Entertainment

Balakrishna 108th Film Title: బాలయ్య 108 మూవీ టైటిల్ ఖరారు, బర్త్‌ డే కు రెండు రోజుల ముందే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌, భగవంత్ కేసరిగా ముందుకొస్తున్న నటసింహం

VNS

గాడ్ ఆఫ్ మాసెస్, నట‌సింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయుడిగా నటిస్తున్న 108వ చిత్రానికి టైటిల్ (Nandamuri Balakrishna Movie) ఖారారైంది. గురువారం ఉదయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్య సినిమాకు ‘భగవంత్ కేసరి’ (Bhagavant kesari) అనే టైటిట్ ఖరారు చేశారు. ‘ఐ డోంట్ కేర్’ అని ఉప శీర్షిక ఇచ్చారు.

Gitanjali Aiyar Passed Away: మూడుదశాబ్దాల పాటూ దేశప్రజలకు వార్తలు వినిపించిన ఆమె ఇక లేరు, తొలితరం ఇంగ్లీష్ న్యూస్ రీడర్‌ గీతాంజలీ అయ్యర్ మరణంపై కేంద్రమంత్రి సంతాపం

VNS

దేశంలో తొలితరం మహిళా ఇంగ్లిష్‌ న్యూస్‌ యాంకర్లలో (News anchor) ఒకరైన గీతాంజలి అయ్యర్‌ (Gitanjali Aiyar) కన్నుమూశారు. గతకొంతకాలంగా పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) సంతాపం తెలిపారు.

Om Raut Kissing Kriti Sanon Video: ఆదిపురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ ముద్దు వీడియో ఇదిగో, కృతి సనన్ వెళ్లిపోతుండగా కిస్ పెట్టి వీడ్కోలు

Hazarath Reddy

కృతి సనన్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓం రౌత్‌ ఆమెకు ముద్దు పెట్టి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తిరుమల కొండపై ఇలా చేయడం ఏంటని దర్శకుడి తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Prabhas Comments On Marriage: నా పెళ్లి తిరుపతిలోనే! కృతి సనన్ పక్కన ఉండగానే ఆదిపురుష్‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పెళ్లిపై స్పందించిన ప్రభాస్

VNS

ఆదిపురుష్ వేడుకలో ప్రభాస్ (Prabhas) మాట్లాడుతుండగా ఫ్యాన్స్ పెళ్లి.. పెళ్లి అని గోల చేశారు. దానికి ప్రభాస్ స్పందించి..పెళ్లా..? పెళ్లి గ‌నుక చేసుకొంటే ఇక్కడే.. ఈ తిరుప‌తిలోనే చేసుకొంటా అంటూ చెప్పాడు. ఇక ఇలానే ప్రతీసారి ప్రభాస్ పెళ్లి (Prabhas Comments On Marriage) వార్తలపై ఫన్నీగా చెబుతుంటాడు.

Advertisement

Adipurush Event: వీడియో ఇదిగో, ఆదిపురుష్ ఈవెంట్లో ఓ వ్యక్తి చెంప పగలగొట్టిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌..

Hazarath Reddy

అదిపురుష్ ఈవెంట్ లో బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒళ్లు మండి వారిని చితకబాదారు. మా స్టార్ ఈవెంట్లో మీ గోల ఏందంటూ ఉతికి ఆరేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Adipurush Final Trailer: ఆదిపురుష్‌ ఫైనల్‌ ట్రైలర్‌ మామూలుగా లేదుగా! యాక్షన్‌ సన్నివేశాలతో హైప్‌ ఎక్కించిన ఓం రౌత్, తిరుపతిలో గ్రాండ్‌ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతాకాదు

VNS

మరో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న ఆదిపురుష్ (Adipurush) సినిమాపై తిరుగులేని హైప్ ఏర్పడింది. మంగళవారం విడుదలైన పైనల్ ట్రైలర్ తో (Adipurush) అంచనాలు ఆకాశాన్నంటాయి. ఎప్పుడెప్పుడు జూన్ 16 వస్తుందా అని ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

Seat For Lord Hanuman: ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడికి ఓ సీటు రిజర్వ్.. రామ భక్తుల నమ్మకాన్ని గౌరవించేందుకేనని టీమ్ ప్రకటన.. ఈ నెల 16న తెలుగు సహా ఐదు భాషల్లో ఆదిపురుష్ విడుదల

Rudra

రామాయణ పారాయణం, రామనామ స్మరణ ఎక్కడ జరిగినా చిరంజీవిగా పిలిచే ఆంజనేయుడు అక్కడికి వస్తాడని హిందువుల నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ సినిమా టీం తాజాగా ఓ ప్రకటన చేసింది. శ్రీరాముడి కథతో తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శనల్లో ప్రతీ థియేటర్ లో ఓ సీటును హనుమంతుడికి రిజర్వ్ చేస్తామని వెల్లడించింది.

Prabhas In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్.. పట్టు వస్త్రాలతో సత్కరించిన ఆలయ అధికారులు.. వీడియో ఇదిగో

Rudra

తిరుపతిలో నేడు ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement

Shaitan Trailer Out: పచ్చిబూతులు, అడల్ట్‌ సన్నివేశాలతో మరో వెబ్ సిరీస్, మహి వి. రాఘవ్‌ సైతాన్‌ ట్రైలర్ ఇదిగో, జూన్‌ 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌

Hazarath Reddy

సేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన యాత్ర మూవీ దర్శకుడు మహి వి. రాఘవ్‌ తొలి సిరీస్‌తోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇదే జోష్‌లో సైతాన్‌ అనే మరో వెబ్‌ సిరీస్‌తో ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి కామెడీ జానర్‌ కాకుండా క్రైమ్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు

Telugu Indian Idol 2 Winner: తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్-2‌ విజేతగా సౌజన్య, అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీతో పాటు రూ.10 ల‌క్షల నగదు బహుమతి

Hazarath Reddy

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్-2‌’ విన్నర్ గా సౌజన్య నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. విన్నర్ గా సౌజన్య రూ.10 ల‌క్షల నగదు బహుమతి కూడా కైవసం చేసుకుంది.

Actor Kollam Sudhi Dies: ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు కొల్లం సుధి మృతి, ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా కారు ప్రమాదం

Hazarath Reddy

రళలోని కైపమంగళం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి (39) మృతి చెందారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు.. మిమిక్రీ ఆర్టిస్ట్ బిను అడిమాలు, ఉల్లాస్, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వటకరలోని ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది

Gufi Paintal Dies: మహాభారత్‌లో శకుని మామ పాత్ర నటుడు మృతి, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మరణించిన గుఫీ పెంటల్

Hazarath Reddy

BR చోప్రా TV షో మహాభారత్ (1980) లో శకుని మామ పాత్రను పోషించిన ప్రసిద్ధి చెందిన నటుడు గుఫీ పెంటల్, వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా సోమవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 79.నటుడి కుటుంబం ఒక ప్రకటనలో, “ప్రగాఢమైన దుఃఖంతో మా తండ్రి మిస్టర్ గుఫీ పెంటల్ (శకుని మామా) యొక్క విచారకరమైన మరణాన్ని తెలియజేస్తున్నామని తెలిపారు.

Advertisement

Bhola Shankar First Single: భోళాశంకర్‌ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్, మెగాస్థార్‌ మాస్‌ క్రేజ్‌కు తగ్గట్లు భోళా మ్యానియా సాంగ్‌

VNS

భోళా మ్యానియా అంటూ సాగే ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని అందించగా శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. పక్కా మాస్ బీట్ తో ఉన్న ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ని బాగా అలరించేలా ఉంది. ఇక ఈ సాంగ్ లో చిరు వేసిన గ్రేస్ స్టెప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

Nikhil: హీరో నిఖిల్‌ కొత్త సినిమా లుక్‌ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే??

Rudra

హీరో నిఖిల్‌ (Nikhil) పుట్టినరోజు సందర్భంగా తన 20వ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. భరత్‌ కృష్ణమాచారి (Bharath krishnamacharya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘స్వయంభూ’ (Swayambhu) అనే టైటిల్‌ ఖరారు చేశారు.

Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ అసలు పేరేంటో తెలుసా? ఈ మాస్‌ కా దాస్‌ పేరు ఎందుకు మార్చుకున్నాడో తెలుసా?

Rudra

యూత్‌ఫుల్‌, లవ్‌, కమర్షియల్‌ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా ప్రేక్షకులకు చేరువైన విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే విశ్వక్ అసలు పేరు దినేశ్‌ నాయుడు అని చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.

Naatu Naatu in Ukraine: జెలెన్‌స్కీ ఇంటి ఎదుట 'నాటు-నాటు' స్టెప్పులేసి దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు

Rudra

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సినిమా ఇండస్ట్రీ హిట్ అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ అవార్డు కూడా వచ్చింది.

Advertisement

Sharwanand and Rakshita Reddy Marriage: హీరో శర్వానంద్‌-రక్షితా రెడ్డి పెళ్లి వేడుక షురూ, హల్దీ కార్యక్రమం వీడియో వైరల్‌

Hazarath Reddy

హీరో శర్వానంద్‌ పెళ్లి వేడుక షురూ అయ్యాయి. ఇందుకోసం రాజస్తాన్‌లోని జైపూర్‌ ప్యాలెస్‌ సుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూ, వారి కుటుంబాలు ప్యాలెస్‌లో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అందులో భాగంగా మొదట హల్దీ ఫంక్షన్‌ జరిగింది

First Day First Show: సినిమా విడుదలైన వెంటనే మొదటి షో ఇంటి నుండే చూసేయవచ్చు, ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

కొత్త సినిమా విడుదలైన రోజే ప్రజలు ఇంటి వద్దే వీక్షించేలా ఏపీ ప్రభుత్వం ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అమలు చేస్తున్న ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.

Singer Nisha Upadhyay Injured: లైవ్‌షోలో ప్రముఖ సింగర్ నిషా ఉపాధ్యాయపై తుఫాకీతో కాల్పులు, ఎడమ కాలికి బుల్లెట్‌ తగలడంతో తీవ్ర గాయాలు

Hazarath Reddy

భోజ్‌పురి ప్రముఖ సింగర్‌ నిషా ఉపాధ్యాయపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బీహార్‌ ( Bihar) లోని పాట్నాలో నిర్వహించిన ఓ లైవ్‌ షో (Live Show) లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నిషా ఎడమ కాలికి బుల్లెట్‌ (bullet) తగిలి గాయమైనట్లు సమాచారం.

Alia Bhatt Grandfather Dies: ప్రముఖ నటి అలియాభట్ ఇంట తీవ్ర విషాదం, వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో పోరాడి తుదిశ్వాస విడిచిన ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌

Hazarath Reddy

ప్రముఖ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌(93) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు

Advertisement
Advertisement