టెలివిజన్

Rajinikanth: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించిన రజనీకాంత్.. వైరల్ వీడియో ఇదిగో..

Rudra

సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యోగి పాదాలకు సూపర్ స్టార్ నమస్కరించారు. రజనీ కారులో నుండి దిగే సమయానికే యోగి ఆహ్వానం పలికేందుకు బయట ఉన్నారు.

Dulquer Salmaan: నా వెనుక చేతులు వేసి ‘అక్కడ’ ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది.. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సంచలన వ్యాఖ్యలు

Rudra

అభిమానులు అప్పుడప్పుడూ తారలను ఇబ్బందుల పాలు కూడా చేస్తుంటారు. తనకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందని ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ చెప్పాడు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డానని ఇటీవలి ఓ ఇంటర్వ్యూ లో ఆయన చెప్పుకొచ్చాడు.

Allu Arjun: అల్లు అర్జున్ నా తరపున ప్రచారం చేస్తాడు.. పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. రాజకీయంగా బన్నీ సేవలు అవసరమని వ్యాఖ్య

Rudra

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ (భార్య స్నేహ రెడ్డి తండ్రి), బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. తన కోసం అల్లు అర్జున్ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు.

Disco Shanti: తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదు.. శ్రీహరి భార్య డిస్కో శాంతి భావోద్వేగం.. తమ ఆర్థిక స్థితి తలకిందులైందని ఆవేదన

Rudra

దివంగత టాలీవుడ్ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి.. నటి శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి సినిమాల్లో అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించారు. అయితే ఆయన 2013లో మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

Advertisement

Brahmanandam: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం.. నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

Rudra

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్‌ లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో కలిసి సిద్ధార్థ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.

Hyper Aadi Girl Friend: జబర్దస్త్ హైపర్ ఆది గర్ల్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా? ఏకంగా టీవీ షోలో ప్రపోజ్‌ చేసిన ఆది, నిజమా? లేకపోతే ఇదికూడా స్క్రిప్ట్‌ లో భాగమా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు

VNS

నేను నిజంగా ప్రేమించిన అమ్మాయి ఒకరు ఉన్నారు. బేబీ ఒక్కసారి స్టేజ్‌ పైకి రా” అంటూ ఆది పిలవగానే ఒక అమ్మాయి నవ్వులు చిందిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆమె పేరు ‘విహారిక’.

Suriya: ముంబైకి మకాం మార్చినట్టు రూమర్లు.. స్పందించిన నటుడు సూర్య.. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే??

Rudra

ముంబై కి షిప్ట్ అయినట్టు వస్తున్న వార్తలపై కోలీవుడ్ నటుడు సూర్య స్పందించారు. ఫ్యాన్స్‌ మీట్‌ లో పాల్గొన్న సూర్యను కుటుంబంతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యారన్న రూమర్లపై స్పందించమని కోరగా.. నేరుగా సమాధానం చెప్పారు.

Gadar2: గదర్ 2 జోష్.. థియేటర్లలో అభిమానుల ప్రత్యేక నృత్యాలు.. సోషల్ మీడియాలో వైరల్

Rudra

ఎన్నో నెలల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సందడి గదర్ 2తోనే కనిపించింది. ముఖ్యంగా ఉత్తరాదిలోని సింగల్ స్క్రీన్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో పోటెత్తాయి. మై నిక్లా సాంగ్ సమయంలో థియేటర్లలో అభిమానుల ప్రత్యేక నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

Upendra: అవమానకర సామెత వాడి చిక్కుల్లో పడ్డ నటుడు ఉపేంద్ర.. ఇప్పటివరకూ రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు.. పొరపాటున తన నోటి నుంచి ఈ కామెంట్ దొర్లిందని నటుడి వివరణ

Rudra

కన్నడ నటుడు ఉపేంద్ర వివాదంలో చిక్కుకున్నారు. దళితులపై అభ్యంతరకర వ్యాఖ్య చేసిన ఆయన చివరకు క్షమాపణలు చెప్పారు. అయితే, ఓ వర్గాన్ని అవమానించారంటూ ఉపేంద్రపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఉపేంద్ర తన రాజకీయ పార్టీ ప్రజాకీయను విమర్శిస్తున్న వారిపై ఫేస్‌ బుక్‌ సెషన్‌ లో మండిపడ్డారు. ఈ సందర్భంగా అవమానకర రీతిలో దళితుల ప్రస్తావన తెచ్చారు.

Google Doodle: అతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. శ్రీదేవి గౌరవార్థం గూగుల్ స్పెషల్ డూడుల్ లోగో విడుదల

Rudra

అతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. శ్రీదేవి గౌరవార్థం గూగుల్ స్పెషల్ డూడుల్ లోగో విడుదల చేసింది. దాన్ని మీరూ చూడండి.

Malayalam Director Siddique: మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ కు గుండెపోటు... పరిస్థితి విషమం

Rudra

మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ గుండెపోటుతో కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. 69 ఏళ్ల ఈ దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Ileana: మాతృమూర్తి అయిన ఇలియానా.. కుమారుడి పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అని వెల్లడి.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షల సందేశాలు

Rudra

ప్రముఖ నటి ఇలియానా తల్లి అయ్యారు. ఆగస్టు 1న మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె ఇన్‌ స్టాలో తెలియజేశారు. కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని నామకరణం చేసిన నటి, ఆ చిన్నారి చిత్రాన్ని కూడా షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.

Advertisement

Nitin Desai Dies By Suicide: జోథా అక్బర్ ఆర్ట్ డైరక్టర్‌ నితిన్ దేశాయ్ ఆత్మహత్య, సొంత స్డూడియోలో ఉరేసుకున్న ఫేమస్‌ ఆర్ట్ డైరక్టర్, ఐదుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న నితిన్ దేశాయ్

VNS

ప్రముఖ సినీ ఆర్ట్ డైరక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య (Nitin Desai Dies By Suicide) చేసుకున్నారు. ముంబై సమీపంలోని కర్‌జట్‌లో ఉన్న ఎన్‌డీ స్టూడియోస్‌ లో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియోలోని ఓ రూంలో నితిన్ దేశాయ్ ఉరేసుకున్నారు. 20 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఫేమస్ ఆర్ట్ డైరక్టర్‌గా (Nitin Desai Dies By Suicide) ఉన్న నితిన్ దేశాయ్ ఆత్మహత్య బాలీవుడ్‌ను షాక్ కు గురిచేసింది.

Ambati Rambabu: 'బ్రో'లో అంబటిని ట్రోల్ చేసేలా సీన్.. పవన్ పై అంబటి కౌంటర్ ట్వీట్.. ఏంటా విషయం??

Rudra

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి' అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు.

NSR Prasad Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత.. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్

Rudra

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు.

Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్‌ బుక్ అకౌంట్ హ్యాక్.. సమస్యను వెంటనే పరిష్కరించిన టెక్నికల్ టీమ్

Rudra

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ తో వున్న ఈ వీడియోను అభిమానులు, ఇతర నెటిజన్లు చూశారు.

Advertisement

HC on Bigg Boss Show: బిగ్‌బాస్‌ షోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, టీవీల్లో అసభ్యకర రీతిలో వచ్చే రియాల్టీ షోలకు సెన్సార్‌ లేకపోతే ఎలా అని మండిపాటు

Hazarath Reddy

బిగ్‌బాస్‌ షో నిలిపివేసేలా ఆదే­శాలు జారీ చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. టీవీల్లో అసభ్య, అభ్యత­రకర రీతిలో రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్‌ చేయక­పోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది.

Biggboss 7 Telugu: మరింత కిక్కెక్కించనున్న బిగ్‌ బాస్‌ సీజన్ 7, సరికొత్త సవాళ్లు అంటూ హింట్ ఇచ్చిన కింగ్ నాగార్జున, బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభానికి ముందు సరికొత్త ప్రోగ్రాం

VNS

దానికి అర్థం ఏమిట‌ని’ కింగ్‌ను సుమ అడుగుతుంది. ‘న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్‌, న్యూ రూల్స్ ‘అంటూ కింగ్‌ స‌మాధానం చెప్పారు. నాగ్ చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తుంటే ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్ స‌రికొత్తగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. షో ఎలా ఉంటుంద‌నేది చూడాల్సిందే.

Pushpa-2 Dialogue Leak: అభిమానులకు అల్లు అర్జున్ ఊహించని సర్‌ ప్రైజ్.. పుష్ప-2 డైలాగ్ తో సందడి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. ‘బేబీ’ ఈవెంట్‌లో ఘటన

Rudra

‘తగ్గేదే లే’ అంటూ పుష్ప మూవీతో ఎంతగానో అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2లో విభిన్న గెటప్ లో రెట్టింపు జోష్ గా కనిపిస్తున్నారు. ఈ సీక్వెల్ లో అర్జున్ ఏ పంచ్ డైలాగ్ చెప్పబోతున్నారో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

Biggboss 7 Telugu Promo: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్! అంటున్న నాగార్జున, వినూత్నంగా బిగ్‌ బాస్‌ సీజన్ 7 ప్రోమో రిలీజ్‌, కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

VNS

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలో వస్తుంది అంటూ ఇటీవలే ఓ మోషన్ వీడియోని రిలీజ్ చేశారు. ‘స్టార్ మా’లో బిగ్‌బాస్ టెలికాస్ట్ కానుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.

Advertisement
Advertisement