తాజా వార్తలు
Andhra Pradesh: వీడియో ఇదిగో, 5 నెలల చిన్నారిని బస్టాండ్‌లో వదిలి వెళ్లిన మహిళ, బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని అటే..
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో APSRTC బస్ స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ RTC బస్ స్టాండ్ ప్రాంగణములో ఉన్న మరో మహిళకు తన 05 నెలల చిన్న పాపను ఇచ్చి తాను బాత్ రూమ్ కు వెళ్లి వస్తానని వెళ్లి తిరిగి రాకుండా వెళ్ళిపోయింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, చీరాల బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోతోండగా సముద్రంలోకి వెళ్లి సాహసం
Hazarath Reddyఒక్కసారిగా వచ్చిన రాకాసి అలల తాకిడికి షేక్ భాషా (44) సముద్రంలోనికి కొట్టుకుపోతుండగా, అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో సముద్రంలోకి వెళ్లి యాత్రికుడు ప్రాణాలను రక్షించి ఒడ్డుకు చేర్చారు.
Driver Dies of Heart Attack: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, బస్సును రోడ్డు పక్కకు ఆపి కుప్ప కూలిన డ్రైవర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Hazarath Reddyగజ్వేల్ వద్ద హుజురాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. ఛాతిలో నొప్పిగా రావడంతో బస్సు పక్కకు ఆపి ప్రయాణికులకు చెప్పిన డ్రైవర్ రమేష్ సింగ్ చెప్పాడు. వెంటనే ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ రమేష్‌సింగ్ మృతి చెందాడు.
Vizag Honey Trap Case: వైజాగ్‌లో హానీ ట్రాప్ కేసు వెలుగులోకి, యువకులని రూంకి పిలిచి న్యూడ్‌లో ఉండగా ముఠా ఎంటర్, ఫోటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్
Hazarath Reddyరూంకి తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసి.. అనంతరం వారితో న్యూడ్‌గా ఉన్నట్టు వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేసేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో జాయ్‌ని భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.
Monkey vs Dog Fight: వీడియో ఇదిగో, కుక్కతో భయంకరంగా తలపడిన కోతి, కర్రలతో బెదిరించిన వదలకుండా రెండూ హోరా హోరీ పోరు..
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కాలేజీ క్యాంపస్‌లో ఓ శునకం, మారుతి తలపడ్డాయి. కోతి బారి నుంచి శునకాన్ని విడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని వదిలేందుకు అది నిరాకరించింది. కర్రలతో బెదిరించినా, కుర్చీలు ఎత్తిపడేసినా కుక్కను మాత్రం అది వదల్లేదు. నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది.
Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, యువతి ప్రైవేట్ పార్టుపై దాడి చేస్తూ హత్య, గొంతు కోసి మరీ కిరాతకం
Hazarath Reddyవెండి ఆభరణాల వివాదంలో మరో మహిళను హత్య చేసిన సెక్స్ వర్కర్‌ను అరెస్టు చేసిన ఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. నిందితులు బ్లేడ్‌తో బాధితురాలి గొంతు కోసి, ఆమె ప్రైవేట్ భాగాలకు గాయాలు చేశారన్నారు.
Terror Attack at Karachi Airport: కరాచీ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు.. చైనీయులే లక్ష్యంగా దాడి.. ముగ్గురు మృతి
Rudraపాములు పట్టే వ్యక్తి ఆ పాము కాటుకే బలైనట్టు ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అదే ముష్కరుల వరుస దాడులతో వణికిపోతున్నది.
Big Blow to Jani Master: జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు.. జాతీయ పురస్కారం రద్దు నేపథ్యంలోనే నిర్ణయం
Rudraలైంగిక దాడి కేసులో చిక్కుకున్న జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును నిలిపివేసిన సందర్బంగా బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.
Soil On Railway Track: రైళ్లను పట్టాలు తప్పించేందుకు దుండగులు దుశ్చర్య.. ట్రాక్ పై మట్టి కుప్ప.. లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. యూపీలో ఘటన (వీడియోతో)
Rudraరైళ్లను పట్టాలు తప్పించేందుకు దుండగులు పన్నుతున్న దుశ్చర్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రైల్వే ట్రాక్ లపై గ్యాస్ సిలిండర్లు, ఇనుప కడ్డీలు ఉంచూతూ రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు పన్నుతున్న దుండగులు.. ఇప్పుడు ఏకంగా మట్టి కుప్పలే పోశారు.
Bathukamma Festival: మన బతుకమ్మకు అమెరికాలో గౌరవం.. పలు రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు
Rudraతెలంగాణ సాంసృతిని చాటే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఇప్పటికే పలు దేశాల్లో తెలంగాణ ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడుతున్న విషయం విధితమే.
World's Largest Residential Building: ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం.. 20 వేల మందికి పైగా ఆవాసం.. చైనాలో భవంతి.. వీడియో ఇదిగో..!
Rudraఒక భవనంలో ఎంత మంది ఉంటారు? అపార్ట్ మెంట్ అయితే, మహా అయితే, ఓ వంద, రెండొందల మంది ఉంటారు. అంతేగా.. అయితే, ఓ భవనంలో ఏకంగా 20 వేల మందికి పైగా నివాసం ఉంటున్నారు.
Viral Video: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న బస్సు.. డ్రైవర్ మృతి.. ఏలూరులో ఘటన (వీడియో)
Rudraఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట వద్ద ఆగి ఉన్న ఓ లారీని ప్రయాణికులతో ఉన్న ఓ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
One Blood Test To Detect 12 Cancers: ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్ల గుర్తింపు.. బ్రిటన్ పరిశోధకుల ఘనత
Rudraప్రపంచ దేశాలను క్యాన్సర్ కేసులు వణికిస్తున్నాయి. అయితే, ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్లను ముందుగా పసిగట్టేలా వినూత్న ఆవిష్కరణను బ్రిటన్‌పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
Sabarimala’s Aravana Prasadam: తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ మరో ప్రసాదంపై వివాదం.. శబరిమల అయ్యప్ప ప్రసాదంలో కల్తీ.. మోతాదుకు మించి క్రిమి సంహారకాలు
Rudraశ్రీవారి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న వివాదం కొనసాగుతున్న వేళ మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల అయ్యప్ప ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
India vs Bangladesh T20, Video Viral: సన్ రైజర్స్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అరాచకం వీడియో వైరల్...బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో స్టేడియంలో ఏం చేశాడో తెలిస్తే అందరూ షాక్..
sajayaటీమిండియా ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పై విరుచుకుపడ్డాడు. అతను కొట్టిన ఓ సిక్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
India vs Bangladesh, 1st T20, 2024: బంగ్లాదేశ్‌ను చితక్కొట్టి ఓడించిన టీమిండియా.. 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసిన భారత్..హార్దిక్ పాండ్యా కొట్టిన విన్నింగ్ సిక్సి వీడియో వైరల్...( Viral Video)
sajayaఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా ఆడి 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు.వాస్తవానికి ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్ జట్టు 128 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే అందించగలిగింది.
Meghalaya Floods: మేఘాలయను అతలాకుతలం చేసిన వరదలు, విరిగిపడ్డ కొండ చరియలు, వేలాది మందికి కరెంట్ కట్, 10 మంది మృతి
VNSఈశాన్య భారతంలోని కీలక రాష్ట్రమైన మేఘాలయను (Meghalaya Floods) భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌత్ గారో హిల్స్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలకు (Flosh Floods) 10 మంది మరణించారు. కుండపోత వానల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి.
Committee Kurrollu Won Prestigious Award: వెండితెర, ఓటీటీల్లో అదరగొట్టిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డు, తొలి సినిమాకు అవార్డు కొట్టేసిన యంగ్ టీమ్
VNSప్రతిష్టాత్మక అవార్డును అందుకోబోతుంది. కమిటీ కుర్రోళ్లు సినిమా (Committee Kurrollu) దాదా సాహెబ్ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్- ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ అసోసియేషన్‌తో కలిసి అందించే మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డుకు ఎంపికైంది.
Arvind Kejriwal Security Breach: కేజ్రీవాల్ సభలో అజ్ఞాత వ్యక్తి హల్ చల్, సభా వేదిక దగ్గరకు వెళ్లి నినాదాలు, పట్టుకున్న పోలీసులు, వైరల్ వీడియో ఇదుగోండి!
VNSఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికపైకి చేరుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆప్ కార్యకర్తలు, పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు.
SBI Recruitment: బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్, ఎస్బీఐలో ఒకేసారి 10వేల జాబ్స్, పూర్తి వివరాలివిగో..
VNSమార్చి 2024 నాటికి ఎస్బీఐ బ్యాంక్‌లో (SBI Bank) మొత్తం సిబ్బంది 2,32,296 మంది ఉన్నారు. ఇందులో 1,10,116 మంది అధికారులు గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. “కస్టమర్ అంచనాలు మారుతున్నాయి. సాంకేతికత మారుతోంది.. డిజిటలైజేషన్ విస్తృతంగా పెరుగుతోంది. బ్యాంకులో ఉద్యోగులను అన్ని స్థాయిలలో నిరంతరం రీస్కిల్ చేస్తున్నాం” అని ఆయన చెప్పారు