తాజా వార్తలు
Plane Crash in Brazil: బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం.. చూస్తూ ఉండగానే గాల్లో గింగిరాలు తిరుగుతూ ఇండ్ల మధ్య కూలిన ప్రయాణికుల విమానం.. 62 మంది దుర్మరణం (వీడియోతో)
Rudraబ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మందితో వెళుతున్న ఓ ప్రయాణికుల విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ లో గాలిలో గింగిరాలు తిరుగుతూ కూలిపోయింది.
Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం.. రెజ్లింగ్ లో కాంస్యం గెలిచిన అమన్ సెరావత్.. ఒలింపిక్స్ లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు
Rudraపారిస్ ఒలింపిక్స్ లో మరో పతకంతో భారత్ మెరిసింది. చిన్నోడు చిచ్చర పిడుగే అన్నట్టు 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్ లో దూసుకుపోయి కాంస్యం సాధించాడు.
Sobhita Dhulipala Insta Post: ఎంగేజ్ మెంట్ తర్వాత సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల తొలి పోస్ట్, నాగచైతన్య గురించి ఎమోషనల్ గా ఏం రాసిందో చూడండి
VNSఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Warangal: నాలుగు రోజుల చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు, సగానికి పైగా తినడంతో ఆడా? మగా? కూడా గుర్తుపట్టని రీతిలో శిశువు మృతదేహం
VNSవరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రి వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఎంజీఎం వద్ద కుక్కలు నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువును (New born) పీక్కుతిన్నాయి. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులతో పాటు అక్కడే ఉన్న రోగుల బంధువులు కుక్కలను చెదరగొట్టారు
Waqf Amendment Act 2024: వక్ఫ్ సవరణ బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీలో సభ్యుల పేర్లు ఖరారు, ప్రతిపక్షం నుంచి ఎక్కువ మంది సభ్యులు, పూర్తి లిస్ట్ ఇదిగో
VNSవక్ఫ్ సవరణ బిల్లు 2024ను (Waqf Amendment Act) సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో జేపీసీ కమిటీపై మాట్లాడారు
SC on Hijab: కాలేజీల్లో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, అమ్మాయిలకు దుస్తులు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyక్యాంపస్‌లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ కాలేజీ ఇచ్చిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.హిజాబ్‌పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది.
Instagram Update: ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ అప్ డేట్, ఇకపై ఒకేసారి 20 ఫోటోలు అప్ లోడ్ చేయవచ్చు
VNSఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు (Instagram) అదిరే అప్‌డేట్.. ఎండ్‌గాడ్జెట్ నివేదిక ప్రకారం.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కరోజల్ పోస్ట్‌లో ఫొటోలు, వీడియోలను రెట్టింపు సంఖ్యలో యాడ్ చేసుకోవచ్చు. అవును.. మీరు చదివింది నిజమే. ఇప్పుడు గత మీడియా ఫైల్స్ పరిమితి 10కి బదులుగా ఒకే పోస్ట్‌లో గరిష్టంగా 20 మీడియా ఫైళ్లను షేర్ చేసుకోవచ్చు
Wayanad Landslide: వయనాడ్ విలయం తర్వాత భూమి లోంచి వింత శబ్దాలు, మిస్టరీ ధ్వనులతో హడలిపోతున్న ప్రజలు, జియోలాజికల్ సర్వే ఏం చెప్పిందంటే..
Vikas Mకేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 413 మంది మరణించగా, ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలోని ఎడక్కల్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భూమి లోంచి వింత శబ్దాలు వస్తున్నాయని చెబుతున్నారు.
Amgen New Innovation Center in Hyderabad: హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న బయోటెక్ దిగ్గజం యాంజెన్, 3,000 మందికి ఉపాధి
Vikas Mఅమెరికాకు చెందిన బయోటెక్ దిగ్గజం యాంజెన్ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హైటెక్ సిటీలో RMZ స్పైర్ టవర్‌లో వచ్చే ఏడాది మార్చిలోపు తమ పనులను ప్రారంభించనుంది. ఇందులో గరిష్ఠంగా 3,000 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ తెలిపింది.
Ola Electric Bike: ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఓలా సంచలనం, త్వరలోనే ఓలా ఎలక్ట్రిక్ బైక్ రిలీజ్ చేయనున్న కంపెనీ, ఫీచర్స్ ఇవి!
