India
Cocaine worth Rs 900 crore seized: ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత, ఏకంగా రూ. 900 కోట్ల విలువైన కొకైన్, ఇతర మాదక ద్రవ్యాలు సీజ్
VNSదేశ రాజధానిలో మాదకద్రవ్యాల గుట్టు రట్టయ్యింది. రూ.900 కోట్లు విలువచేసే 80 కిలోలకు పైగా కొకైన్ (Cocaine)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. మరోవైపు గుజరాత్ తీరంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), నేవీ, గుజరాత్ ఏటీఎస్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 700 కిలోల మెథాంఫేటమిన్ స్వాధీనం చేసుకున్నాయి.
Telugu CM's At Maharashtra Poll Campaign: మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా అనేక ముఖ్యనేతల ప్రచారం
VNSతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు. దీంతో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు.
Tilak Varma: సౌతాఫ్రికాతో టీ -20లో చెలరేగిన తెలుగు తేజం, వరుసగా రెండో సెంచరీ, అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా గుర్తింపు
VNSదక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ (Tilak Varma) అదరగొడుతున్నాడు. వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ (Back-to-Back Centuries in T20Is) శతకంతో చెలరేగాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచులో కేవలం 41 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు.
Fake Cop Video Calls Real Cyber Security Police: సైబర్ క్రిమినల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ తర్వాత ఏమైందంటే?
VNSఒక నకిలీ పోలీస్ ఏకంగా రియల్ పోలీస్‌కు వీడియో కాల్ చేశాడు. (Fake Cop Video Calls Real Cyber Police) ఆయన పోలీస్ అధికారి అని తెలుసుకుని అతడు షాక్ అయ్యాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళకు చెందిన సైబర్ సెక్యూరిటీ పోలీస్ అధికారికి నకిలీ పోలీస్ నుంచి వీడియో కాల్ వచ్చింది.
Women Fight Video: వీడియో ఇదిగో, విశాఖలో నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్న మహిళలు, వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం గొడవే కారణం
Hazarath Reddyవిశాఖపట్నం జిల్లా గాజువాకలో మహిళా వ్యాపారులు ఘర్షణ పడ్డారు. రోడ్డు మీద వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం నడిరోడ్డుపై మహిళలు కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే పరస్పరం జుట్లు పట్టుకుని దాడులు చేసుకున్నారు. కొట్టుకుంటున్న వారిని ఆపడానికి స్థానికులు ప్రయత్నించారు.
CM Chandrababu Delhi Tour: అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న మహిళను ఢీకొట్టిన కారు, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyసింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌ను ఓ మహిళ ఫోన్‌లో లీనమై దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది. మహిళ పరిస్థితిని చూడడానికి డ్రైవర్ కారు దిగి వచ్చాడు. ఆ మహిళ లేచి గాయాలను చూడకుండా ఫోన్ పాడైపోయిందో లేదో తనిఖీ చేసింది. కారు డాష్‌బోర్డ్ కెమెరా ఫుటేజ్ వైరల్‌గా మారింది.
Sudden Death in MP: షాకింగ్ వీడియో, బైక్ మీద వెళుతూ గుండెపోటుతో కుప్పకూలిన పోలీస్ అధికారి, ఎంపీలో విషాదకర ఘటన
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ బైక్‌పై వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీని కారణంగా అతను మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఘటన రైసెన్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, వేగంగా వస్తున్న ట్రక్కు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి, చక్రాల కింద పడి నుజ్జునుజ్జు..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని మధురలోని ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో, వేగంగా వచ్చిన ట్రక్కు ఇద్దరు బైకర్లు ధర్మేంద్ర మరియు రాంస్వరూప్‌లను ఢీకొట్టింది. ట్రక్కు వారి బైక్‌ను వెనుక నుండి ఢీకొట్టింది, దీంతో వారు బ్యాలెన్స్ కోల్పోయి వాహనం కింద పడిపోయారు. దాని వెనుక చక్రాలకు నలిగిపోయారు.
Ragging Incident: మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం..10 మంది సీనియర్ల సస్పెండ్, ర్యాగింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న డైరెక్టర్ రమేష్
Arun Charagondaమహబూబ్‌నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఈనెల 10న కొందరు ఫ్రెషర్స్‌ను ర్యాగింగ్ చేశౄరు సీనియర్లు. 13న వారికి కౌన్సిలింగ్ చేసిన డైరెక్టర్...బాధిత విద్యార్థుల ఫిర్యాదుతో 10 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ చేసినా, మిస్‌బిహేవ్ చేసినా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని డైరెక్టర్ రమేష్ తెలిపారు.
