Adipurush Day-1 Collection: బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ రికార్డు.. తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
తొలిరోజు వసూళ్లలో ఆదిపురుష్ రికార్డులు కొల్లగొట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా తొలిరోజు 95 నుంచి 100 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ రికార్డును ఆదిపురుష్ చెరిపేసింది.
Hyderabad, June 17: తొలిరోజు వసూళ్లలో ఆదిపురుష్ (Adipurush) రికార్డులు కొల్లగొట్టింది. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఈ సినిమా తొలిరోజు 95 నుంచి 100 కోట్లు (100 Crores) రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ రికార్డును ఆదిపురుష్ చెరిపేసింది. ఆదిపురుష్ హిందీ వెర్షన్ తొలిరోజు వసూళ్లు రూ.30 కోట్లు.. మిగతా భాషల్లో రూ.70 కోట్ల వరకూ ఆర్జించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తెలుగు వెర్షన్ కు ప్రభాస్ ఫ్యాన్స్ పట్టం కట్టారు. సినిమా తొలి రోజు వసూళ్లలో మెజారిటీ షేర్ ను తెలుగు ప్రేక్షకులే ఆర్జించి పెట్టినట్లు తెలుస్తోంది.
Manchu Manoj Adipurush: అనాథ పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూయించిన మంచు మనోజ్.. నెటిజన్స్ ప్రశంసలు
#Adipurush Box Office Collection Day 1: Prabhas, Kriti Sanon-starrer off to a record breaking start, mints nearly Rs 100 cr #AdipurushReview https://t.co/NMg4R1Or1v
— Business Today (@business_today) June 17, 2023
ప్రభాస్ ఫ్యాన్స్ దాడి
మరోవైపు ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సినిమా బాగాలేదన్నాడని హైదరాబాద్ లో ఓ ప్రేక్షకుడిపై ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ సినిమాపై హిందూ సేన కోర్టుకెక్కింది. మతపెద్దలను కించపరిచేలా ఈ సినిమాలో చూపించారని, ఆ సన్నివేశాలను తొలగించేలా ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
(The above story first appeared on LatestLY on Jun 17, 2023 11:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

