India

Hemant Soren Oath: జార్ఖండ్ 14వ సీఎంగా హేమంత్ సోరేన్, సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం..హాజరుకానున్న ఇండియా కూటమి నేతలు

Arun Charagonda

జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు జేఎంఎం నేత హేమంత్ సొరేన్. సాయంత్రం 4 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా రాంచీ లోని మొరబడి గ్రౌండ్ లో హేమంత్ సొరేన్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్.

Jharkhand Shocker: ప్రియురాలిని 50 ముక్కలుగా నరికిని ప్రియుడు..ఓ కుక్క యువతి శరీర భాగం తినడంతో వెలుగులోకి వచ్చిన దారుణ సంఘటన...పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

ఘోర సంఘటన.. ప్రియురాలిని చంపి 50 ముక్కలుగా నరికాడు ఓ దుర్మార్గుడు. జార్ఖండ్ కు చెందిన నరేష్.. చెన్నైలో ఓ యువతితో సహజీవనం చేస్తున్నారు. మరోవైపు సొంత ఊరిలో వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. తనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రియురాలు ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.

RGV: నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమే, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ సినిమా ప్రమోషన్ కోసమేనని వెల్లడించిన ఆర్జీవీ

Arun Charagonda

తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ నా సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికేనని తేల్చిచెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమేనన్నారు. నా పోస్టులు, సినిమాలు ఎవరినీ కించపర్చడానికి కాదు అన్నారు. ఏపీ పోలీసులు వర్మ కోసం గాలిస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం.

Telangana: సాంబారు,చట్నీలో బొద్దింక..మహబూబ్ నగర్‌ ఎస్సీ బాలికల హాస్టల్‌లో కలకలం...విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థులకు బెదిరింపులు

Arun Charagonda

మహబూబ్ నగర్ - పాలమూరులోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో సాంబారు, చట్నీలో బొద్దింక రావడం కలంకలం రేపింది. ఈ విషయమై వంట సిబ్బందిని అడిగితే ఇంట్లో బొద్దింక వస్తే తీసేసి తినమా అంటూ విద్యార్థులను బెదిరించారు వంట సిబ్బంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంబారులో బొద్దింక వచ్చిందంటే ప్లేట్లోంచి పడేసి తినాలని సిబ్బంది చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శమని మండి పడ్డారు.

Advertisement

Harish Rao On Rythu Bharosa: రైతు భరోసా భోగస్..కనీస మద్దతు ధర ఏది?, రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌ రావు ఫైర్

Arun Charagonda

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్​నగర్​లో నేటి నుంచి మూడు రోజుల పాటు రైతుపండగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది.కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Pushpa Re-Release: కోటి రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేక చ‌తికిలాప‌డ్డ‌ పుష్ప‌, హిందీ వ‌ర్ష‌న్ మూవీ రిలీజ్ విష‌యంలో అల్లు అర్జున్ కు ఎదురుదెబ్బ‌

VNS

రీరిలీజ్‌ ట్రెండ్‌లో కరణ్‌ అర్జున్‌, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్‌ ఖాన్‌ 'కల్‌ హో నా హో' (Kal Ho Na Ho) సినిమా కూడా నవంబర్‌ 15న రీరిలీజ్‌ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.

Chennai Court Grants Divorce To Dhanush and Aishwarya: ఎట్ట‌కేల‌కు ఆ స్టార్ క‌పుల్ కు విడాకులు మంజూరు, 18 ఏళ్ల వివాహ బంధానికి చ‌ట్ట‌ప‌రంగా తెర

VNS

తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్‌-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.

Allu Arjun Craze in Kerala: కేర‌ళ‌లో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తే మ‌తి పోవాల్సిందే! మ‌ల్లు అర్జున్ అంటూ వెలిసిన పోస్ట‌ర్లు, వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన ఫ్యాన్స్

VNS

ఐకాన్ స్టార్‌కు (Icon Star) తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కొచ్చి లివా మాల్‌లోని గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జ‌రిగింది.

Advertisement

Nara Lokesh Key Comments: ఏపీలో ఇక‌పై వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్, కేబినెట్ స‌బ్ క‌మిటీలో కీల‌క నిర్ణ‌యం, ప్ర‌తిపాదించిన నారా లోకేష్

VNS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కట్టడికి ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు. గంజాయి(Ganja), డ్రగ్స్ పై (Drugs) ఇక యుద్ధమే అన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్నారు లోకేశ్.

BRS Gurukula Bata: రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ స‌మ‌ర‌శంఖం, గురుకుల బాట‌కు పిలుపునిచ్చిన కేటీఆర్

VNS

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గురుకుల బాట (Gurukula Bata) కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు(KGBVB), మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పరిశీలించనున్నారని తెలిపారు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, నెల్లూరుకు చెందిన హిజ్రా లీడర్ హాసిని దారుణ హత్య, రెండు కార్లలో వచ్చి..