Haryana Pacer Anshul Kamboj: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్, కేరళతో రంజీ ట్రోఫీలో అద్భుత బౌలింగ్..వీడియో ఇదిగో
Arun Charagondaకేరళతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. రోహ్‌తక్‌లో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. 10/49తో అద్భుత స్పెల్ వేసి ఈ టోర్నమెంట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా నిలిచాడు.
Telangana Student Dies in Philippines: వీడియో ఇదిగో, ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి, పుట్టినరోజు నాడే విషాదకర ఘటన
Hazarath Reddyఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె స్నిగ్ధ ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
Donkey Farm Scam: తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్, ఆధిక లాభం పొందవచ్చంటూ యూట్యూబ్‌లో ప్రచారం.. ఆ తర్వాత మోసం..వీడియో ఇదిగో
Arun Charagondaతెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ బాధితులు పెరిగిపోతున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లో 400 మందికి పైగా బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించొచ్చని నమ్మించారు కేటుగాళ్ళు. వారి మాటలు నమ్మి రూ.20 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు బాధితులు. చివరికి మోస పోవడంతో బాధితులు లబోదిబో మంటున్నారు.
Telangana Shocker: జగిత్యాలలో దారుణం, అనుమానంతో స్కూలు కెళ్లి విద్యార్థుల ముందే ప్రిన్సిపాల్ అయిన భార్యపై దాడి చేసిన భర్త, తమ్ముడు
Hazarath Reddyగురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గురుకుల ప్రిన్సిపాల్ మమతపై భర్త సంపత్, ప్రిన్సిపాల్ తమ్ముడు రాజశేఖర్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినిలు, స్టాఫ్ సమక్షంలోనే చితకబాదిన కుటుంబసభ్యులు. దీంతో తీవ్ర భయాందోళనకు విద్యార్థినిలు గురైయ్యారు
Telangana: వీడియో ఇదిగో, బామర్ది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyజగిత్యాల జిల్లాలో గల మేడిపల్లి మండలం మోతుకురావుపేటలో బుధవారం అర్థరాత్రి పెళ్లిలో నృత్యం చేస్తూ గుండెపోటుతో సంజీవ్ (23) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కమ్మరికుంటలో నివాసముంటున్న సంజీవ్ మోతుకురావుపేటలో జరిగే తన మేనమామ కుమారుడి వివాహానికి హాజరయ్యాడు.
Minister Ponnam Prabhakar: 35 శాతం కుటుంబ సర్వే పూర్తి..ఎలాంటి అపోహలు వద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజలంతా స్వచ్ఛందంగా సర్వేకు సహకరిస్తున్నారన్న పొన్నం
Arun Charagondaసిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో 9 వ వార్డు లో పంజాల కవిత నివాసంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వే పై ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు లేవని ప్రజలే స్వచ్చందంగా సమాచారాన్ని ఇస్తున్నారని తెలిపారు.
Kakinada Subbaiah Hotel Seized: కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, భోజనంలో జెర్రి రావడంతో కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన కాకినాడ సుబ్బయ్య హోటల్ ను విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ఉన్న కాకినాడ సుబ్బయ్య హోటల్లో జెర్రి కలకలం రేపిన సంగతి విదితమే. ఒక వ్యక్తి భోజనంలో ఈ జెర్రి దర్శనమిచ్చింది.
PM Modi: ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం..జార్ఖండ్ నుండి ఢిల్లీకి రావడంలో ఆలస్యం
Arun Charagondaప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఢిల్లీకి చేరడానికి ఆలస్యమైంది. జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన అనంతరం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. జార్ఖండ్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే.
New Zealand Parliament: న్యూజిలాండ్ పార్లమెంట్‌లో ఎంపీల డ్యాన్స్...ఓ బిల్లుకు వ్యతిరేకంగా ఎంపీల వినూత్న నిరసన..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaన్యూజిలాండ్ పార్లమెంట్‌లో ఎంపీల డ్యాన్స్ వైరల్‌గా మారింది. ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో వినూత్న నిరసన తెలిపారు ప్రతిపక్ష ఎంపీలు. బిల్లును చించేసి మావోరి నృత్యం చేసిన యువ మహిళా ఎంపీ హనా రాహితి కరేరికి మైపి క్లార్క్..అమెను అనుసరించారు మరికొందరు ఎంపీలు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tirupati: నటుడు పోసాని కృష్ణమురళిపై జనసైనికుల ఆగ్రహం, పోసాని దిష్టిబొమ్మ దగ్దం.. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఫిర్యాదు
Arun Charagondaనటుడు పోసాని కృష్ణ మురళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నాయకులు. తిరుపతిలో పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పై పోసాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జనసైనికులు డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పీఎస్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.