Veera Simha Reddy: బాలయ్య 107వ సినిమా పేరు 'వీరసింహారెడ్డి'... కర్నూలు కొండారెడ్డి బురుజు వేదికగా ప్రకటన.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ గా బాలయ్య సినిమా
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించే 107వ సినిమా పేరును చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా ఈ సినిమా పేరును ప్రకటించారు. వీరసింహారెడ్డిగా ఈ సినిమా పేరును ప్రకటించారు.
Hyderabad, October 22: నందమూరి హీరో బాలకృష్ణ నటించే 107వ సినిమా పేరును చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కర్నూలులోని ప్రసిద్ధ కొండారెడ్డి బురుజు వేదికగా ఈ సినిమా పేరును ప్రకటించారు. వీరసింహారెడ్డిగా ఈ సినిమా పేరును ప్రకటించారు. టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.
బాలకృష్ణ హీరోగా... రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా గతంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలను మరిపించేలా మరోమారు రాయలసీమ నేపథ్యంతోనే బాలయ్య కొత్త చిత్రం తెరకెక్కనుంది. కాగా, బాలయ్య సినిమా టైటిల్లో సింహా అనే పేరు చేరిస్తే హిట్ ఖాయమన్న నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ 'వీరసింహారెడ్డి' టైటిల్ ప్రకటించగానే సంబురాల్లో మునిగితేలారు.
NATASIMHAM #NandamuriBalakrishna in and as 'VEERA SIMHA REDDY' ❤️🔥
Meet the GOD OF MASSES in theatres this Sankranthi 🔥🤙#VeeraSimhaReddy@megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @RishiPunjabi5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/ndAC0dvkhd
— Mythri Movie Makers (@MythriOfficial) October 21, 2022
(The above story first appeared on LatestLY on Oct 22, 2022 08:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

