SSMB28 Update: జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమా.. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చిత్రం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 28వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ భారీ చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Hyderabad, Dec 11: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ (Tollywood Super Star) మహేశ్ బాబు (Mahesh Babu) 28వ చిత్రం తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించి తాజా అప్ డేట్ విడుదలైంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ భారీ చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మేరకు షూటింగ్ కు సర్వం సిద్ధమైందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.
మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోనుందని తెలిపింది. అభిమానులతో మరిన్ని సూపర్ ఎగ్జయిటింగ్ అప్ డేట్లను పంచుకుంటామని హారిక హాసిని క్రియేషన్స్ తెలిపింది. కాగా, ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
All set to shoot! With heightened spirit and great energy #SSMB28 will go on sets from January, non-stop! Stay-Tuned, More SUPER-EXCITING updates coming your way soon! ?✨
SUPERSTAR @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman #PSVinod #ASPrakash @NavinNooli @vamsi84 pic.twitter.com/cEjRFVsz64
— Haarika & Hassine Creations (@haarikahassine) December 10, 2022
(The above story first appeared on LatestLY on Dec 11, 2022 10:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

