Entertainment

Manchu Family Issue: జల్‌పల్లిలో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం...మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోసిన విష్ణు..మనోజ్ ఇంటికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది. మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోశారు విష్ణు . మంచు మనోజ్‌ ఇంటికి ని విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పహాడీషరీఫ్‌ పీఎస్‌ లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు మనోజ్.

Allu Arjun Meets Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్, సతీమణి స్నేహతో కలిసి చిరును కలిసిన బన్నీ..వైరల్‌గా ఫోటోలు

Arun Charagonda

మెగాస్టార్ చిరంజీవిని కలిశారు నటుడు అల్లు అర్జున్. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన బన్నీ...కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి చిరంజీవిని క‌లిశారు. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో అరెస్ట్ అయిన బ‌న్నీ జైలు నుంచి రిలీజైన త‌ర్వాత చిరంజీవిని క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జైలు నుంచి రిలీజైన బ‌న్నీని సినీ ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శించారు.

Mohan Babu: జర్నలిస్టు రంజిత్‌ను కలిసి నటుడు మోహన్ బాబు, కుటుంబ సభ్యులకు సారీ చెప్పిన మోహన్ బాబు

Arun Charagonda

జర్నలిస్ట్ రంజిత్ ను కలిసి బహిరంగ క్షమాపణ చెప్పారు నటుడు మోహన్ బాబు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను పరామర్శించి రంజిత్‌కు, ఆయన కుటుంబసభ్యులకు సారీ చెప్పారు.

Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్...స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన బన్నీ...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్, చంచల్‌గూడ జైలుకు తరలింపు, ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో బన్నీ జైలు నుండి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. ఇక ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు నటుడు అల్లు అర్జున్. స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వచ్చారు అల్లు అర్జున్.

Advertisement

Bigg Boss Season 8: నేడు బిగ్‌ బాస్ సీజన్ 8 కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత.. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే..

Rudra

ప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ నేటితో ముగియనుంది. దాదాపు వంద రోజులపాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు.

Sree Leela On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించిన హీరోయిన్ శ్రీలీల

Arun Charagonda

ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. ఇక ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమని, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించారు.

Mohan Babu: ఎక్కడికి పారిపోలేదు..రూమర్స్‌ని ఖండించిన నటుడు మోహన్ బాబు, తప్పుడు ప్రచారం చేయోద్దని అందరికీ విజ్ఞప్తి

Arun Charagonda

తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు నటుడు మోహన్ బాబు. తాను పారిపోలేదు-ఎటూ పోలేదు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇంట్లోనే ఉన్నాను ట్రీట్మెంట్ లో ఉన్నాను అని తెలిపారు. తప్పుడు ప్రచారం చేయొద్దు-మీడియా నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Allu Arjun: మరోసారి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్, రేవతి కుటుంబానికి అండగా ఉంటాం..బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడి

Arun Charagonda

అభిమానుల ప్రేమ, మద్దతుకు సినీనటుడు అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన...తనపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటాం... సంధ్య థియేటర్‌లో జరిగింది అనుకోని ఘటన అందులో నా ప్రమేయం లేదు అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పారు.

Advertisement

Rana At Allu Arjun Home: బన్నీని పరామర్శించిన రానా, గట్టిగా హాగ్ చేసుకుని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్...వీడియోలు ఇవిగో

Arun Charagonda

ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. రానా దగ్గుబాటిని గట్టిగా హాగ్ చేసుకోని ఎమోషనల్ అయ్యాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా బన్నీ ఫోన్ కింద పడగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Allu Aravind: అల్లు అర్జున్ ఎపిసోడ్..మీడియాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన అల్లు అరవింద్...వీడియో

Arun Charagonda

ఇవాళ ఉదయం చెంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్‌ విడుదలైన సంగతి తెలిసిందే. బన్నీ నివాసానికి పెద్ద ఎత్తున సెలబ్రెటీలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు అల్లు అరవింద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారేఉ. నిన్నటి నుంచి అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేస్తున్నందుకు మీడియాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు అల్లు అరవింద్.

