Rana Daggubati: లీడర్ సీక్వెల్‌తో ముందుకు రానున్న రానా దగ్గుబాటి, కథ సిద్ధం చేస్తున్న శేఖర్ కమ్ముల, త్వరలోనే షూటింగ్ ప్రారంభం..

"శేఖర్ కమ్ముల 'లీడర్' సీక్వెల్ గురించి నాకు రెండు మూడు సీన్లు చెబుతుంటారు మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారు. అది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది" అంటూ రానా బదులిచ్చాడు. ఇక దీని బట్టి చూస్తే.. 'లీడర్' సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే శేఖర్ కమ్ముల మొదలు పెట్టేశాడని తెలుస్తోంది.

Rana Daggubati: లీడర్ సీక్వెల్‌తో ముందుకు రానున్న రానా దగ్గుబాటి, కథ సిద్ధం చేస్తున్న శేఖర్ కమ్ముల, త్వరలోనే షూటింగ్ ప్రారంభం..
A still of Rana Daggupati from Aranya Movie | Photo: Eros International

హీరో రానా జీవితంలో లీడర్ సినిమా ఒక మైలు రాయి అనే చెప్పాలి. తొలిచిత్రం అయినప్పటికీ, రానా పెర్ఫార్మన్స్ అద్భుతంగా చేశాడు. నిజానికి 'లీడర్' కథని చాలా మంది హీరోలకి శేఖర్ కమ్ముల వినిపించినట్టు అప్పట్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హీరోలు కథలో కొన్ని మార్పులు చేయాలని కోరడంతో చివరికి రానాతో ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రానాకి 'లీడర్' మొదటి సినిమా అంటే ఎవ్వరూ నమ్మరేమో అనేలా అతను అంత మెచ్యూర్డ్‌గా నటించి అందరినీ మెప్పించాడు. ఇక రానా తప్ప ఆ పాత్రకి మరెవ్వరూ న్యాయం చేయలేరనేలా అర్జున్ ప్రసాద్ పాత్రలో జీవించాడు. అయితే ఇదిలా ఉండగా 'లీడర్' చిత్రానికి సీక్వెల్ ఉంటుందని 'అరణ్య' 'లవ్ స్టోరీ' సినిమాల రిలీజ్ సమయంలో శేఖర్ కమ్ముల తెలిపిన విషయం తెలిసిందే.

యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

అయితే తాజాగా 'భీమ్లా నాయక్' ప్రమోషన్లలో భాగంగా దీని గురించి ఆ చిత్ర హీరో రానా స్పందించాడు. "శేఖర్ కమ్ముల 'లీడర్' సీక్వెల్ గురించి నాకు రెండు మూడు సీన్లు చెబుతుంటారు మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారు. అది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది" అంటూ రానా బదులిచ్చాడు. ఇక దీని బట్టి చూస్తే.. 'లీడర్' సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే శేఖర్ కమ్ముల మొదలు పెట్టేశాడని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు "రానా నాయుడు" అనే ఒక నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రానా. ఇక మరో వైపు వెంకటేష్ తో కలిసి ఒక అమెరికా టీవీ సిరీస్ రీమేక్లో కూడా నటిస్తున్నారు రానా.

(The above story first appeared on LatestLY on Mar 04, 2022 11:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).