Lokesh Kanagaraj (Credits: Twitter)

Hyderabad, June 20: ‘ఖైదీ’ (Khaidi), ‘విక్రమ్’ (Vikram) సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తాజాగా సంచలన ప్రకటన చేశారు. పది సినిమాలు చేసిన తరువాత (After Ten Movies) తాను ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానని తేల్చి చెప్పారు. కనగరాజ్ ప్రస్తుతం విజయ్ హీరోగా లియో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. హాలీవుడ్ లెజెండ్ క్వింటెన్ టరెంటినోలా తానూ పది సినిమాలు చేసిన తర్వాత ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానన్నారు.

Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన

ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

‘‘ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనీ లేదు. సినిమాలు తీసేందుకు ఇక్కడకు వచ్చా. మొదట షార్ట్ ఫిల్మ్స్ తీశా. కాస్త పట్టుచిక్కాక దీన్నో వృత్తిగా స్వీకరించా. నేను పది సినిమాల వరకూ చేస్తా. ఆ తరువాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా. ఒక కథలో సినిమాటిక్ యూనివర్స్ సృష్టించడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. ప్రతి సినిమాకు సంబంధించి నిర్మాత, సంగీత దర్శకుడి నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. నాతో పని చేసిన నిర్మాతలు, నటులకు ధన్యవాదాలు! వారి వల్లే సినిమాటిక్ యూనివర్స్ సాధ్యమైంది.’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Telangana Govt. Hikes DA: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు.. పెంచిన డీఏ 2022 జనవరి నుండి అమల్లోకి... 7.28లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి