Jabardasth comedian Hyper Aadi (Photo-Facebook)

జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వచ్చినా హైపర్ ఆది చాలా డిఫరెంట్. పంచ్ లతో రచ్చ చేయడం ఆదికి వెన్నతో పెట్టిన విద్య. అమ్మాయిలు కనిపిస్తే చాలు తన ట్రేడ్ మార్క్ పంచులు విసరడం ఆది స్టైల్.  తాజాగా విడుదల చేసిన 'భలే మంచి రోజు' షోలో ఆది తన ప్రేమ విషయమై ఓపెన్ అయిపోయాడు. స్టేజీపైనే ఓ సీరియల్ నటిని చూసి ఆమెను తన  లవర్ అని  రెచ్చిపోయాడు.

ఈ టీవీ 27 సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ 'భలే మంచి రోజు' అనే స్పెషల్ షో ప్లాన్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఈటీవీ ఆర్టిస్టులందరినీ ఒకే స్టేజ్ పైకి తెచ్చారు. ఈ ఈవెంట్ ఇప్పటికే ఒక భాగం పూర్తైంది. రెండో చాప్టర్ సెప్టెంబర్ 4వ తేదీన ప్రసారం కాబోతుంది. తాజాగా ఈ షో ప్రోమో వదిలారు.

ఈ ప్రోమోలో హైపర్ ఆది హైలైట్ అయ్యాడు. తాను 'శతమానం భవతి' సీరియల్ నటితో ప్రేమలో పడ్డట్లు ఓపెన్ అయ్యాడు, ఆమె కూడా ఆదితో డ్యాన్స్ చేయడం, ఆయన కాలు మీద కూర్చోవడం లాంటి సీన్స్ చూపించారు. అంతేకాదు ఈ ఇద్దరిపై లవ్ సింబల్స్ కూడా వేసేశారు. దీంతో ఈ ప్రోమో వీడియో వైరల్ గా మారింది.

బుల్లితెరపై హైపర్ ఆది స్కిట్స్‌కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ తీసుకుంటున్నాడు హైపర్ ఆది. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పేశాడు. 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ రెండు షోలలోనే పని చేస్తూ తనదైన పంచ్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్విస్తున్నాడు.