Hyderabad, June 20: ఉద్యోగులకు (Employees), పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) శుభవార్త (Good News) చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ (DA)ను విడుదల చేసింది. ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెరగనుంది. ఉద్యోగుల డీఏను పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుండి డీఏను పెంచింది. పెంచిన డీఏ 2022 జనవరి నుంచి అమలు కానుంది. తాజా పెరుగుదలతో 7.28లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలుగనుంది. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా డీఏ మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్లు, ఏడాదికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడుతుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)