Allu Arjun: అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన చిరంజీవి భార్య సురేఖ, బన్నీని పరామర్శించిన విజయ్‌ దేవరకొండ, సుకుమార్...వీడియోలు ఇవిగో

Arun Charagonda

ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారు చిరంజీవి భార్య, మేనత్త సురేఖమ్మ. అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని బన్నీకి ధైర్యం చెప్పారు హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్, పుష్ప సినిమా నిర్మాతలు .

Allu Arjun Released: చట్టానికి కట్టుబడి ఉంటా.. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్.. తండ్రిని చూడగానే పరిగెత్తుకొచ్చిన అయాన్ (వీడియోలతో)

Rudra

చట్టానికి తాను కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు.

Advertisement

Allu Arjun Released: అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సీఐ బానోతు రాజు నాయక్.. బన్నీకి నాయక్ వీరాభిమాని??

Rudra

అల్లు అర్జున్ ను నిన్న అరెస్టు చేసిన పోలీసు అధికారి సీఐ బానోతు రాజు నాయక్ అని తెలిసింది. ఆయన బన్నీకి వీరాభిమాని అని కొందరు చెప్తున్నారు. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Allu Arjun Released: నాన్న వస్తాడని ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ (వీడియో)

Rudra

విడుదలైన నాన్న ఎప్పుడు ఇంటికి వస్తారంటూ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇంట్లో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Allu Arjun At Geetha Arts Office: జైలు నుంచి డైరెక్టుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు అల్లు అర్జున్.. కార్యాలయానికి క్యూకట్టిన పలువురు సినీ ప్రముఖులు

Rudra

జైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని అంతా భావించారు. అయితే, ఆయన ఎస్కార్ట్ వాహనంతో, భారీ భద్రత నడుమ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు.

Allu Arjun Released: అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697.. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా తీసుకోని పుష్పరాజ్..

Rudra

నిన్న రాత్రంతా చంచల్‌ గూడ జైలులో గడిపి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్‌ పత్రాలు ఆన్‌ లైన్‌ లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Allu Arjun Released: చంచల్‌ గూడ జైలు నుంచి ఎట్టకేలకు అల్లు అర్జున్ విడుదల.. మీడియా కంట పడకుండా భారీ ఎస్కార్ట్ మధ్య ప్రిజన్స్ అకాడమీ గేటు నుంచి పుష్పను పంపించిన చంచల్‌ గూడ జైలు అధికారులు (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయంశమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Bandi Sanjay Reaction on Allu Arjun Arrest: మీ చేత‌గాని త‌నాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారా? నిప్పులు చెరిగిన బండి సంజ‌య్

VNS

అల్లు అర్జున్ న‌టించిన `పుష్ఫ-2`(Pushpa-2).. పాన్ ఇండియా సినిమా అని రాష్ట్ర ప్ర‌భుత్వంతోపాటు ప్ర‌పంచ‌మంతా తెలుసున‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. ఒక సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా షరా మామూలే కదా అని గుర్తు చేశారు.

Ashwini Vaishnaw Reaction on Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ను త‌ప్పుబ‌ట్టిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్, క్రియేటివ్ ఇండ‌స్ట్రీపై గౌర‌వం లేదా? అంటూ ప్ర‌శ్న‌

VNS

అల్లు అర్జున్‌ అరెస్టుపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) స్పందించారు. క్రియేటివ్‌ ఇండస్ట్రీపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం వైఫల్యంతోనే సంధ్య థియేటర్‌ వద్ద దుర్ఘటన చోటుచేసుకుందన్నారు.

Ram Gopal Varma Reacts On Allu Arjun Arrest: దేవుడ్ని అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ పై రామ్ గోపాల్ వ‌ర్మ నాలుగు ప్ర‌శ్నలు

VNS

అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు (Bail For Allu Arjun) చేయాలని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement
Advertisement