India
Andhra Pradesh: షాకింగ్..50 కేజీల కారంతో శివస్వామి బాబాకు అభిషేకం, గత మూడు ఏళ్లుగా ఇదే తంతు..శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో ఘటన
Arun Charagondaఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో 50 కేజీల కారంతో అభిషేకం చేయించుకున్నారు ఓ బాబా. శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో 50 కేజీల కారంతో అభిషేకం చేయించుకున్నారు శివస్వామి బాబా. ప్రత్యంగిరా దేవికి ఇష్టమైన కారంతో శివస్వామి బాబాకు అభిషేకం చేశారు. గత మూడేళ్లుగా స్వస్తిశ్రీ చాంద్రమానేన బహుళ పంచమి తిథి రోజే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు శివస్వామి బాబా.
CM Chandrababu: ప్రధానమంత్రి మోదీ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు, సంక్రాంతి నుండి 'మన్ కీ బాత్'..ప్రజలతో మమేకం కానున్న టీడీపీ అధినేత
Arun Charagondaసంక్రాంతి నుంచి ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' తరహాలోనే ప్రజలతో మమేకం కానున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆడియో లేదా వీడియో విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 1995-2004 మధ్య 'డయల్ యువర్ సీఎం' నిర్వహించిన సంగతి తెలిసిందే.
Actress Kasthuri: నటి కస్తూరికి బెయిల్ మంజూరు, కుమారుడి అనారోగ్యంతో ఉన్నాడని ఎగ్మూర్ కోర్టులో బెయిల్ పిటిషన్...అంగీకరించిన న్యాయస్థానం
Arun Charagondaనటి కస్తూరికి బెయిల్ మంజూరైంది. తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయి చెన్నై పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కస్తూరి. కుమారుడు ఆటిజంతో బాధ పడుతున్నాడని బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో బెయిల్ మంజూరు చేసింది ఎగ్మూర్ కోర్టు.
Software Engineer Suicide: హైదరాబాద్ మాదాపూర్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేసిన నవీన్ రెడ్డి..పోలీసుల విచారణ
Arun Charagondaహైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్‌లో నవీన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
President Draupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ హెల్ప్‌లైన్ కోసం టోల్ ఫ్రీ నెంబర్...!
Arun Charagondaరాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. 6.20 నుంచి 7.10 వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం రాత్రి 7.20కి ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు ముర్ము.
CM Revanth Reddy: మాగనూరు స్కూల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశం..ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులపై ఫైర్
Arun Charagondaనారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థినీ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.
CBSE Board Exam Date Sheet 2025: సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షల తేదీలు విడుదల, ఫిబ్రవరి 15 నుంచి ఎగ్జామ్స్, పూర్తి టైం టేబుల్ ఇదుగోండి
VNSసీబీఎస్‌ఈ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్స్‌ను (CBSE Exams)రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పది, పన్నెండు తరగతి పరీక్షలు (CBSE Board Exam 2025) జరుగుతాయని తెలిపింది. ఇందులో పదవ తరగతి పరీక్సలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు జరగుతాయి.
Hyderabad: గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేత వీడియో ఇదిగో, హైడ్రాలిక్ యంత్రం సాయంతో కూల్చివేస్తున్న అధికారులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్థుల భవనం కూల్చివేత పనులను అధికారులు చేపట్టరు. ఇక్కడి సిద్ధిఖి నగర్‌లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన నాలుగంతస్థుల కొత్త భవనం నిన్న పక్కకు ఒరిగిన సంగతి విదితమే. పక్కన మరో భవనం నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో దీనిపై ఆ ప్రభావం పడిందని అంటున్నారు.
Mohini Dey Announced The Divorce: గురువు బాటలోనే ఏఆర్ రెహమాన్ శిష్యురాలు, ఆయన విడాకులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే సంచలన పోస్ట్, నెట్టింట తీవ్రమైన చర్చ
VNSవ్యక్తిగత కారణాల వల్ల ఈ దంపతులు విడాకులు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఊహించని విధంగా రెహమాన్ విడాకులు ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన మ్యూజిక్ అసిస్టెంట్ మోహిని డే (Mohini Dey Divorce) సైతం తన భర్తకి విడాకులు ఇచ్చి సపరేట్ అయినట్టు తెలిపింది.
Telangana Weather Update: రాబోయే వారం రోజులు జాగ్రత్త, తెలంగాణలో 15 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు, ఆ వ్యాధి ప్రబలే అవకాశం
VNSతెలంగాణలో రానున్న వారం రోజులు 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు (Lowest Temperatures) నమోదుకానున్నాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. శీతల సమయాల్లోనే ఇన్‌ఫ్లూయెంజా (Influenza) పంజా విసిరే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలుగా పేర్కొంది.
CM Atishi Comments on Amith Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై సీరియస్ కామెంట్స్ చేసిన ఢిల్లీ సీఎం అతిషి, గ్యాంగ్ స్టర్లకు అడ్డాగా మారిందని ఆగ్రహం
VNSఢిల్లీ నగరం గ్యాంగ్‌స్టర్లకు అడ్డాగా మారిందని ఢిల్లీ సీఎం అతిశీ (Delhi CM Atishi) అన్నారు. ఢిల్లీ లా అండ్ ఆర్డర్‌ను చేతిలో పెట్టుకుని కేంద్రం ఏం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన అతిశీ.. కేంద్ర మంత్రి అమిత్ షాపై (Amith Shah) తీవ్ర విమర్శలు గుప్పించారు.
NTR Movie With Nelson: సెన్సేషనల్ డైరక్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ మూవీ! పాన్ ఇండియాలో లెవల్ లో ఎన్టీఆర్ ప్లాన్
VNSజైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడట. టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యానర్‌గా కొనసాగుతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ సినిమాతోపాటు వార్ 2 ను పూర్తి చేయాల్సి ఉంది.
AP Cabinet key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Tamil Nadu: దారుణం, పట్టపగలే కోర్టు ఆవరణలో లాయర్‌ని కొడవలితో నరికేసిన అగంతకుడు, తమిళనాడు హోసూర్ కోర్టు కాంప్లెక్స్‌లో ఘటన
Hazarath Reddyతమిళనాడు నుంచి పట్టపగలు ఓ న్యాయవాదిపై హత్యాయత్నానికి పాల్పడిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈరోజు నవంబర్ 20న తమిళనాడులోని కృష్ణగిరిలోని హోసూర్ కోర్టు కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగింది. కెమెరాలో చిక్కుకున్న హత్యాయత్నం యొక్క కలతపెట్టే వీడియో కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది.
Jharkhand Exit Poll Result 2024: జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, ఓటర్లు ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపారంటున్న సర్వేలు
Hazarath Reddyమహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియగా..క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి.
Maharashtra Exit Poll Result 2024: ఇండియా కూటమికి షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ కూటమి, పూర్తి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో..
Hazarath Reddyమహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియగా..క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎక్కువ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
Praja Vijayotsava Sabha: కేసీఆర్..ఒక్కసారి అసెంబ్లీకి రా, అన్నీ లెక్కలు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్ దొబ్బిందని విమర్శ
Hazarath Reddyవేములవాడలో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదని అని అన్నారు.బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్ దొబ్బింది అని మండిపడ్డారు.
Anil Kumar Yadav: మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం, వైసీపీ నేతల అరెస్టులపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్, పార్టీ మారుతున్నారనే వార్తలు కొట్టివేత
Hazarath Reddyకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.
YS Jagan on Sharmila: వీడియో ఇదిగో.. బాలకృష్ణ ఇంటి నుంచి షర్మిలపై తప్పుడు ప్రచారం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ మాట్లాడారు. తనపై, తన తల్లిపై, తన చెల్లిపై అసభ్య పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.