VNSఓలా కస్టమర్లకు అదిరే న్యూస్.. భారత మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది. ఆగస్టు 15న తమిళనాడులోని ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో నిర్వహించే “సంకల్ప్ 2024” అనే వార్షిక కార్యక్రమంలో ఓలా ఈవీ బైక్ ( (Ola Electric Bike)) లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Sachin on Vinesh Phogat Disqualification: వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలే, భారత్ రెజ్లర్‌కు బాసటగా నిలిచిన సచిన్ టెండూల్కర్
Vikas Mఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరిన వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనన్నారు
India vs China: చైనాకు దిమ్మతిరిగే షాకివ్వబోతున్న భారత్, ఈ ఏడాది టూ వీలర్ మార్కెట్‌లో చైనాను వెనక్కి నెట్టేయనున్న ఇండియా, ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ మార్కెట్‌గా..
Vikas Mద్విచక్ర వాహన మార్కెట్‌లో భారత్ దూసుకుపోతోంది. కొత్త నివేదిక ప్రకారం, 2024లో చైనాను (India vs China)అధిగమించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించబోతోంది. భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఈ వృద్ధి కనిపిస్తోంది.
NASA Alert: భూమి వైపు మూడు గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయి, వాటి నుంచి భూమికి ముప్పుపై నాసా కీలక సమాచారం ఇదిగో..
Hazarath Reddyభూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వెల్లడించింది
Reliance Industries Layoffs: ఆదాయం తగ్గిందని 42 వేల మంది ఉద్యోగులను తీసేసిన రిలయన్స్, నియామకాలను కూడా తగ్గించిన ముఖేష్ అంబానీ కంపెనీ
Vikas Mభారతదేశంలోని అతిపెద్ద సమ్మేళన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 11 శాతం లేదా 42,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను గణనీయంగా తగ్గించుకుంది. కంపెనీ తన నియామక వేగాన్ని కూడా తగ్గించింది, ఈ సంవత్సరంలో దాదాపు 171,000 కొత్త ఉద్యోగులను తీసుకువచ్చింది.
PhonePe New Feature Update: ఫోన్‌పేలోకి కొత్త ఫీచర్ వచ్చేసిందోచ్, ప్రీ-అప్రూవ్డ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫీచర్ ప్రారంభించిన డిజిటల్ పేమెంట్ యాప్
Vikas Mఫోన్‌పే తన ప్లాట్‌ఫారమ్‌లో 'ప్రీ-అప్రూవ్డ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్' ఫీచర్‌ను ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించింది. పాలసీ కొనుగోలు సమయంలో ఆదాయ రుజువు అవసరాన్ని మినహాయించడం ద్వారా లక్షలాది మంది భారతీయులకు బీమా కవరేజీని మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఫీచర్ లక్ష్యం.
Manish Sisodia: రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటకు వస్తారు, జైలు నుంచి విడుదలైన తర్వాత మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఏదైనా నియంతృత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, నియంతృత్వ చట్టాలను రూపొందించి ప్రతిపక్ష నాయకులను కటకటాల వెనక్కి నెట్టివేస్తే, ఈ దేశ రాజ్యాంగం బాధితులకు రక్షణ కల్పిస్తుంది" అని ఆయన నొక్కి చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణలో అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా విముక్తి లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
'Indebted To Babasaheb': నా శరీరంలోని ప్రతి అంగుళం బాబాసాహెబ్‌కు రుణపడి ఉంటా, జైలు నుంచి విడుదలైన తర్వాత భావోద్వేగానికి గురైన మనీష్ సిసోడియా
Hazarath Reddyఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియా బెయిల్‌పై విడుదలైన తర్వాత తీహార్ జైలు వెలుపల పెద్ద ఎత్తున పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆగస్టు 9న సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది
Manish Sisodia Released From Tihar Jail: 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన మనీష్ సిసోడియా, ఘన స్వాగతం పలికిన ఆప్ కార్యకర్తలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddy17 నెలల కటకటాల తర్వాత ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. అంతకుముందు రోజు సుప్రీంకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం వల్ల సత్వర న్యాయం పొందే హక్కు అతనికి లేకుండా చేశారని పేర్కొంది.
Manish Sisodia Walks Out of Tihar Jail: 17 నెలల తర్వాత బయటకు, తీహార్ జైలు నుండి విడుదలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా
Hazarath Reddyమద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తిహాడ్ జైలు నుంచి ఈ సాయంత్రం బయటకు వచ్చారు.
Parliament Adjourned Sine Die: పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా, 12 బిల్లులు ప్రవేశపెట్టిన మోదీ సర్కారు, నాలుగు బిల్లులు మాత్రమే పాస్
Hazarath Reddyపార్లమెంటు , లోక్‌సభ మరియు రాజ్యసభ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెషన్‌లో ఆర్థిక బిల్లును ఆమోదించారు.