Hyderabad, July 2: యువ నటుడు తేజ సజ్జ (Teja Sajja) హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) దర్శకత్వంలో హను-మాన్ (Hanu-Man) అనే సూపర్ హీరో (Super Hero) చిత్రం రూపొందుతోంది. తెలుగు నుంచి వస్తున్న ప్యాన్ వరల్డ్ చిత్రమిది. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ వేసవిలో విడుదలవ్వాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఆలస్యం అయిన కారణంగా వాయిదా పడింది. తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టు దర్శకుడు ప్రశాంత్ తెలిపాడు.
I have spent 2 years of my life on this film and ready to spend another 6 months to give you nothing but the best! 🙏🏽#HANUMAN on JAN 12th 2024, SANKRANTHI@tejasajja123 @Niran_Reddy @Primeshowtweets#HanuManForSankranthi pic.twitter.com/YkBBR8TPv0
— Prasanth Varma (@PrasanthVarma) July 1, 2023
పెద్ద చిత్రాలతో పోటీ..
దీంతో ఈ చిత్రం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ రవితేజ ‘ఈగల్’ చిత్రాలను ఢీకొట్టనుంది. ఈ మూడు చిత్రాలతో పాటు హను-మాన్ వచ్చే సంక్రాంతికి బరిలో నిలవనుంది.
Etela Rajender: ఈటల రాజేందర్‌కు తెలంగాణ ప్రభుత్వం 'వై' కేటగిరీ భద్రత.. ఉత్తర్వులు జారీ