జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్ లలో చలాకీ చంటి (Chalaki Chanti) కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంటి.. ఆ తర్వాత నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా మరింత సక్సెస్ అందుకున్నాడు. సినిమాల్లో కూడా మంచి అవకాశాలతో కెరియర్ బాగున్నప్పుడే చంటి జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయాడు. అవకాశాలు తగ్గాక జబర్దస్త్ కు రావడం లాంటివి చేశాడు.
తాజాగా బిగ్ బాస్ షోలో ఆఫర్ రావడంతో జబర్దస్త్ (Jabardasth) వదిలేశాడు. అక్కడ గేమ్ ఆడలేక ఐదవ వారం ఇంటి నుండి బయటకు వచ్చేసానని రియాల్టీ షోలో రియాల్టీ లేదంటూ ఆరోపిస్తూ తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన చంటి కి జబర్దస్త్ వాళ్ళ దగ్గర నుండి సోషల్ మీడియా కానీ.. ఇంటర్వ్యూలో కానీ ఎటువంటి మద్దతు లభించకపోవడం ఆశ్చర్యకరంగా అనిపించిందంటూ తెలిపాడు.
ఈటీవీ సీరియల్ నటి ప్రేమలో మునిగిపోయిన హైపర్ ఆది, వద్దని ఎంత చెప్పినా వినకుండా ఏం చేశాడంటే..
అంతేకాదు యాంకర్ రోషన్ అడిగిన ప్రశ్నకు చంటి మాట్లాడుతూ.. జబర్దస్త్ లో నా అనుకున్న వాళ్లు ( Jabardasth Show Team Leaders) నన్ను మోసం చేశారు.. కొంతమంది చిన్న చిన్న సహాయాలు చేశారు. కానీ కొంతమంది నేను చాలా నమ్మిన వాళ్లు నన్ను మోసం చేయడం చాలా బాధాకరంగా ఉంది.వెళ్ళాడు బిగ్ బాస్ కి వచ్చేసాడు అన్నట్లుగా మాట్లాడారు. ఇక సమయం వచ్చినప్పుడు వాళ్ళను ప్రూఫ్ తో సహా ఎందుకు ఇలా చేశావని అడుగుతాను అంటూ చంటి తెలిపాడు.
బిగ్ బాస్ లో గీతు, రేవంత్ , కీర్తి అంటే నచ్చని చంటి వారి గురించి మాట్లాడ్డానికి ఇష్టపడలేదు . గీతూ గురించి మాట్లాడుతూ.. తాను చేసింది మొదటి వారంలో తప్పు అని చెప్పినందుకు అప్పటినుండి మా మధ్య గ్యాప్ వచ్చింది. బిగ్ బాస్ లో రియల్ గా ఉంటే ఇలానే బయటకి పంపించేస్తారు అంటూ తెలిపాడు. రేవంత్, కీర్తి గురించి అడిగితే.. నేను మాట్లాడను వారి గురించి ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారంటూ యాంకర్‌పై ఫైర్ అయ్యి షో నుంచి వెళ్లిపోయాడు చంటి.