తాజా వార్తలు

Chandrababu On NBK 50 Years: బాలకృష్ణ కెరీర్‌ అన్‌స్టాపబుల్‌..చంద్రబాబు ప్రశంసలు, కథానాయకుడే కాదు ప్రజా నాయకుడు అంటూ కితాబు

Arun Charagonda

బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

R. Krishnaiah on Party Change Rumors: చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతా, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య

Hazarath Reddy

వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. ఇక తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెపుతారనే ప్రచారం జరుగుతోంది.

Andhra Pradesh Shocker: పాలకొల్లులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడు మృతి, ప్రియురాలికి తీవ్ర గాయాలు

Arun Charagonda

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు రాజేష్ మృతి చెందగా ప్రియురాలు సత్య శ్రావణికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే శ్రావణిని ఆస్పత్రికి తరలించి చికిత్ర అందిస్తున్నారు.

CM Revanth Reddy responds On Supreme Court Comments: న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది, తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న సీఎం రేవంత్‌ రెడ్డి, పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడి

Arun Charagonda

దేశ సర్వోన్నత న్యాయస్థానం..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్.. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

YSRCP MLCs Resign: వైసీపీకి మరో షాక్, పార్టీకి - ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన పద్మ శ్రీ, కళ్యాణ చక్రవర్తి, వీరిబాటలోనే మరికొంతమంది ఎమ్మెల్సీలు!

Arun Charagonda

వైసీపీకి మరో షాక్ తగిలింది. ప్రజాప్రతినిధులు వరుస రాజీనామాలతో ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు. కాసేపట్లో మండలి చైర్మన్ కు రాజీనామా లేఖలు అందజేయనున్నారు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి.

Jurala Project: రికార్డు స్థాయిలో జురాలకు పోటెత్తిన వరద, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములకు భారీగా చేరుతున్న వరదనీరు..వీడియో

Arun Charagonda

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి,నారాయణపూర్ డ్యాములకు భారీగా చేరుతోంది వరద నీరు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 3,10,000 క్యూసెక్కులుగా ఉండగా ప్రాజెక్టు ఓట్ ఫ్లో: 3,00,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీంఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం: 8.010 టీఎంసీలుగా ఉంది.

Andhra Pradesh: సీఎం చంద్రబాబు మరో సంచలనం, ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైఎస్‌ఆర్ పేరును తొలగిస్తు నిర్ణయం తీసుకున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2023-24లో ప్రారంభించిన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

Hidden Cameras In Girls Hostel Washroom: గుడివాడలో దారుణం, గర్ల్స్ హాస్టల్ వాష్‌ రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు, 100 వీడియోలను అమ్మిన దుర్మార్గులు!,లాంటి కెమెరాలు లేవని పోలీసుల వెల్లడి

Arun Charagonda

గుడివాడలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసిన సంఘటన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు సహచర విద్యార్థులు.

Advertisement

Telangana Shocker: సిద్దిపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం, కత్తితో గొంతులో పొడుచుకున్న 60 సంవత్సరాల వ్యక్తి, ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల శివారులో కత్తితో గొంతులో పొడుచుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూరానికి చెందిన ఎరుకల రాజయ్య గౌడ్ (60) గా గుర్తించారు పోలీసులు. చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కుకునూరుపల్లి పోలీసులు.

Delhi: వివాదంలో ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రజత్ దలాల్, రాష్ డ్రైవింగ్ చేస్తే బైక్‌ను ఢీకొట్టిన రజత్ కారు, రోజు తనకు ఇదే పని అంటూ నిర్లక్ష్య సమాధానం ..నెటిజన్ల మండిపాటు

Arun Charagonda

ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రజత్ దలాల్ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని ఫరీదాబాద్ - బదర్‌పూర్ రోడ్డుపై 143 కిలోమీటర్ల వేగంతో రాష్ డ్రైవింగ్ చేసి బైక్‌ను ఢీకొట్టారు రజత్. బైక్‌ను ఢీకొట్టగానే ఏం పర్లేదు రోజూ నాకు ఇదే పని అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు.

Pilli Subhash Chandra Bose On Party Change: వైసీపీని వీడను, జగన్‌కు వెన్నుపోటు పొడవను క్లారిటీ ఇచ్చిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీలోనే ఉంటానని స్పష్టం

Arun Charagonda

వైసీపీకి ,ఎంపీ పదవులకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో టీడీపీలో చేరనుండగా తాజాగా మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం రాజీనామా చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి.

Spice Jet Furloughs: ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌.. సిబ్బందికి మూడు నెలలు జీతం కట్‌

Rudra

చౌకధరలకే విమాన ప్రయాణాన్ని అందించే దేశీయ విమానయాన సంస్థగా పేరు తెచ్చుకున్న స్పైస్‌ జెట్‌ (Spice Jet) పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.

Advertisement

Pawan Kalyan On Vana Mahotsavam: వన మహోత్సవం సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ పిలుపు, అన్య జాతుల మొక్కలను పెంచడం ఆపేద్దామన్న పవన్

Arun Charagonda

దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు పవన్. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి… ఇది సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం అని, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Fire Accident in Nalgonda: నల్గొండ శ్రీపతి ల్యాబ్‌ లో లీకైన రియాక్టర్.. చెలరేగుతున్న మంటలు ( వీడియో)

Rudra

పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మొన్నటికిమొన్న ఏపీలోని అనకాపల్లిలో ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనను మరిచిపోకముందే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీపతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ లో మంటలు చెలరేగాయి.

CM Revanth Reddy On Ganesh Festival: హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా గణేష్‌ ఉత్సవాలు, గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్, సెప్టెంబర్ 19న మిలాద్-ఉన్-న‌బీ వేడుకలు...సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ

Arun Charagonda

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. గణేష్ ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో రివ్యూ నిర్వహించిన రేవంత్..పలు కీలక సూచనలు చేశారు. అనుమ‌తులు తీసుకున్న మండ‌పాల‌కు ఉచిత విద్యుత్ అందించాలని, అధికారులు, నిర్వాహ‌కులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలో సుప్రీం కోర్టు నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

LGBTQ Joint Bank Account: ఎల్జీబీటీక్యూ వర్గాలకు కేంద్రం గుడ్‌ న్యూస్.. ఆంక్షలు లేకుండానే ఉమ్మడి బ్యాంకు ఖాతా.. ఆంక్షలు లేకుండానే నామినీ పేరు కూడా..

Rudra

ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఖాతాలను తెరవడం విషయంలో వారికి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది.

Advertisement

Wheelchair Basketball Paralympics Google Doodle: పారాలింపిక్స్ 2024, వీల్ చైర్ బాస్కెట్‌ బాల్..ప్రత్యేక ఆకర్షణగా గూగుల్ డూడుల్

Arun Charagonda

పారిస్ వేదికగా పారాలింపిక్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటుండగా ఈసారి భారత్‌ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. పారాలింపిక్స్ సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్ విడుదల చేసింది. వీల్ చైర్ బాస్కెట్ బాల్ కు గుర్తుగా ఇవాళ స్పెషల్ డూడుల్‌ని రిలీజ్ చేసింది. 108 దేశాల్లో వీల్ చైర్ బాస్కెట్ బాల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుండి వీల్ చైర్ బాస్కెట్ బాల్‌కు సంబంధించిన మ్యాచ్‌లు జరగనుండగా ఇందుకు సూచికంగా ఆకట్టుకునేలా గూగుల్ డూడుల్‌ని రూపొందించింది.

HYDRA Limits: హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు.. కూల్చివేతలపై సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన

Rudra

హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌ గా మారింది.

Selling Sunlight: రాత్రివేళ సూర్యకాంతి ఉత్పత్తి.. దాన్ని విక్రయిస్తారట కూడా.. అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ ప్రకటన.. ఎందుకట??

Rudra

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ అనే కంపెనీ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. రాత్రివేళ సూర్యకాంతిని ఉత్పత్తి చేయడమే కాదు.. దాన్ని విక్రయిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది.

World’s Richest Dog: ఈ శునకం గారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది.. దీని ఆస్తుల విలువ రూ.3,300 కోట్లు మరి.. ఏంటా విషయం?

Rudra

కింది ఫొటోలో కనిపిస్తున్న జర్మన్‌ షెఫర్డ్‌ శునకం పేరు గుంథెర్‌-6. ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీనికి ఓ విమానం, యాట్‌ సహా బీఎండబ్ల్యూ కారు ఉన్నాయి.

Advertisement
Advertisement