సినిమా

67th National Film Awards: తెలుగు సినిమాకు అయిదు జాతీయ అవార్డులు, సత్తా చాటిన నాని జెర్సీ, మహేష్ బాబు మహర్షి సినిమాలు, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌

Hazarath Reddy

67వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు చెందిన రెండు సినిమాలు ఐదు అవార్డులతో సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో (67th National Film Awards) సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’కి మూడు అవార్డులు, న్యాచురల్‌ స్టార్‌ నాని సినిమా ‘జెర్సీ’కి రెండు అవార్డులు (Tollywood industry gets 5 national awards) దక్కాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంతో మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించే ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్‌రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ అవార్డులు పొందాయి.

67th National Film Awards Winners List: హీరో నాని జెర్సీ సినిమాకు జాతీయ స్థాయి అవార్డు, జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణి కర్ణిక)‌,ఉత్తమ నటుడిగా మనోజ్‌ బాజ్‌పాయ్ (భోంస్లే), ధనుష్ (అసురన్)

Hazarath Reddy

67 వ జాతీయ చిత్ర పురస్కారాలను న్యూ ఢిల్లీలో సోమవారం ప్రకటించారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలను (67th National Film Awards Winners List) సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ విన్నర్స్ లిస్టు ని కేంద్రం ప్రకటించింది. ఈ వేడుకలో 2019 సంవత్సరానికి సినిమాలు మరియు కళాకారులకు గౌరవాలు లభిస్తాయి. ఈ పురస్కారాలు మొదట్లో గత ఏడాది మేలో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా నిరవధికంగా ఆలస్యం అయ్యాయి.

Thellavarithe Guruvaram Event: తెల్లవారితే గురువారం..ఎమోషనల్ అయిన జూనియర్, జక్కన్న, కీరవాణిల కుటుంబంపై ప్రశంసలు, కొడుకులు గొప్పోళ్లు అయితే తండ్రి ఆనందం ఇలానే ఉంటుందని తెలిపిన ఎన్టీఆర్

Hazarath Reddy

మా అబ్బాయిలు అభయ్, భార్గవ్‌ వారికి ఇష్టం వచ్చిన రంగంలో ఏదైనా సాధించిన రోజు వాళ్ల గురించి నేను మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగానూ, బ్లాంక్‌గానూ ఉంటానో.. నా తమ్ముళ్లు భైరవ, సింహా సాధించిన విజయం, స్థానం గురించి మాట్లాడటానికి మాటలు, పదాలు సమకూర్చుకోలేకపోతున్నా.

Nagarjuna COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న నాగార్జున, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన, హిందీ డైరెక్ట‌ర్ తో నాగచైత‌న్య సెల్ఫీ

Hazarath Reddy

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలియజేశారు. నిన్న వ్యాక్సిన్ తీసుకున్నట్టు (Nagarjuna COVID-19 vaccine) ఆయన వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం పేర్లను నమోదు చేయించుకోవాలని చెప్పారు.

Advertisement

Oscars 2021 Nominations: భారత్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు, ఆస్కార్ ఫైనల్ బరిలో నిలిచిన చిత్రాల లిస్టును విడుదల చేసిన ప్రియాంక- నిక్‌ జోనాస్‌ దంపతులు, ఏప్రిల్‌ 25న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో 93వ ఆస్కార్‌ అవార్డుల వేడుక

Hazarath Reddy

కరోనా వల్ల ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కొంచెం ఆలస్యం అయిన సంగతి విదితమే.కాగా ఆస్కార్ అవార్డుల వేడుక (Oscars 2021) ఎట్టకేలకు కన్పర్మ్ అయింది. 93వ ఆస్కార్‌ అవార్డుల వేడుక వచ్చే నెల ఏప్రిల్‌ 25న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో నిర్వహించనున్నారు.

JR NTR Political Entry Row: నా పొలిటికల్ ఎంట్రీ మీ చేతుల్లో, మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్, రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని దాటవేత

Hazarath Reddy

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించారు. ‘మీ పోలిటికల్‌ ఎంట్రీ ఎప్పడు’అని (JR NTR Political Entry Row) ఓ విలేక‌రి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘దీనికి మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకు నేను ఏ సమాధానం చెబుతానో కూడా మీకు తెలుసు’ అంటూ ప్రశ్న దాటేశారు.

Sanjay Leela Bhansali Coronavirus: బాలీవుడ్‌ని వెంటాడుతున్న కరోనా భయం, తాజాగా రణబీర్ కపూర్, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్, స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన నటి ఆలియా భట్‌

Hazarath Reddy

బాలీవుడ్‌క్‌ కరోనా వైరస్‌ భయం పట్టుకున్నది. ఇప్పటికే పలువురు నటులు కరోనాకు గురై ఆస్పత్రి పాలవగా.. తాజాగా నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ వార్త వచ్చిన కొద్ది నిమిషాల్లోనే దర్శకుడు, నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీకి (Sanjay Leela Bhansali Coronavirus) కూడా కరోనా పాజిటివ్‌గా నివేదికలు వచ్చాయి.ఈ నేపథ్యంలో మరో నటి ఆలియా భట్‌ ముందస్తుగా క్వారంటైన్‌లో ఉండిపోయారు.

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు ? సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు అంటూ ప్రోమో, త్వరలో జెమెని టీవీలో ప్రారంభం కానున్న షో

Hazarath Reddy

జెమిని టీవీ షో పేరును కొంత మార్చి ఎవరు మీలో కోటీశ్వరులుతో (Evaru Meelo Koteeswarulu) ముందుకు తీసుకు వస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమోను రిలీజ్‌ చేసింది. 'సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు జెమిని టీవీలో రాబోతోంది..' అంటూ వీడియో వదిలింది.

Advertisement

MLA Balakrishna: చెంపదెబ్బ కొట్టినా ఆయనంటే నాకు పిచ్చి అభిమానం, అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, తనను టచ్ చేశాడనే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని తెలిపిన అభిమాని

Hazarath Reddy

సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన శనివారం హిందూపురంలోని 9వ వార్డు లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లగా.. స్థానికులు ఫొటోలు తీసుకుంటున్నారు.

Sathyameva Jayathe Song Released: మన తరఫున నిలబడగల నిజం మనిషిరా.., సత్యమేవ జయతే సాంగ్ విడుదల, వకీల్ సాబ్ చిత్రం నుంచి వచ్చిన మరో గీతం ఇది, ఏప్రిల్ 9న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ

Hazarath Reddy

వర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నుంచి మరో గీతం విడుదలైంది. "మన తరఫున నిలబడగల నిజం మనిషిరా.." అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం ఆన్ లైన్ లో పంచుకుంది. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు.

Prabhas Salaar Release Date: ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఏప్రిల్ 14, 2022న సినిమా విడుదల అవుతున్నట్టు తెలిపిన యూనిట్, 2021 జూలై 30న రాధే శ్యామ్ విడుదల

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా, పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ సలార్ సినిమా విడుదల తేదీని (Salaar Release Date) దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 14, 2022న సినిమా విడుదల అవుతున్నట్టు పోస్టర్ కూడా విడుదల చేశారు. దాంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు

Sardool Sikander Dies: కరోనాతో ప్రముఖ గాయకుడు, నటుడు కన్నుమూత, పంజాబ్ పాప్ సింగర్ శార్దుల్‌ సికందర్‌ మరణం తీరని లోటని తెలిపిన పంజాబ్ ముఖ్యమంత్రి, రోడ్‌వేస్ ది లారీ పేరిట‌ మొద‌టి ఆల్బ‌మ్‌ను విడుదల చేసిన శార్దూల్

Hazarath Reddy

పంజాబీ ప్రముఖ గాయకుడు శార్దుల్‌ సికందర్‌ కరోనాతో (Sardool Sikander Deis) కన్నుమూశారు. ఆయన వయసు 60 ఏళ్లు. ఇటీవల శార్దుల్‌ కరోనా వైరస్‌ బారిన పడటంతో మొహాలీలోని ఫోర్టిస్‌ ఆసుపత్రిలో చేరారు. కరోనాతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఆయన్ని వెంటాడాయి.ఈ వ్యాధులకు కూడా చికిత్స పొందుతున్న​ శార్దుల్‌ మంగళవారం ఉదయం తుదిశ్వాస ( Sardool Sikander passed away) విడిచారు.

Advertisement

Actor Indrakumar Dies: కారణం అదేనా..మరో టీవీ నటుడు ఆత్మహత్య, ఉరివేసుకుని చనిపోయిన తమిళ సీరియల్ నటుడు ఇంద్ర కుమార్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తమిళ టెలివిజన్ పరిశ్రమలో ప్రముఖ టీవీ నటుడు ఇంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని పెరంబలూర్‌లో ఆయన స్నేహితుని నివాసంలో ఉరివేసుకుని (Actor Indrakumar Dies) చనిపోయారు.

Sandeep Nahar Dies by Suicide: ఎంఎస్ ధోనీ చిత్రంలో నటించిన మరో నటుడు ఆత్మహత్య, ఫేస్‌బుక్‌లో సూసైడ్‌ నోట్‌ పోస్టు, ఉరేసుకుని చనిపోయిన సందీప్‌ నహర్‌, రాజకీయాలతో అసంతృప్తికి గురయ్యానంటూ నోట్

Hazarath Reddy

బాలీవుడ్ లో మరో విషఆదం నెలకొంది. ముంబైకి చెందిన బాలీవుడ్‌ నటుడు సందీప్‌ నహర్‌(33) ఆత్మహత్య (Sandeep Nahar Dies by Suicide) చేసుకున్నారు. అక్షయ్‌ కుమార్‌ సినిమా కేసరి, దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ‘ఎంఎస్‌ ధోనీ’ మూవీలో (Kesari, MS Dhoni: The Untold Story) సహాయ పాత్రలు పోషించిన సందీప్‌ సోమవారం సాయంత్రం ఫేస్‌బుక్‌లో సూసైడ్‌ నోట్‌ పోస్టు చేసిన కొద్దిగంటల్లోనే ఉరేసుకున్నారు.

Actor Amar Shashank: చర్లపల్లి జైలుకు కోయిలమ్మ సీరియల్ హీరో అమర్‌ శశాంక్, బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య విభేదాలు, మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్న పోలీసులు

Hazarath Reddy

కోయిలమ్మ సీరియల్‌ హీరో అమర్‌ అలియాస్‌ సమీర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో అమర్‌పై (Actor Amar Shashank) రాయదుర్గం పోలీస్‌ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే.

Rajiv Kapoor Passes Away: బాలీవుడ్ నటుడు రాజీవ్ కపూర్ కన్నుమూత, గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు, సంతాపం వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు

Hazarath Reddy

బాలీవుడ్ నటుడు, రాజ్ కపూర్ కుమారుడు రాజీవ్ కపూర్ (Rajiv Kapoor Passes Away) మంగళవారం కన్నుమూశారు. నీత కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈ వార్తలను ధృవీకరించారు. ఈ నటుడి ఫోటోను పంచుకుంటూ “RIP” అని బాధతో ట్వీట్ చేశారు. రాజీవ్ కపూర్ దివంగత రిషి కపూర్ మరియు రణధీర్ కపూర్ సోదరుడు.

Advertisement

Suriya Tests Positive for Covid: కరోనా ఇంకా పోలేదు, నేను కరోనాతో బాధపడుతున్నాను, ట్విట్టర్ వేదికగా తెలిపిన నటుడు సూర్య, జాగ్రత్తగా ఉండాలని పిలుపు

Hazarath Reddy

తమిళ ప్రేక్ష‌కుల‌తోపాటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో సూర్య కరోనావైరస్ (Suriya Tests Positive for Covid) బారీన పడ్డారు. ఈ విషయాన్ని హీరో సూర్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. తర్వగానే కోలుకుంటున్నాు. జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని మనమందరం గ్రహిస్తాం. భయంతో స్తంభించలేరు.

Mia Khalifa: రైతులు పెయిడ్ యాక్టర్లలా కనిపిస్తున్నారా..ఆగ్రహం వ్యక్తం చేసిన మియా ఖలీపా, రైతులకే నా మద్ధతు అని స్పష్టం, రైతుల ఉద్యమంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ కార్యాలయం

Hazarath Reddy

నేను స్ప్రహలోనే ఉన్నానని ధ్రువీకరిస్తున్నాను. మీరు అనవసరంగా నా మీద అక్కర చూపుతున్నందుకు కృతజ్ఞతలు. నేను ఇప్పటికీ రైతులకు మద్దతుగానే ఉన్నా’’ అని స్పష్టం చేశారు.

Farmers Protest: రైతుల ఉద్యమానికి విదేశీ సెలబ్రీటీల మద్దతు, సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం, వాస్తవాలు తెలుసుకోవాలంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు ఘాటు రిప్లయి

Hazarath Reddy

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం (Farmers Protest) చేస్తోన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు (International Celebrities on Farmers' Protest) రైతుల ఉద్యమానికి మద్దతునిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ రిహన్నా చేరారు.

Rajamouli & Mahesh Babu Movie: రాజమౌళి..మహేష్ బాబు సినిమా అదేనా? ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న న్యూస్, 2022 ప్రారంభంలో సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు..

Hazarath Reddy

బాహుబలితో తెలుగు సినిమాని హాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడు, ఓటమన్నదే లని రాజమౌళి, టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు కాంబినేషన్ లో త్వరలో సినిమా సెట్స్ మీదకు రాబోతుందనే విషయం తెలిపిందే. ఇటీవల రాజమౌళి.. మహేష్‌తో ఓ సినిమా (Rajamouli & Mahesh Babu Movie) చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement