Kushbu Sundar: ఎనిమిదేండ్ల వయసులో తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా.. నాపై జరుగుతున్న వేధింపుల గురించి అమ్మకు చెబితే నమ్ముతుందో, లేదోనని భయపడ్డా.. సినీ నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
తాను చిన్నప్పుడు 8 ఏండ్ల వయసులోనే తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ప్రముఖ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Newdelhi, March 6: తాను చిన్నప్పుడు 8 ఏండ్ల వయసులోనే తండ్రి నుంచి లైంగిక వేధింపులు (Sexual Harassment) ఎదుర్కొన్నానని ప్రముఖ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ (Kushbu Sundar) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అబ్బాయి కానీ, అమ్మాయి కానీ చిన్నప్పుడే వేధింపులకు గురైతే అది వాళ్లను జీవితాంతం వెంటాడుతుందని అన్నారు.
తనపై జరుగుతున్న వేధింపుల గురించి అమ్మకు చెబితే నమ్ముతుందో, లేదోనని భయపడేదానినని అన్నారు. ఆ తర్వాత 15 ఏళ్ల వయసులో తండ్రికి ఎదురు తిరగడం మొదలుపెట్టానని, తనకు 16 ఏళ్లు రాకముందే ఆయన తమను వదిలిపెట్టి వెళ్లిపోయారని ఖుష్బూ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
టాలీవుడ్ లో మరో విషాదం... కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూత.. గుండెపోటే కారణం
Kushboo Sundar opened up about her hard childhood where she grew up with a abusive father who sexually harassed her.https://t.co/1BLUiQBOLy
— Indian Express Entertainment (@ieEntertainment) March 5, 2023
(The above story first appeared on LatestLY on Mar 06, 2023 09:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

