Entertainment

Shilpa Shetty's Juhu House Robbed: హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్లో దొంగతనం, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు

Hazarath Reddy

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి నివాసం ఉంటున్న జుహూ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. PTI ప్రకారం, జూన్ 15 న, గత వారం హీరోయిన్ నివాసం నుండి కొన్ని విలువైన వస్తువులు దొంగిలించబడినట్లు ఒక అధికారి పంచుకున్నారు

Woman kisses Shah Rukh Khan Video: వీడియో ఇదిగో, షారుఖ్ ఖాన్ బుగ్గను కొరికేసిన యువతి, అనుమతి లేకుండా ఇలా చేసినందుకు జైల్లో వేయాలని కామెంట్స్

Hazarath Reddy

బాలీవుడ్ బాద్ షా షారుక్.. రీసెంట్ గా దుబాయిలోని ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ఈవెంట్ కి సంబంధించిన వాళ్లతో పాటు కొందరు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందులో ఒకామె షారుక్ ఖాన్ ని చూసి ఆత్రం ఆపుకోలేకపోయింది. పర్మిషన్ లేకుండానే అతడి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసింది.

Adipurush: ఆదిపురుష్‌ సినిమా టికెట్ ధర రూ. 2200, ఎగబడి కొంటున్న ప్రభాస్ ఫ్యాన్స్, అనేక చోట్ల నిమిషాల్లోనే హౌస్‌ఫుల్‌ బోర్డులు

Hazarath Reddy

జూన్‌ 16వ తేదీన ప్రభాస్ ఆదిపురుష్‌ థియేటర్లలో సందడి చేయనుంది. ఆదిపురుషుడి అవతారంలో ప్రభాస్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆదిపురుష్‌ హ్యాష్‌ ట్యాగ్‌(#AdipurushBookings, #Prabhas𓃵, #AdipurushOnJune16) ట్రెండింగ్‌లో ఉంది.ఈ నేపథ్యంలో టికెట్లు భారీ రేట్లు పలుకుతున్నాయి.

Tirthanand Rao Threatens to Suicide: ఫేస్‌బుక్‌ లైవ్‌లో విషం తాగి ప్రముఖ హాస్యనటుడు ఆత్మహత్యాయత్నం, సహజీవనం చేసిన మహిళ బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపణలు

Hazarath Reddy

బాలీవుడ్‌లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' హాస్యనటుడు తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు.

Advertisement

Kazan Khan Dies: సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ మృతి, విలన్ రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న మలయాళి నటుడు

Hazarath Reddy

తమిళ, మలయాళ సినిమాల్లో విలన్ రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న కజాన్ ఖాన్.. జూన్ 12న అంటే సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎమ్ బాదుషా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 1992లో సెంతమిళ్ పట్టు (తెలుగులో 'అమ్మకొడుకు') అనే మూవీతో కజాన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Tamannaah-Vijay Verma Dating: ఎంసీఏ విలన్ తో ప్రేమ బంధాన్ని ఒప్పుకున్న తమన్నా.. కొన్నాళ్లుగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న మిల్కీ బ్యూటీ

Rudra

బాలీవుడ్ నటుడు, నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ పాత్ర పోషించిన విజయ్ వర్మతో సంబంధంపై మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్టకేలకు పెదవి విప్పింది. ఆయనతో ప్రేమ నిజమేనని ఒప్పుకుంది.

Sudigali Sudheer: యాంకర్ రష్మీకి షాక్ ఇచ్చి, పెళ్లి చేసుకోబుతున్న సుడిగాలి సుధీర్, అమ్మాయి ఎవరో తెలుసా..?

kanha

తాజాగా సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది. వాళ్ల చుట్టాలమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

Prabhudeva Welcomes Baby Girl: మళ్లీ తండ్రి అయిన ప్రభుదేవా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రెండవ భార్య హిమానీ సింగ్‌

Hazarath Reddy

ప్రభుదేవా మళ్లీ తండ్రి అయ్యారు! అవును, మీరు చదివింది నిజమే. నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ఇటీవల తన మొదటి బిడ్డను రెండవ భార్య హిమానీ సింగ్‌తో స్వాగతించారు. దంపతులు ఆడబిడ్డకు స్వాగతం పలికారు. ప్రభుదేవా ఇప్పటికే తన మాజీ భార్య రమలత్‌తో ముగ్గురు కుమారులకు తండ్రి. అయినప్పటికీ, వారి మొదటి బిడ్డ 2008లో మరణించారు.

Advertisement

Saptagiri to Join TDP: టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్న స్టార్ కమెడియన్ సప్తగిరి, చంద్రబాబు ఆదేశిస్తే చిత్తూరు జిల్లా నుంచి పోటీకి రెడీ అంటున్న నటుడు

Hazarath Reddy

రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు, స్టార్ కమెడియన్ సప్తగిరి ప్రకటించారు. తాను త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కమెడియన్ వెల్లడించారు.

