India
Nagarjuna: అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు, తమ్మడికుంట కబ్జా చేశారని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు
Arun Charagondaసినీ నటుడు అక్కినేని నాగార్జునకు షాక్ తగిలింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించడంతో సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. నాగార్జునపై మాధాపూర్ పోలీసులకు ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Aravind Kejriwal: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్, పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్న కేజ్రీవాల్...వీడియో ఇదిగో
Arun Charagondaఇటీవల ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్..తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు కేజ్రీవాల్. ఇకపై అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో పాటు మండి హౌస్ సమీపంలోని ఫిరోజ్ షా రోడ్డులో ఉన్న పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్నారు.
Chandrababu On Tirumala: తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు..వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన సీఎం
Arun Charagondaతిరుమల లో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసి..వంటశాల ప్రారంభించారు సీఎం. ఆధునిక పరిజ్ఞానంతో అన్న ప్రసాదాల తయారీ విధానాన్ని సీఎంకు వివరించారు టీటీడీ అదనపు ఈవో.
Telangana Shocker: ఆన్‌లైన్ బెట్టింగ్..రైతు కుటుంబం ఆత్మహత్య, కొడుకు రూ.20 లక్షలు పొగొట్టుకోవడంతో అప్పుల బాధ తాళలేక ముగ్గురు ఆత్మహత్య
Arun Charagondaనిజామాబాద్ - బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి దాదాపు రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు కొడుకు హరీష్. అప్పుల పాలు కావడంతో పొలాన్ని అమ్మేసిన కుటుంబం. దీంతో ఆర్ధిక ఇబ్బందులు రావడంతో తండ్రి సురేష్, తల్లి హేమలతతో పాటు.. కొడుకు హరీష్ కూడా ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
Dussehra Rush: జనంతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ, మహాత్మాగాంధీ బస్ స్టేషన్లు (వీడియో)
Rudraదసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుండి ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.
Rain in Hyderabad: హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులూ వానలే
Rudraరాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.
PM KISAN Yojna: రైతన్నలకు గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లలోకి పీఎం-కిసాన్ పథకం డబ్బులు
Rudraరైతన్నలకు శుభవార్త. అన్నదాతలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్ పథకం 18వ విడత నిధులు శనివారం విడుదల కానున్నాయి. ఈ పథకం కింద నేడు రూ.20 వేల కోట్ల నిధుల విడుదలతో దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి జరగనుంది.
Police Case on Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మధురైలో కేసు నమోదు.. ఎందుకంటే?
Rudraఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తమిళనాడులోని మధురైలో ఓ కేసు నమోదైంది. వంజినాథన్ అనే న్యాయవాది ఈ మేరకు మధురై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
Mallareddy Mass Dance: మాస్ స్టెప్పులతో హుషారెత్తించిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. బతుకమ్మ పాటకు విద్యార్థినులతో నృత్యం (వీడియో)
Rudra‘పాలమ్మిన, పూలమ్మిన..’ అనే డైలాగ్ తో తెలుగురాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసిన వైరల్ అవ్వాల్సిందే.
Charminar Viral Video: చార్మినార్ పై గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్.. ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు (వీడియో)
Rudraహైదరాబాద్ కు మణిహారంగా నిలిచిన చారిత్రాత్మక కట్టడం చార్మినార్ పై ఓ వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. నిషేధించబడిన పైఅంతస్తులోకి చేరి అత్యంత ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు చేశాడు.
Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి
Rudraవిలక్షణమైన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు.
Posani Shocking Comments: కొండా సురేఖ వ్యవహారంలో బాలకృష్ణ ఎందుకు స్పందించలేదు! పోసాని కృష్ణమురళీ కీలక కామెంట్లు..నా విషయంలో ఒక న్యాయం, వాళ్లకో న్యాయమా?
VNSఅక్కినేని నాగార్జున కుటుంబం – తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మధ్య వివాదంపై పోసాని కృష్ణమురళి (Posani Krishnamurthy) స్పందించారు. గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తితో పొడుస్తా అన్నాడని ఆయన చెప్పారు.
Hyderabad: గణేష్ మండపాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి జైలు శిక్ష, ఏకంగా 200 మందిని జైల్లో వేసిన షీ టీమ్స్
VNSబాధితులు ధైర్యంగా షీ టీమ్స్‌కు(She teams) ఫిర్యాదు చేయాలని సిటీ మహళా భద్రత డీసీపీ దార కవిత సూచించారు. ఇటీవల గణేష్ నిమజ్జనం(Ganesh festival) సందర్భంగా ఖైరతాబాద్‌లోని బడా గణేష్, ఇతర రద్దీగా ఉండే గణేష్ మండపాలు, నిమజ్జనం సమయంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 996 మందిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
BSNL 4G Phone: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్, చాలా తక్కువ ధరలో 4జీ ఫోన్ తీసుకువస్తున్న కంపెనీ, అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఫోన్
VNSదేశంలోని ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని తీసుకురావడానికి బీఎస్‌ఎన్‌ఎల్, కార్బన్ మొబైల్స్ (Karbonn Mobiles) చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశ "4జీ సాథీ పాలసీ" కింద ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్ బండ్లింగ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నాయి.
Youtube Update: యూట్యూబ్ క్రియేటర్లకు ఇక పండుగే! ఇకపై షార్ట్ వీడియోలు 3 నిమిషాల పాటూ అప్ లోడ్ చేయొచ్చు
VNSకంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్స్ వీడియోల (YouTube Shorts) నిడివిని పెంచింది. యూట్యూబ్‌లో నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లలో షార్ట్స్ వీడియోలు (Youtube Shorts) ఒకటి. ఇప్పటి వరకూ 60 సెకెన్ల వరకూ ఉన్న షార్ట్స్ మాత్రమే అప్‌లోడ్ చేసుకునే వీలుండేది.
Dantewada Encounter: చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్, భద్రతా బలగాల స్పెషల్ ఆపరేషన్, 30 మంది నక్సల్స్ మృతి
VNSఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్ – దంతెవాడ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. బస్తర్ రేంజ్‌లోనిదంతెవాడ, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్నట్లు పోలీసులకు ముందుగా సమాచారం అందింది.
Supreme Court: జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు సరికాదు, ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు అని తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు
Arun Charagondaజర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు.. విమర్శించినంత మాత్రాన కేసులు పెట్టడం తప్పు అని తేల్చిచెప్పింది. అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్‌పై యూపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Nandigam Suresh Gets Bail: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు రిలీఫ్, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Arun Charagondaవైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసు పై దాడి కేసులో మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Thatikonda Rajaiah: తాటికొండ రాజయ్య దోతిపైకి తొండ, భయంతో పక్కకు జరిగిన బీఆర్ఎస్ నేతలు...వీడియో ఇదిగో
Arun Charagondaతొర్రూరులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజి పైకి ఒక్కసారిగా ఓ తొండ వచ్చింది. అయితే భయంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పక్కకి జరగగా....ఆ తొండకు భయపడతరా ? అంటూ తాటికొండ రాజయ్య నవ్వారు.
Tirupati Laddu Row: వీడియో ఇదిగో, దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పినా బాబు బుద్ధి మారడం లేదు, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నాడు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని చెప్పింది. స్వయంగా వేసుకున్న సిట్‌ను రద్దు చేసింది