Etela Rajender (Photo-Twitter)

Hyderabad, July 1: బీజేపీ నాయకుడు, హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ (Etela Rajender)కు 'వై కేటగిరీ' భద్రతను (Y-Category Security) కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఈటల భార్య జమున, అలాగే, తనకు ప్రాణహాని ఉందని స్వయంగా ఈటల మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి విదితమే. ఈ విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటలకు ప్రాణహాని ఉందంటే తాను స్పందిస్తానని, ఆయన తనకు సోదరుడి లాంటివాడని, ఆయనకు భద్రతపై తాను స్వయంగా మాట్లాడుతానని కూడా చెప్పారు.ఈ క్రమంలో వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Viral Video: సింహం నోట్లో ఆవు తల.. ధైర్యంగా ముందుకెళ్లి రక్షించిన రైతు.. రాయి పట్టుకుని ధైర్యంగా అదిలించడంతో సింహం పరార్.. గుజరాత్‌లో ఘటన.. వీడియో ఇదిగో!

వై కేటగిరీ భద్రత అంటే?

వై కేటగిరీ నేపథ్యంలో ఈటలకు ఐదుగురు అంగరక్షకులు నిత్యం ఉంటారు. మరో ఆరుగురు అంతర్గత భద్రతా సిబ్బంది షిఫ్ట్ కు ఇద్దరు చొప్పున మూడు షిఫ్ట్‌లలో ఉంటారు.

Tirumala: తిరుమల కొండపై మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్