్త అప్‌డేట్స్ మరియు టెక్నాలజీతో లోడ్ చేయబడింది. ఈ స్కూటర్ లోని ఫ్యుఎల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ స్టార్ట్ మరియు కిల్ స్విచ్ ఫీచర్, శీతాకాలం లేదా చల్లని పరిస్థితుల్లో కూడా వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయ్యేలా పవర్ సప్లై చేస్తుంది.....

AGR Dues: సుప్రీం దెబ్బతో టెలికాం శాఖకు రూ. 10,000 కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించిన భారతీ ఎయిర్‌టెల్‌, మిగతావి త్వరలోనే చెల్లిస్తామని వినతి, నష్టాల్లో ట్రేడ్ అవుతున్న ఎయిర్‌టెల్‌ షేర్లు

Vikas Manda

టెలికాం ఆపరేటర్లు మొత్తంగా రూ. 1.47 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి బకాయి పడ్డాయి. ఇందులో భాగంగా లైసెన్స్ ఛార్జీలు, స్పెక్ట్రమ్ ఫీజు, వడ్డీ కలిపితే ఎయిర్‌టెల్ రూ. 35,586 కోట్లు చెల్లించాల్సి ఉందని టెలికాం శాఖ పేర్కొంది. ఈనేపథ్యంలో ఈరోజు రూ. 10 కోట్లను ఎయిర్‌టెల్ ఈరోజు చెల్లించింది.....

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు, ఫిబ్రవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్, డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు ధరలు

Hazarath Reddy

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkar) వినియోగదారులకు శుభవార్తను అందించింది. తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారికి ’మొబైల్స్ బొనాంజా’ సేల్‌ను (Flipkart Mobile Bonanza Sale) ప్రకటించింది. ఈ సేల్‌ ఫిబ్రవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగియనుంది.

Vijay Mallya: మీ డబ్బులు పైసాతో సహా చెల్లిస్తా..నన్ను వదిలేయండి, యుకే కోర్టు బయట విజయ్ మాల్య, తనపై ఈడీ కక్ష గట్టిందంటూ ఆరోపణలు, మాకు ఆయన్ని అప్పగించమంటున్న ఈడీ

Hazarath Reddy

మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఒకవైపు బ్యాంకులను కోరుతున్నా. అలా కుదరదు.. మాల్య ఆస్తులపై మాకు అధికారం ఉంది అని ఈడీ (Enforcement Directorate) చెప్తోంది. అంటే, ఒకే ఆస్తులకు సంబంధించి ఒకవైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయి. నాలుగేళ్లుగా ఇదే తీరు’ అని మండిపడ్డారు. ‘చేతులు జోడించి బ్యాంకులను వేడుకుంటున్నా. మీరు ఇచ్చిన రుణం మొత్తం మీరు తీసుకోండి. నిజానికి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ (Kingfisher Airlines) తరఫున తీసుకున్న రుణం అది. అయినా కూడా బాధ్యతగా భావించి చెల్లిస్తానంటున్నా’ అని అన్నారు.

Advertisement
Advertisement