తాజా వార్తలు

IRCTC Down: ఐఆర్‌సీటీసీ సేవలు డౌన్, నిలిచిపోయిన రైల్వే టికెట్ బుకింగ్స్ యాప్స్, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కొనసాగుతుండటం వల్లే అంతరాయమని తెలిపిన సంస్థ

Hazarath Reddy

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) సేవలకు పాక్షిక అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్ సైట్, యాప్ పనిచేయడంలేదని నెటిజన్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదుల చేస్తున్నారు. IRCTC ఈ టికెటింగ్ సర్వీస్ వెబ్ సైట్, యాప్ ఇవాళ (సోమవారం) ఉదయం పనిచేయడం లేదు.

Road Accident Video: వీడియో ఇదిగో, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, క్లీనర్ సజీవ దహనం, గాయాలతో బయటపడ్డ వ్యాన్ డ్రైవర్

Hazarath Reddy

విజయనగరం భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుండి వ్యాన్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. వ్యాన్ లో చెలరేగిన మంటల్లో వ్యాన్ క్లీనర్ సజీవదహనం అయ్యారు. వ్యాన్ డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు.

Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, గాలిపటం కోసం రోడ్డు మీదకొచ్చిన ఏడేళ్ల బాలుడిని ఢీకొట్టిన కారు, ఎగిరి 40 అడుగుల దూరంలో పడటంతో..

Hazarath Reddy

రాజస్థాన్‌లోని సికార్‌లో గాలిపటం తెగిపోవడంతో దానిని పట్టుకునేందుకు రోడ్డు వెంబడి పరిగెత్తిన 7 ఏళ్ల బాలుడిని కారు వేగంగా ఢీకొట్టడంతో షాకింగ్ సంఘటన జరిగింది. డిసెంబర్ 6న లోసల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదం సీసీటీవీలో రికార్డయింది. రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో బాలుడు 40-50 అడుగుల ఎత్తుకు విసిరేసినట్లు వీడియోలో ఉంది

Viral Video: వీడియో ఇదిగో, రన్నింగ్ చేస్తున్న వారిపైకి దూసుకొచ్చిన జింక, ముగ్గురిని అమాంతం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు

Hazarath Reddy

న్యూయార్క్‌లోని వాటర్‌టౌన్ టర్కీ డే రన్‌లో ఒక అస్తవ్యస్తమైన దృశ్యం ఆవిష్కృతమైంది, కనీసం నాలుగు జింకలు గుంపుపైకి దూసుకెళ్లి, ముగ్గురుని గాయపరిచాయి. వార్షిక ఈవెంట్ కోసం రన్నర్లు రన్నింగ్ చేస్తుండగా ఈ దాడి జరిగింది. ఒక వ్యక్తిని తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Barabanki Shocker: దారుణం, కొట్టాడని స్కూలులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన విద్యార్థిపై టీచర్ కత్తితో దాడి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని సుబేహా పోలీస్ స్టేషన్ పరిధిలోని తికర్హువా గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో డిసెంబర్ 7, శనివారం ఆందోళనకర సంఘటన జరిగింది. తనను కొట్టడంపై ఫిర్యాదు చేసేందుకు పాఠశాలకు వచ్చిన షకీల్ అనే యువకుడిపై టీచర్ కత్తితో దాడి చేశాడు

Ruby Slippers: 85 ఏండ్ల కిందటి ఆ చెప్పుల ఖరీదు రూ.237 కోట్లు.. కెంపులు పొదిగిన ఈ పాదరక్షలు ఎవరివంటే?

Rudra

ఆ చెప్పులు 85 ఏండ్ల కిందటివి. రెండు దశాబ్దాల క్రితం ఒక మ్యూజియం నుంచి చోరీకి గురయ్యాయి. ఇప్పుడు ఈ పాదరక్షలు శనివారం జరిగిన ఆన్‌ లైన్‌ వేలంలో రికార్డు స్థాయిలో 28 మిలియన్‌ డాలర్లకు (రూ.237 కోట్లు) అమ్ముడయ్యాయి.

Man Beats Bank Manager: వీడియో ఇదిగో, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరిగిందని బ్యాంక్ మేనేజర్‌ని చితకబాదిన కస్టమర్

Hazarath Reddy

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరగడంపై ఓ బ్యాంక్ కస్టమర్ ఆ బ్యాంక్ మేనేజర్‌తో గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చొక్కా కాలర్ పట్టుకొని ఇద్దరూ చితకబాదుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరగడం కస్టమర్‌ను నిరాశకు గురిచేసిందని, ఘర్షణకు దిగడానికి ఇదే కారణమని తెలుస్తోంది.

Tension at Assembly Gate: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. కారణం ఇదే..! (వీడియో)

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు దగ్గర అడ్డుకున్నారు.

Advertisement

Nandyal Horror: నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికపై పెట్రోల్ పోసి హత్య.. అనంతరం తానూ తగులబెట్టుకొని ఆత్మహత్యాయత్నం (వీడియో)

Rudra

ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరులోని బైరెడ్డినగర్‌ లో దారుణం జరిగింది. ఓ బాలికపై ఓ ప్రేమోన్మాది ఘోరానికి పాల్పడ్డాడు. ప్రేమించడంలేదంటూ విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టి అనంతరం తాను కూడా నిప్పంటించుకున్నాడు.

Bomb Threats to 40 Delhi Schools: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. తొలుత రెండు ఇప్పుడు ఏకంగా 40 పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించి తనిఖీలు

Rudra

బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కలకలం మొదలైంది. నేటి ఉదయం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈసారి విమానాలకు కాకుండా పాఠశాలలకు ఈ హెచ్చరికలు వచ్చాయి.

Stunt Reel: రీల్స్ పిచ్చితో ఒకే బైక్‌ పై ఏడుగురు ప్రయాణం... కఠిన చర్యలకు నెటిజన్ల డిమాండ్ (వీడియో)

Rudra

రీల్స్ పిచ్చితో కొందరు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇదీ అలాంటి ఘటనే. ఉత్తరప్రదేశ్‌ లోని హపూర్‌ జిల్లాలో ఒకే ద్విచక్రవాహనంపై ఏకంగా ఏడుగురు యువకులు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించారు.

Bomb Threats to Delhi Schools: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించి తనిఖీలు

Rudra

బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కలకలం మొదలైంది. నేటి ఉదయం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈసారి విమానాలకు కాకుండా పాఠశాలలకు ఈ హెచ్చరికలు వచ్చాయి.

Advertisement

TG Assembly Session Today: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 5 బిల్లులు, 2 నివేదికలు ప్రవేశపెట్టే అవకాశం.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఇవాళే..!

Rudra

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశాలు మొదలు కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి.

Harish Rao on Six Guarantees: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ వ‌స్తారా? మీడియాకు హ‌రీష్ రావు ఇచ్చిన స‌మాధానం ఇదే!

VNS

రేపటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్‌ వస్తారో.. రారో.. మీరే చూస్తారన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడుతామన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల చట్టబద్ధత కోసం పోరాడుతామన్నారు. రెండు విడతల రైతుబంధు ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుబడుతామని.. ప్రజాసమస్యలపై గళం విప్పుతామన్నారు.

Syria Crisis: సిరియాలో మ‌రో సంక్షోభం, దేశాన్ని విడిచి వెళ్లిపోయిన అధ్య‌క్షుడు అల్ బ‌షర్, విమానం కూలిపోయింద‌ని ఊహాగానాలు

VNS

సిరియా (Syria)లో తిరుగుబాటుదళాలు దేశ రాజధాని డమాస్కస్‌పై పట్టుబిగించాయి. దీంతో అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ (Bashar al-Assad) దేశాన్ని వీడి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్‌ కూల్చివేసినట్లు సోషల్‌ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రష్యా కీలక ప్రకటన చేసింది.

Ambati Rambabu Fire on Kutami: టీడీపీకి ఒక చ‌ట్టం, వైసీపీకి ఒక చ‌ట్ట‌మా? మాపై ట్రోలింగ్ చేసిన వారిపై కేసులుండ‌వా? అని ప్ర‌శ్నించిన అంబ‌టి రాంబాబు

VNS

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరుగా చట్టాలు అమలు అవుతున్నాయని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో (Social Media) అసభ్యకరంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు

Advertisement

Man Body On Vehicle Roof: మృత‌దేహానికి కూడా గౌర‌వం లేదా? అంబులెన్స్ కు డబ్బులు లేక శ‌వాన్ని వాహ‌నంపై క‌ట్టి తీసుకెళ్లిన కుటుంబం

VNS

తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు పది వేలకుపైగా డిమాండ్‌ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని ఆ మహిళ ప్రాధేయపడినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక వాహనం టాప్‌పై యువకుడి మృతదేహాన్ని కట్టేసి గ్రామానికి తరలించారు.

KCR on Telangana Thalli Statue: తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంపై కేసీఆర్ స్పంద‌న ఇదే! రేవంత్ స‌ర్కారు తీరుపై ఫిబ్ర‌వ‌రిలో భారీ బ‌హిరంగ స‌భ‌

VNS

రైతుబంధు (Raithubandhu) తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సిద్దు జొన్నలగడ్డ..రూ 15 లక్షల చెక్కును సీఎంఆర్‌ఎఫ్‌కి విరాళంగా అందించిన సిద్దూ

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిని కలిశౄరు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి రూ. 15 లక్షల చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా అందజేశారు.

Kalidas Jayaram Married Tarini: మోడల్ తరిణి కళింగరాయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న హీరో కాళిదాస్ జయరామ్, కేరళలోని గురువాయూర్ ఆలయంలో పెళ్లి వేడుక..వీడియో

Arun Charagonda

పెళ్లి చేసుకున్నారు హీరో కాళిదాస్ జయరామ్. మోడల్ తరిణి కళింగరాయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు హీరో కాళిదాస్. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాళిదాస్ తండ్రి ప్రముఖ సీనియర్ నటుడు జయరామ్. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement