తాజా వార్తలు

Health Tips: దంతాల సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఇవి అనారోగ్యానికి సంకేతం కావచ్చు.

sajaya

దంతాలు కేవలం ఆహారం నమ్మడానికి మాత్రమే కాదు మన అందాన్ని పెంపొందించడానికి కూడా ఇవి కనిపిస్తాయి. దంతాలు కలిగి ఉండడం మంచిదే అయితే కొన్నిసార్లు దంతాల సమస్యతో బాధపడుతుంటారు.

Road Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టైరు పేలి బోళ్తా పడిన ప్రైవేట్ బస్సు, 20 మందికి పైగా తీవ్ర గాయాలు, బెంగళూరు నుండి వరంగల్ వెళ్తుండగా ఘటన

Arun Charagonda

జనగామ జిల్లా యశ్వంతపూర్ గ్రామం వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు మరో 23 మందికి స్వల్ప గాయాలు కాగా క్షతగాత్రులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రన్నింగ్ లో టైర్ పేలడంతోనే అదుపుతప్పి బోల్తా పడింది బస్సు. దీంతో సుమారు కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Warangal: తారాస్థాయికి వరంగల్ నాలా పంచాయతీ, మేయర్ వర్సెస్ దాస్యం వినయ్ మధ్య వాగ్వాదం, వినయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..వీడియో ఇదిగో

Arun Charagonda

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, కార్పొరేటర్ తో మాక్ లైవ్ సందర్భంగా నయీంనగర్ బ్రిడ్జి పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్రా వడంతో సవాల్ ను స్వీకరించి వచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ రావడంతో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Astrology: గురు గ్రహం అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి సంచారం..ఈ మూడు రాశుల వారికి అపార సంపద.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం విలాసాలకు ఆనందాలను ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు. ఈ గ్రహం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే వైవాహిక జీవితాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది.

Advertisement

Tension At Telangana Bhavan: తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం, అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు..వీడియో

Arun Charagonda

తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలను చితకబాదారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Surya Grahanam 2024: అక్టోబర్ 2 చివరి సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఈ 3 రాశుల వారికి సమస్యలు పెరుగుతాయి.

sajaya

అక్టోబర్ 2, 2024న రోజున, సూర్యుడు ,కేతువుల సంపూర్ణ కలయిక వల్ల 'గ్రహణ యోగం' ఏర్పడుతోంది సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కూడా సంభవించబోతోంది

ACB Raids At Nalgonda: నల్గొండలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్

Arun Charagonda

నల్గొండ జిల్లా చింతపల్లిలోని పశు వైద్యాశాలలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పాల్ జోసెఫ్ గౌతమ్ ను అనిషా అధికారులు పట్టుకున్నారు. 8 గేదెల ఆరోగ్య మరియు మూల్యాంకన ధ్రువీకరణ పత్రం అందించాలనే అనుమతిని పొందేందుకు రూ. 6,000/- లంచం డిమాండ్ చేసినందుకు అతన్ని పట్టుకున్నారు.

Amit Shah Slams Mallikarjun Kharge: మోదీని ప్రధాని పదవి నుంచి దించేవరకు చనిపోను, మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు, కౌంటర్ విసిరిన హోమంత్రి అమిత్ షా

Hazarath Reddy

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేవరకు చనిపోనని చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పు పట్టారు.

Advertisement

Pakistani National Arrested in Bengaluru: బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీ అరెస్ట్, మరో ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

బెంగుళూరు నగరంలో అక్రమంగా బస చేసి అరెస్టయిన పాకిస్థానీ, మరో ముగ్గురు విదేశీయులు భారత పాస్‌పోర్టులు పొందేందుకు సిద్ధమయ్యారని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర సోమవారం తెలిపారు.

Astrology: అక్టోబర్ 5 శనివారం శుక్రుడు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు గ్రహంగా ఉంటాడు. శుక్ర గ్రహం అక్టోబర్ 5 వ తేదీన శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు 20 నిమిషాలకు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.

Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

యూపీలో (Uttarpradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని 10-11 సెక్టార్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది

Viral Video: హైదరాబాద్‌ మీర్‌చౌక్‌లో అదుపుతప్పిన కారు, రోడ్డు పక్కన ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి విధ్వంసం...సీసీ టీవీ ఫుటేజ్ ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ - మీర్‌చౌక్‌ పీఎస్‌ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వాహనాలపైకి దూసుకు పోయింది. దీంతో పలు వాహనాలు ధ్వంసం కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

UP Horror: యూపీలో దారుణం, 5 ఏళ్ళ బాలుడి వెనక పార్టును చిదిమేస్తూ దారుణ అత్యాచారం, అక్కడి నుంచి రక్తం కారుతుంటే రేప్ సీన్ వీడియో తీసి పైశాచికానందం

Hazarath Reddy

ఐదేండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడమే కాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసిన దారుణ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి లైంగిక దాడి చేసిన ఇద్దరు, దానిని వీడియో తీసిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

SC On Tirupati Laddu Row: కల్తీ నెయ్యిని లడ్డూ తయారికి వాడారా?, సీఎం చంద్రబాబు ప్రకటనకు ఆధారాలు లేవన్న సుప్రీం కోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 3కి వాయిదా

Arun Charagonda

తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్ చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూల తయారికి వాడారా అన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడింది. కల్తీ జరిగిందని భావిస్తే ఆ లడ్డూలను టెస్టులకు పంపారా అని ప్రశ్నించింది సుప్రీం. విచారణకు ముందే ప్రకటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు ఆధారాలు లేవని వెల్లడించింది.

Ind Vs Ban: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మైండ్ బ్లాంక్...వీడియో ఇదిగో

Arun Charagonda

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. పేసర్ సిరాజ్ బౌలింగ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్ ఫ్రంట్ ఫూట్ వచ్చి షాట్ కొట్టగా మిడాఫ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఒంటి చేత్తి గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

HC on Rape: పెళ్లి సాకుతో తనపై అత్యాచారం జరిగిందని వివాహిత ప్రియుడిపై కేసు పెట్టలేదు, బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

సెప్టెంబరు 26, గురువారం, ఒక వ్యక్తి చేసిన తప్పుడు వివాహ వాగ్దానం చేసిన తరువాత, ఆమెతో లైంగిక సంపర్కం జరిపిన తర్వాత బాధితురాలు నిందితుడిపై ఎటువంటి క్లెయిమ్ చేయరాదని బాంబే హైకోర్టు పేర్కొంది. అత్యాచారం కేసులో పుణె పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ మనీష్ పితలే సింగిల్ బెంచ్ న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు

Advertisement

Viral Video: యువకులే కాదు రీల్స్ పిచ్చిలో వృద్ధులు, రన్నింగ్ ట్రైన్‌లో డోర్ వద్ద ప్రమాదకర స్టంట్...వీడియో ఇదిగో

Arun Charagonda

రీల్స్ పిచ్చిలో ఎంతోమంది యువకులు ప్రాణాలు కొల్పోయారు. అయితే తాజాగా రీల్స్ పిచ్చి వృద్ధులకు పాకింది. ఓ రన్నింగ్ ట్రైన్‌లో డోర్ వద్ద ప్రమాదకర స్టంట్స్ చేశాడు ఓ వృద్ధుడు. ప్రాణాలతో చెలగాటం ఆడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.

Uttar Pradesh: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద కత్తులతో పొడుచుకున్న ఇద్దరు వ్యక్తులు, గ్రామస్తులు చూస్తుండగానే భయకరంగా దాడి

Hazarath Reddy

మిర్జాపూర్‌లోని జివాటి గ్రామం నుండి జరిగిన షాకింగ్ సంఘటనలో, కుటుంబ ఆస్తి వివాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు పట్టపగలు ఒకరినొకరు పొడిచుకుంటూ వీడియోలో పట్టుబడ్డారు. అప్పటి నుండి వైరల్ అయిన భయంకరమైన ఫుటేజ్, గ్రామస్తులు చూస్తుండగానే పురుషులు హింసాత్మక వాగ్వాదానికి దిగినట్లు చూపిస్తుంది

Telangana DSC 2024 Results: తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల, పరీక్ష నిర్వహించిన 56 రోజుల్లోనే ఫలితాలు విడుదల

Arun Charagonda

తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో డీఎస్సీ-2024 ఫలితాలను విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. డీఎస్సీ పరీక్షలకు 2,46,584 (88.11%) మంది అభ్యర్థులు హాజరుకాగా 56 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసింది ప్రభుత్వం.

Detonator Blast In Kadapa: కడపలో దారుణం, డిటోనెటర్లు పేలి వీఆర్ఏ నరసింహ మృతి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామం బాంబుల మోతతో దద్దరిల్లింది. వీఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లు పేలడంతో నరసింహ మృతి చెందాడు.

Advertisement
Advertisement