Entertainment
Satyam Dies of COVID 19: టాలీవుడ్‌‌లో మరో విషాదం, కరోనాతో కన్నుమూసిన టాలీవుడ్‌ సీనియర్ కోడైరెక్టర్ సత్యం, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
Hazarath Reddyఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన టాలీవుడ్‌ సీనియర్ కోడైరెక్టర్ సత్యం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉదయం ప్రాణాలు (Satyam Dies of COVID 19) కోల్పోయారు. వైద్యులు ఆయ‌న‌ను కాపాడేందుకు చేసిన‌ ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.
Actor Vivekh Passes Away: వ్యాక్సిన్ వేయించుకున్న 2 రోజులకే గుండెపోటు, ప్రముఖ నటుడు వివేక్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ సహా పలువురు సినీ ప్రముఖులు
Hazarath Reddyప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస (Actor Vivekh Passes Away) విడిచారు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో వివేక్ నటించారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు, ప్రత్యేక వైద్య బృందంతో పవన్‌కు చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన
Team Latestlyజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సుమన్ అధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. యాంటీ వైరల్ డ్రగ్స్ తో పవన్ కు చికిత్స అందిస్తున్నారు....
Aaraattu Teaser: నేను వాడిని చంపేస్తాను, మోహన్ లాల్ లుంగీ కట్టి ఫైట్ చేస్తుంటే..తెలుగు డైలాగ్‌తో ఆరాట్టు చిత్రం టీజర్ విడుదల, దుమ్మురేపుతున్న 53 సెకన్ల నిడివి ఉన్న టీజర్
Hazarath Reddyమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆరాట్టు'.ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ ను (Aaraattu Teaser) విడుదల చేశారు. కేవలం 53 సెకన్ల నిడివి ఉన్న వోల్టేజ్ మాస్ కంటెంట్‌ టీజర్ తో హీరోను పరిచయం చేశారు.
RRR Ugadi Poster: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్, కొమరం భీమ్‌, అల్లూరిని జ‌నాలు ఎత్తుకుని పైకి ఎగ‌రేస్తూ సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌ట్లు పోస్టర్, అక్టోబర్ 13వ తేదీన సినిమా విడుదల
Hazarath Reddyవారిద్ద‌రిని జ‌నాలు ఎత్తుకుని పైకి ఎగ‌రేస్తూ సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌ట్లు ఈ పోస్ట‌ర్ లో చూపించారు. జ‌నాలు త‌మ‌ను పైకి ఎగ‌రేస్తుండ‌గా ఇద్ద‌రు హీరోలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఈ పోస్ట‌ర్‌తో ఆర్ఆర్ఆర్ టీమ్ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి.
Dil Raju Covid: టాలీవుడ్‌లో కరోనా సెకండ్ వేవ్ అలజడి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు గుణశేఖర్, వి.ఎన్ .ఆదిత్యలకు కోవిడ్ పాజిటివ్, ఇప్పటికే నివేతా థామస్‌కు కరోనా పాజిటివ్‌, స్వీయ నిర్భంధంలోకి దిల్ రాజు
Hazarath Reddyతెలుగు చిత్ర సీమను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది కరోనా భారీన పడగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు కరోనా పాజిటివ్‌గా (dil-raju-tested-covid-positive) నిర్దారణ అయ్యింది. దీంతో ఈ అగ్ర నిర్మాత హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.
Satish Kaul Dies of COVID 19: ప్రముఖ నటుడు కరోనాతో కన్నుమూత, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ సతీష్ కౌల్, పలు హిందీ చిత్రాల్లో నటించిన పంజాబ్ నటుడు
Hazarath Reddyమహాభారతం సీరియల్‌ ఫేమ్‌, ప్రముఖ నటుడు సతీష్ కౌల్(66) కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Satish Kaul Dies of COVID 19) విడిచారు. వారం రోజుల క్రితం సతీష్‌ కౌల్‌కు కరోనా సోకింది. దాంతో ఆయన పంజాబ్‌ లుథియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్ర‌వారం రాత్రి ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో తుది శ్వాస (Satish Kaul Dies of COVID-19 Complications) విడిచారు.
Cheque Bounce Case: శరత్‌కుమార్‌, రాధికలకు ఏడాది జైలు శిక్ష, రూ. 5 కోట్ల జరిమానా, 2018 నాటి చెక్‌ బౌన్స్‌ కేసులో తాజాగా తీర్పు ఇచ్చిన ప్రత్యేక కోర్టు, నాలుగేళ్ల పాటు సాగిన విచారణ
Hazarath Reddyతమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్‌, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు (Actors Sarathkumar and Radhika) ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్‌ బౌన్స్‌ కేసులో (Cheque Bounce Case) ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష (get one-year jail term) విధిస్తూ తీర్పునిచ్చింది.ఈ కేసుకు సంబంధించి రూ .5 కోట్ల జరిమానా కూడా కోర్టు విధించింది.
Varma Birthday: ఈ రోజు నేను చచ్చిన రోజు, పుట్టిన రోజు కాదు, ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేసిన వర్మ, ఫన్నీగా కామెంట్స్ పెడుతున్న అభిమానులు
Hazarath Reddyవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్‌, 7). ఈ సందర్భంగా సినీవర్గానికి చెందిన పలువురితో పాటు, ఆయన అభిమానులు రామూకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే ఆర్జీవీ మరోసారి తనదైన స్టయిల్‌లో తన పుట్టిన రోజు గురించి చెప్పుకొచ్చాడు. ఈ రోజు నా బర్త్‌డే కాదు..వాస్తవానికి నా డెత్‌ డే.. ఎందుకంటే నా ఆయుష్షులో ఇక సంవత్సరం తగ్గిపోయింది అంటూ బుధవారం ట్వీట్‌ చేశారు.
Director Bharathiraja: ఓటు హక్కును వినియోగించుకున్న దర్శకుడు భారతీ రాజా, హీరో సూర్య, కార్తీ, కమల్ హాసన్, కొనసాగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
Hazarath Reddyతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దర్వఖుడు భారతీ రాజా, నటుడు సూర్య, కార్తీ, కమల్ హాసన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Hero Ajith: ఓటు హక్కును వినియోగించుకున్న హీరో అజిత్, షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన తమిళ నటుడు, సెల్ఫీ తీస్తున్న అభిమాని నుంచి ఫోన్ లాక్కుని తరువాత క్షమాపణ చెప్పిన అజిత్
Hazarath Reddyతమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, సీనియర్ హీరో అజిత్ చెన్నైలో తన ఓటు వేశారు. తన అర్ధాంగి షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సాధారణ ఓటర్ల మాదిరే ఆయన క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ సందర్భంగా అభిమానులు అజిత్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీలు పడ్డారు.
Rajinikanth: ఓటు హక్కును వినియోగించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్, ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ప్రకటించని తలైవా, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన
Hazarath Reddyత‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న ఓటు హ‌క్కును ఉద‌యమే వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్‌లో ర‌జ‌నీకాంత్ ఓటేశారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్న ర‌జ‌నీకాంత్.. త‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విష‌యం తెలిసిందే.
Thalapathy Vijay: సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన నటుడు విజయ్, అభిమానులతో సెల్ఫీలకు పోజులు, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Hazarath Reddyతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ సైకిల్‌పై వచ్చి ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో విజయ్‌ వేగంగా సైకిల్‌ తొక్కుతూ పోలింగ్‌ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయన వెంట బైక్‌లతో అనుసరించారు.
P Balachandran Dies: ప్రముఖ నటుడు పి. బాలచంద్రన్ కన్నుమూత, అంకుల్ బన్ సినిమాతో వెండి తెరకు పరిచయం, కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డును అందుకున్న సినీ రచయిత
Hazarath Reddyప్రముఖ మలయాళ నటుడు, సినీ రచయిత పి. బాలచంద్రన్(69) కన్నుమూశారు. గత ఎనిమిది నెలలుగా అనాగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య శ్రీలత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 1991లో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘అంకుల్ బన్’ అనే సినిమాతో ఆయన స్క్రీన్ రైటర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు.పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా కథ, మాటలు అందించారు.
Akshay Kumar covid-19: అక్షయ్‌ కుమార్‌కు కరోనా, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బాలీవుడ్‌ హీరో, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తానంటూ ట్వీట్
Hazarath Reddyబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన (Akshay Kumar covid-19) పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ఇన్ స్టాగ్రామ్ (Akshay Kumar on Instagram)ద్వారా వెల్లడించారు. ‘‘ఇవాళ ఉదయం నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. వైద్యులు నాకు పాజిటివ్‌గా ధృవీకరించారు.
Roja Discharged From Hospital: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే రోజా, మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపిన డాక్టర్లు, రోజాను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
Hazarath Reddyరెండు మేజర్‌ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా శనివారం డిశ్చార్జి (Roja Discharged From Hospital) అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు.
Coronavirus in Tollywood: టాలీవుడ్‌లో కరోనా కలకలం, హీరోయిన్‌ నివేదా థామస్‌‌కు కరోనా పాజిటివ్, ట్విట్టర్ ద్వారా తెలిపిన ముద్దుగమ్మ
Hazarath Reddyహీరోయిన్‌ నివేదా థామస్‌ (Nivetha Thomas) తాజాగా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘అందరికి నమస్తే.. నేను కరోనా పాజిటివ్‌గా పరీక్షించాను. డాక్టర్‌ సలహాతో అన్ని విధాల మెడికల్‌ ప్రోటోకాల్‌ పాటిస్తూ ఐసోలేషన్‌కు వెళ్లాను. ఇటీవల నన్ను కలిసి వారంత దయచేసి హోం క్వారంటైన్‌కు వెళ్లండి.
Ajay Devgn in RRR: లోడ్.. ఎయిమ్.. షూట్! బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్‌కు డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి బర్త్ డే గిఫ్ట్
Vikas Mandaబాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ఏప్రిల్ 2న తన 52వ జన్మదిన వేడుకను జరుపుకుంటున్నారు. ఆయనకు సర్ప్రైజ్ బహుమతిగా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి RRR సినిమా నుండి అజయ్ దేవ్‌గన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
Dinner for Wild Dog: 'వైల్డ్ డాగ్' కోసం నోరూరించే డిన్నర్ రెడీ చేసిన మెగాస్టార్! కిచెన్‌లో చిరు- నాగ్ కలిసి ఉన్న ఫోటో వైరల్
Vikas Mandaకింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. అంతకుముందు రోజు చిరంజీవి స్వయంగా తనకోసం డిన్నర్ రెడీ చేశారని చూపిస్తూ నాగార్జున ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు..