India
Attack on Allu Arjun's House: అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులకు ఆదేశాలు
Hazarath Reddyహీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై అదివారం ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ(Telangana DGP), నగర పోలీసు కమిషనర్(CP) ను ఆదేశించారు
Sandhya Theater Incident: సంధ్య థియేటర్ ఘటన, రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించే పనిలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి
Hazarath Reddyసంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది.సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే.
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, కారు కింద చిక్కుకున్న ఆవుదూడ, వాహనాన్ని కదలకుండా రౌండప్ చేసిన ఆవులు, చివరకు ఏమైందంటే..
Hazarath Reddyచత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో ఓ వైరల్ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారు కింద ఆవుదూడ చిక్కుకుంది. అది గమనించిన తల్లి ఆవుతో పాటు మరికొన్ని ఆవులు వెళుతున్న కారు వెంట పరిగెత్తి అడ్డగించాయి
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఘోర రోడ్డు ప్రమాదంలో 150 గొర్రెలు మృతి, పొగ మంచులో రోడ్డు మీద వెళ్తున్న మందను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
Hazarath Reddyఅద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై ఘోరం జరిగింది. పులిపాడు వద్ద ట్రావెల్ బస్సు ఢీకొని 150 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు.
Nelamangala Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొని కారు మీద పడటంతో ఆరుమంది స్పాట్ డెడ్, నెలమంగళలో విషాదకర ఘటన
Hazarath Reddyబెంగళూరు-తుమకూరు హైవే (NH-48)పై జరిగిన ఘోర ప్రమాదంలో బెంగళూరుకు చెందిన IAST సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రం యెగపాగోల్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 4పై నెలమంగళ తాలూకా తాలెకెరె గ్రామంలో వరుసగా రెండు ట్రక్కులు ఢీకొట్టుకున్నాయి. మధ్యలో ఉన్న కారుపై కంటైనర్ పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు
Earthquake in Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు, మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూప్రకంపనలు
Hazarath Reddyప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 10.35 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో మూడు రోజుల నుంచి వరుసగా భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు
Burmese Python Video: 17 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువ వీడియో ఇదిగో, బరువు 100 అడుగులపైనే.. యూనివర్సిటీ క్యాంపస్‌లోకి రావడంతో..
Hazarath Reddyపాములు లేదా సరీసృపాలు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లే వైరల్ వీడియోలను మనం తరచుగా చూస్తుంటాం. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న తాజా వైరల్ వీడియోలో, సిల్చార్‌లోని అస్సాం యూనివర్శిటీ క్యాంపస్‌లో 17 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువ కనిపించింది
Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraవేగవంతమైన నడకతో డయాబెటిస్ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Govt. Money Scheme For Sunny Leone: సన్నీ లియోన్ కు నెలకు రూ.1000.. అకౌంట్ లోకి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ నిధులు
Rudraవివాహిత మహిళల కోసం ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ పథకం తీసుకొచ్చిన ఆర్ధిక సాయం స్కీంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
CV Anand Apology: జాతీయ మీడియా అమ్ముడుపోయిందన్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన సీపీ సీవీ ఆనంద్ (వీడియో)
Rudraఅల్లు అర్జున్- సంధ్య థియేటర్ వ్యవహారంలో నేషనల్ మీడియా అమ్ముడు పోయింది అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు.
Transgenders In Traffic Duties: నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraహైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి విధుల్లో చేరుకోనున్నారు. మొత్తం 39 మంది డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఔట్, ఇండోర్ తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో వాళ్లు శిక్షణ తీసుకున్నారు.
Allu Arjun’s House Attack Row: అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్
Rudraసంధ్య థియేటర్ ఘటనలో నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు.
PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉదయ్ పూర్ లో జరిగిన వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు.. రేపు హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్
Rudraప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
Telangana Student Dies In US: అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కారులో శవమై కనిపించిన యువకుడు.. బాధితుడు హనుమకొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు
Rudraఅమెరికాలో తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా తెలంగాణలోని హనుమకొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
Smuggler Arrested in Pushpa 2 Theatre: పుష్ప -2 సినిమా చూస్తూ అడ్డంగా బుక్కయిన మోస్ట్ వాటెండ్ స్మగ్లర్, సినీ ఫక్కీలో థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, ఆ తర్వాత ఏమైందంటే?
VNSడ్రగ్స్ స్మగ్లింగ్‌తోపాటు (Smuggling) రెండు హత్యా కేసుల్లో నిందితుడైన వ్యక్తి పుష్ప 2 సినిమా చూస్తూ ఆనందంలో మునిగిపోయాడు. అయితే థియేటర్‌లోకి ప్రవేశించిన పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు. వారి కళ్లగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఆ నిందితుడ్ని అరెస్ట్ చేశారు. (Smuggler Caught During Pushpa 2 Screening) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది.
Allu Aravind: అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన గురించి స్పందించిన అల్లు అరవింద్, ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
VNSమా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటించాల్సిన సమయం. దేనికీ రియాక్ట్ కాకూడదు. పోలీసులు వచ్చి ఆందోళనకు దిగిన వారిని తీసుకెళ్లారు. కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
Vasundhara Raje Convoy Accident: రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజేకు తప్పిన ముప్పు, కాన్వాయ్ బోల్తాపడి పలువురికి గాయాలు
VNSబీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే (Vasundhara Raje) కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. (Vasundhara Raje’s convoy overturns) వెంటనే స్పందించిన ఆమె గాయపడిన పోలీసులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Woman Chops Off Boyfriends Private Parts: పెళ్లికి ఒప్పుకోలేదని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువతి, ఆపై చేతిని కోసుకొని ఆత్మహత్య, ఆ తర్వాత ఏమైందంటే?
VNSమరో మహిళతో పెళ్లికి సిద్ధమైన ప్రియుడిపై ప్రియురాలు పగ తీర్చుకున్నది. చివరిసారి కలుద్దామంటూ అతడ్ని పిలిచింది. కత్తితో ఆ వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కోసింది. ఆపై తన చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. (Woman Chops Off Boyfriend’s Private Parts) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో (Muzaffarnagar) ఈ సంఘటన జరిగింది.
Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్రపంచం ఫిదా, 9 ఏళ్ల వయస్సులోనే సరికొత్త రికార్డు సృష్టించిన నారావారి వారసుడు
VNSచంద్రబాబు నాయుడు (Chandra Babu) మనవడు నారా దేవాన్ష్ (Nara Devansh ) చదరంగంలో (Chess) వేగంగా పావులు కదపడంలో రికార్డు సృష్టించాడు. చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించడంతో వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ (London) నుంచి నారా దేవాన్స్ ధ్రువపత్రం సాధించారు. నారా దేవాన్ష్ రికార్డు సాధించడం పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.