Hazarath Reddy

హిజ్రాల నాయకురాలు హాసిని మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టపాతోపు వద్ద దుండగులు దారికాచి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. హిజ్రా నాయకురాలు హాసినిని చంపేందుకు దుండగులు రెండు కార్లలో వచ్చినట్టు సమాచారం.

Ram Gopal Varma: సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అందరూ జైల్లోనే ఉంటారు, రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

రాజకీయ నాయకులకు పోలీసులు ఆయుధంగా మారారన్నారు దర్శకుడు ఆర్జీవీ. ఏడాది క్రితం పెట్టిన ఏవో ట్వీట్స్​ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. తాను ట్వీట్స్​ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, గోడ మీద నిల్చుని డ్యాన్స్ చేయబోయి కిందపడిన యువకుడు, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఓ యువకుడు గోడ మీద నిల్చుండి తనకు తెలిసిన డాన్స్‌ను చేయాలనుకున్నాడు. కొంచెం స్టెప్పులు వేద్దామని కాలు కదపబోయే సరికి బ్యాలెన్స్ కుదరగా గోడ మీద నుంచి కింద పడ్డాడు. అతను నిల్చున్న ప్రదేశంలో ఏదో జాతరలాంటి కార్యక్రమం జరుగుతున్నట్లు అర్ధమవుతోంది.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, సరోగసి కోసం ఇంటికి పిలిచి లైంగిక వేధింపులు, అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తుపై నుండి దూకి చనిపోయిన మహిళ

Hazarath Reddy

హైదరాబాద్ మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ (25) అనే మహిళ మృతిచెందింది. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగను రాజేష్ బాబు అనే వ్యక్తి తెచ్చుకున్నారు.

Raghu Rama Krishna Raju Harassment Case: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు, సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్

Hazarath Reddy

ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయపాల్ ను నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనను గుంటూరు తరలించి, కోర్టులో హాజరుపరిచారు.

Ram Charan's New Look from RC 16: RC 16 చిత్రం నుంచి రా చంరణ్ కొత్త లుక్ వచ్చేసింది, ఎలా ఉందో మీరే చూసి చెప్పండి

Hazarath Reddy

RRR స్టార్ రామ్ చరణ్ త్వరలో శంకర్ గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే, రామ్ తన తదుపరి చిత్రానికి ప్రస్తుతం RC 16 అనే టైటిల్‌ను సిద్ధం చేయడం ప్రారంభించాడు. రామ్ త్వరలో బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించనున్నాడు.

Advertisement

Eknath Shinde On CM Post: సీఎం పదవిపై ఏక్‌నాథ్‌ షిండే కీలక వ్యాఖ్యలు, పోరాటం నా రక్తంలోనే ఉంది...సీఎం పదవి విషయంలో మోదీ నిర్ణయమే ఫైనల్

Arun Charagonda

సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదు పోరాటం నా రక్తంలోనే ఉంది షిండే నేను సీఎంగా ఏనాడూ ప్రవర్తించలేదు అన్నారు. ఒక సామాన్యుడిలా ప్రజల్లో తిరిగానని... ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కార్యకర్తలకు ధన్యవాదాలుఅభివృద్ధి పథకాలే మహాయుతిని గెలిపించాయన్నారు.

Astrology: డిసెంబర్ 15వ తేదీన కుజ గ్రహం స్వాతి నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారకి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో మూడు సార్లు తన రాశిని మారుస్తుంది. డిసెంబర్ నాలుగు డిసెంబర్ 15 డిసెంబర్ 29 ఈ మూడు తేదీల్లో కుజ గ్రహం మూడుసార్లు తన రాశిని మారుస్తుంది.

Telangana: మానవత్వమా నువ్వెక్కడా?, కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు..కాలు విరిగి ఎనమిది రోజులుగా స్మశానంలోనే వృద్ధురాలు...వీడియో వైరల్

Arun Charagonda

మానవత్వం మంటగలిసింది. జగిత్యాలలో కన్నతల్లిని స్మశానంలో వదిలేశారు కసాయి కొడుకులు. గత ఎనిమిది రోజులుగా స్మశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ ఉంది. పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చితకబాదాడు కుమారుడు. కాలు విరగడంతో అచేతన స్థితిలో రాజవ్వ ఉండగా నలుగురు కొడుకులు ఉన్నా ఏం ప్రయోజనం లేదని వాపోయింది. అధికారులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తరలించారు.

Astrology: డిసెంబర్ 2 తేదీన సూర్యుడు, గురు గ్రహం కలయికతో భద్రకయోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలకు రాజు సూర్యుడు, గురు గ్రహం ఈ రెండు కలయిక వల్ల భద్రకయోగం ఏర్పడుతుంది. డిసెంబర్ 2 తేదీన ఈ భద్రత యోగంతో అన్ని రాశులు వారిపైన సానుకూల ప్రభావాలు ఉంటాయి.

Advertisement
Advertisement