Adipurush; ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టిక్కెట్లు.. జిల్లాలోని ప్రతి గ్రామంలోగల రామాలయానికి 101 ఉచిత టిక్కెట్లు

Rudra

తెలుగు ప్రేక్షకులే కాదు యావత్తు పాన్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ ‘ఆదిపురుష్’పై వస్తున్న కొత్త అప్డేట్స్ పై ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

Yash Dance Video: దుమ్మురేపే డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన కేజీఎఫ్‌ స్టార్‌, సీనియర్ నటి సుమలత తనయుడి పెళ్లిలో వైరల్‌గా మారిన యశ్ డ్యాన్స్‌

VNS

పెళ్లి అనంతరం జరిగిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్ లో యశ్ మరియు మరో స్టార్ హీరో దర్శన్‌ (Darshan Thoogudeepa) పాల్గొని సందడి చేశారు. మ్యూజికల్ నైట్ లో కొత్త జంటతో కలిసి యశ్ అండ్ దర్శన్ స్టేజి పై డాన్స్ చేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Kangana Ranaut Viral Post: సుశాంత్ సింగ్ చనిపోవడానికి వాళ్లే కారణం! పేర్లు వెల్లడిస్తూ సంచలన పోస్టు పెట్టిన కంగనా రనౌత్, నెట్టింట వైరల్‌గా మారిన కంగనా ఇన్‌స్టా పోస్ట్

VNS

కంగనా తాజాగా మరోసారి సంచలన పోస్ట్ లు చేసింది. తన ఇన్‌స్టా స్టోరీలో కంగనా ఇలా రాసుకొచ్చింది.. “సినీ ఇండస్ట్రీలో రకరకాల బెదిరింపులు ఉంటాయి. కానీ ఈ దుర్యోధనుడు (తెల్ల ఎలుక), శకుని (పాప జో) చేసే వేధింపులు మరింత దారుణంగా ఉంటాయి. ఈ ఇద్దరు వాళ్లకి వాళ్లు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖగా ఫీలవతుంటారు.

Advertisement

Ram Charan Buy Adipurush Tickets: అనాథలకు ఉచితంగా ఆదిపురుష్‌ మూవీ చూపించనున్న రామ్‌చరణ్, 10వేల టికెట్లు బుక్‌ చేసినట్లు వార్తలు!

VNS

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram charan) సైతం 10వేల టికెట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనాథ పిల్లల కోసం టికెట్లు కొనుగోలు చేసి సినిమాను చూపించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. అలాగే అభిమానులకు సైతం ప్రత్యేకంగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

Adipurush Movie New Song: 'ఆదిపురుష్' నుంచి 'శివోహం' సాంగ్ రిలీజ్.. వీడియో ఇదిగో..

Rudra

ప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా చేసిన పౌరాణిక చిత్రమే 'ఆది పురుష్'. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం 'శివోహం' అనే పాటను రిలీజ్ చేశారు.

Bhagavanth Kesari Teaser: తెలంగాణ యాసలో బాలయ్య దూకుడు.. ‘భగవంత్ కేసరి' టీజర్ రిలీజ్

Rudra

బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమా రూపొందుతోంది. ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు.

Saran Raj Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, తప్పతాగి అసిస్టెంట్ డైరక్టర్‌ని కారుతో గుద్దిన మరో నటుడు, తమిళ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరన్‌రాజ్‌ మృతి

Hazarath Reddy

తమిళ సినిమా నటుడు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరన్‌రాజ్‌ (29) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తమిళ సినీ పరిశ్రమకే చెందిన మరో నటుడు పళనియప్పన్‌ తప్పతాగి కారు నడుపుతూ.. బైక్‌పై వెళ్తున్న శరన్‌ రాజ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శరన్‌ రాజ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు

Advertisement

Jabardasth Punch Prasad Health: జబర్దస్త్ కమెడియన్‌కి అండగా ఏపీ ప్రభుత్వం, పంచ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని తెలిపిన ఏపీ సీఎంఓ

Hazarath Reddy

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్‌ కమెడియన్‌ నూకరాజు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు

Willi Ninja Google Doodle: విల్లి నింజా 62వ జయంతి, గాడ్‌ఫాదర్ ఆఫ్ వోగింగ్ ప్రసిద్ధి చెందిన ప్రముఖ డాన్సర్, గూగుల్ డూడుల్ ద్వారా నివాళి

Hazarath Reddy

విల్లీ నింజా ఒక ఐకానిక్ డాన్సర్, కొరియోగ్రాఫర్. సెప్టెంబరు 2006లో 45 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ప్రశంసలు పొందిన ప్రదర్శనకారుడు 'గాడ్‌ఫాదర్ ఆఫ్ వోగింగ్'గా పిలువబడ్డాడు. 1980లు, 90లలో 'బ్లాక్ LGBTQ+ ప్రాతినిధ్యం, అంగీకారానికి' మార్గం సుగమం చేసిన లెజెండ్‌ను Google Doodle గా జరుపుకుంటుంది

Varun Tej and Lavanya Tripathi Engagement: కార్డు ఇదిగో, రేపే వరుణ్‌, లావణ్య త్రిపాటి నిశ్చితార్థం, ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లుగా వార్తలు

Hazarath Reddy

మెగా' వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాటి పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు (జూన్‌ 9)న హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనుంది.

Adipurush Fake Poster: ఆదిపురుష్ మూవీ చూసేందుకు దళితులకు ధియేటర్లలోకి ప్రవేశం లేదంటూ వార్త వైరల్, పోస్టర్‌ను ఎవరు వైరల్ చేయవద్దని, కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఎస్పీ హెచ్చరిక

Hazarath Reddy

ఆదిపురుష్ చిత్ర పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తిరుపతి పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ చిత్రం ప్రొడక్షన్/డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు పోస్టర్‌లోని విషయాలను తిరస్కరించాయి. ఈలాంటి వార్తలను ప్రజల ఎవ్వరు నమ్మవద్దని ఇందులో ఎలాంటి నిజాలు లేవని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Advertisement
Advertisement