సినిమా
Superstar Krishna Funeral: ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ ‍స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి, దహన సంస్కారాలు నిర్వహించిన కుమారుడు మహేష్ బాబు, అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు
Hazarath Reddyఅభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ ‍స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటశేఖరుడి సినీ ప్రస్థానం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో (Superstar Krishna funeral) ముగిసింది.
Superstar Krishna Funeral: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి, మహేష్ బాబును హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేసిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyసూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి అర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం జగన్‌. కృష్ణ కొడుకు మహేష్ బాబును హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కుటుంబ సభ్యులను సీఎంకు పరిచయం చేశారు.
Superstar Krishna Funeral: కాసేపట్లో పద్మాలయా స్టూడియోకు సీఎం వైఎస్‌ జగన్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించనున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyనటశేఖరుడు, తెలుగు ఇండస్ట్రీ సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM Jagan) హైదరాబాద్ వెళ్లారు. కాసేపట్లో పద్మాలయా స్టూడియోకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకుని కృష్ణకు నివాళుల అర్పించనున్నారు.
Super Star Krishna Funeral: రేపు సూపర్‌స్టార్‌కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పించనున్న సీఎం జగన్, బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సినీనటుడు, స్టార్‌ హీరో మహేశ్‌బాబు తండ్రి సూపర్‌స్టార్‌కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Superstar Krishna No More: హీరో కృష్ణ మృతికి తెలుగులో సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని వెల్లడి
Hazarath Reddyకృష్ణ మృతి వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.
Superstar Krishna Funeral: వీడియో, మహేశ్ బాబు పక్కనే కూర్చుని ఓదార్చిన అల్లు అర్జున్, ప్రిన్స్‌ను హత్తుకుని ఆత్మీయంగా పలకరించిన బన్నీ
Hazarath Reddyహైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో విషాద వాతావరణం నెలకొంది. కృష్ణ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా కృష్ణ నివాసానికి వచ్చారు. తీవ్ర విచారంతో ఉన్న కృష్ణ తనయుడు మహేశ్ బాబును ఆత్మీయంగా హత్తుకుని పరామర్శించారు.
Superstar Krishna Funeral: ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు, మంచి మిత్రుడుని కోల్పోయాం, కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం
Hazarath Reddyకృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం వెంట మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్‌ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి ఉన్నారు.
Superstar Krishna Funeral: సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు, ఆయన లేని లోటు తీరనిదంటూ భావేద్వేగానికి గురైన హీరోలు
Hazarath Reddyటాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు. వారిలో సినీ హీరోలు, రాజకీయ నాయకులు ఉన్నారు.
Super Star Krishna No More: సూపర్ స్టార్ కృష్ణ ఇంటి నుంచి లైవ్ కార్యక్రమం, కడ చూపు కోసం కృష్ణ నివాసానికి తరలివస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు
Hazarath Reddyసూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని హాస్పిటల్ నుంచి నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు.
Superstar Krishna No More: తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరం, సూపర్ స్టార్ మృతిపై సంతాపం తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Hazarath Reddyమాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూపర్ స్టార్ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్‌ చేస్తూ..ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు పరమపదించటం అత్యంత విచారకరం. వారు ఎంచుకునే పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవి.
Superstar Krishna No More: కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారని ట్వీట్ చేసిన వర్మ
Hazarath Reddyసంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కృష్ణ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్‌ చేస్తూ.. ‘కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వారిద్దరు కలిసి ఆనందంగా అక్కడ మంచి సమయాన్ని గుడుపుతుంటారని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు.
Superstar Krishna No More: సూపర్ స్టార్ కృష్ణ మరణం చిత్ర సీమకు తీరని లోటని తెలిపిన సీఎం కేసీఆర్, నిజ జీవితంలో కూడా మనసున్న మనిషి అని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం కృష్ణ కన్నుమూతపై సంతాపం ప్రకటించారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.
Superstar Krishna No More: కృష్ణగారి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటని తెలిపిన సీఎం జగన్, నిజ జీవితంలో కూడా మనసున్న మనిషి అని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyసినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు
Superstar Krishna No More: కృష్ణ మరణం తీరని లోటుని ట్వీట్ చేసిన రజినీకాంత్, సూపర్‌స్టార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం
Hazarath Reddyనవంబర్ 15న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు రజనీకాంత్‌..సూపర్ స్టార్ ని కోల్పోయినందుకు సంతాపం తెలుపుతూ ట్విట్టర్‌లోకి వెళ్లారు. తెలుగు దిగ్గజ నటుడితో కలిసి మూడు సినిమాల్లో పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, తన పోస్ట్‌లో “కృష్ణగారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తెలిపారు.
Mahesh Lost Three Family Members: ఏడాదిలో ముగ్గురిని కోల్పోయిన మహేశ్ బాబు.. ఈ ఏడాది జనవరి 8న సోదరుడు రమేశ్‌బాబు.. సెప్టెంబరు 28న తల్లి ఇందిరాదేవి.. ఆ విషాదం నుంచి తేరుకోకముందే నేడు తండ్రి కృష్ణ మృతి
Sriyansh Sటాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు జీవితంలో ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాదిలో ఆయన ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం అందరితో కన్నీళ్లు తెప్పిస్తోంది.
Krishna No More: తొలి తెలుగు కౌబాయ్ కు టాలీవుడ్ అశ్రు నివాళి.. ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణంపై ప్రముఖుల స్పందన ఇది..
Sriyansh Sప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నారు.
Krishna No More: దివికేగిన ధ్రువతార.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం.. లైవ్ స్ట్రీమింగ్..
Sriyansh Sప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Super Star Krishna Dies: ఇండియన్ జేమ్స్ బాండ్ ఇకలేరు.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం.. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. విషాదంలో అభిమానులు
Sriyansh Sప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
DMK Murali Dies: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూత, మురళి మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం
Hazarath Reddyటాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.
SuperStar Krishna Health Update: సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేసిన వైద్యులు,మరో 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వెల్లడి
Hazarath Reddyటాలీవుడ్ సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉందని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉంది. సుమారు మధ్యరాత్రి సమయంలో గుండెపోటుకు గురయ్యారు.