సమాచారం

Hawala Racket: దక్షిణాదిన హవాలా దందా, రూ.3,300 కోట్ల స్కాం వెలుగులోకి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం కేంద్రంగా హవాలా స్కామ్, ప్రకటన విడుదల చేసిన సీబీడీటీ

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా హవాలా స్కాం వెలుగులోకి వచ్చింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన ప్రధాన కార్పోరేట్ సంస్థలకు లింక్ ఉన్న భారీ హవాలా రాకెట్‌(hawala racket)ను ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department)బయటకు తీసుకువచ్చింది.

Mysterious Death Of Migratory Birds: వలస పక్షుల మృత్యు ఘోష, సాంబార్ సరస్సులో 5 వేల పక్షులు మృతి, చెల్లా చెదురుగా పక్షుల కళేబరాలు, పర్యావరణానికి ప్రమాదం తప్పదా ?

Hazarath Reddy

ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో పక్షుల మృత్యు ఘోష వినిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఉప్పు నీటి సరస్సు అయిన సాంబార్ సరస్సులో వేలకొద్దీ వలస పక్షులు చనిపోయాయి. ఇది దేశంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సుకు వేలాది వలస పక్షులు ప్రతి సంవత్సరం వస్తుంటాయి.

Pranav Wins CM Pinarayi Heart: చేతులు లేవు..కాలుతో సెల్పీ, ఫిదా అయిన సీఎం పినరయి విజయన్, సోమరిపోతులకు ప్రణవ్ కథే ఓ గుణపాఠం, సీఎం రిలీఫ్ ఫండ్‌కి సాయమందించిన ఆర్టిస్ట్ ప్రణవ్

Hazarath Reddy

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఈ స్టోరీనే నిదర్శనం, శరీరంలో అన్నీఅవయువాలు సక్రమంగా ఉండి సోమరిపోతుల్లా తిరుగుతున్న యువకులకు ఈ కథనే ఓ గుణపాఠం. పుట్టుకతోనే చేతులు కోల్పోయిన యువకుడు చూపించిన ఆత్మస్థయిర్యానికి కేరళ సీఎం (Kerala CM Pinarayi Vijayan) సైతం ఫిదా అయ్యారు.

Honda Suspend Operations: హోండా షాకింగ్ నిర్ణయం, మానేసర్ హోండా ప్లాంటు మూసివేత, కార్మికులతో చర్చలు విఫలం, ఉపాధి కోల్పోయన వారి సంఖ్య 1000కు పైగానే..

Hazarath Reddy

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India) హర్యానా లోని మానేసర్‌లో గల (Manesar In Haryana) తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకంది. సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు(indefinitely suspended operations) సంస్థ నోటీసు విడుదల చేసింది.

Advertisement

IRCTC New Rule: ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త, అమల్లోకి ఓటీపీ ఆధారిత టిక్కెట్‌ రద్దు విధానం, రీఫండ్ వివరాలు నేరుగా మీ మొబైల్‌‌కే, ఏజెంట్ల మోసాలకు ఇకపై అడ్డుకట్ట

Hazarath Reddy

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (Indian Railways and Indian Railways Catering And Tourism Corporation) ప్రయాణికులకు శుభవార్తను అందించింది. ఈ కొత్త విధానం ప్రకారం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఏజెంట్ల ద్వారా బుకింగ్‌ అయిన టిక్కెట్లను వివిధ కారణాలతో రద్దు చేసుకొన్నప్పుడు రీఫండ్‌ నగదు ఎంత అనేది ప్రయాణికుడికి తెలిసిపోతుంది.

Ayodhya Ram Mandir: 30 ఏళ్ల క్రితమే రామ్ మందిర్ డిజైన్, వీహెచ్‌పీ వినతి మేరకు ఆకృతి చూపిన చంద్రకాంత్‌ సోంపురా , నగర శైలిలో ఆలయం, ఆరున్నర ఎకరాల్లో రామ మందిర్, ఇదే డిజైన్‌తో ఆలయం రూపుదిద్దుకునే అవకాశాలు

Hazarath Reddy

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి(Ram temple construction) సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితమే డిజైన్‌(Sompura's design) రూపొందించారు. గుజరాత్ వాసి చంద్రకాంత్‌ సోంపురా(Chandrakant Sompura) 1989లో నాటి విశ్వహిందూ పరిషత్‌ (Vishwa Hindu Parishad)చీఫ్‌ అశోక్‌ సింఘాల్‌ వినతి మేరకు రామాలయ నిర్మాణానికి డిజైన్‌ గీశారు.

TRAI MNP's New Rule: మొబైల్ వినియోగదారులకు శుభవార్త, ఎంఎన్‌పీ ఇకపై రెండు రొజుల్లోనే పూర్తి, డిసెంబర్ 16వ తేదీ నుంచి అమల్లోకి, ట్రాయ్ ప్రకటనలో వెల్లడి

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ (TRAI) శుభవార్తను అందించింది. ఇకపై ఎంఎన్‌పీ( Mobile Number Portability) ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం ఒక టెలికాం కంపెనీ నుంచి మరొక టెలికాం కంపెనీకి వినియోగదారుడు తన మొబైల్ నంబర్‌ను ఎంఎన్‌పీ ద్వారా పోర్ట్ చేసుకునేందుకు 7 రోజుల వరకు సమయం పడుతోంది.

Maulana Abul Kalam Azad Birth Anniversary: దేశంలో విద్యకు పునాదులు ఏర్పరిచిన విద్యావేత్త, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నేడు, జాతీయ విద్యా దినోత్సవంగా ఆయన పుట్టినరోజు, ఆయన గురించి కొన్ని విషయాలు

Hazarath Reddy

దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్య్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి(Independent India's first education minister) మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబరు 11ను జాతీయ విద్యా దినోత్సవం(The 11th National Education Day )గా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 131వ జయంతి(Abul Kalam Azad Birth Anniversary) వేడుకలు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

Advertisement

Reliance Jio Good News: కేబుల్ కనెక్షన్ లేకుండా 150 ఛానళ్లు చూడొచ్చు, జియో సెటప్ బాక్స్‌లో ఆఫర్, జియో సెట్ టాప్ బాక్స్‌లో ప్రత్యేకంగా జియో టీవీ+ యాప్

Hazarath Reddy

న వినియోగదారులకు సెట్ టాప్ బాక్సు(Jio Set-top Box)లను పంపిణీ చేయడం ప్రారంభించింది.ట్రయల్ పీరియడ్ ముగిసి జియో సర్వీసులకు నగదు చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి కంపెనీ సెట్ టాప్ బాక్సులను అందిస్తోంది.

Cyclone Bulbul Batters Bengal: బుల్‌బుల్‌కు 20 మంది బలి, బెంగాల్‌లో 2.73 లక్షల కుటుంబాలపై తుఫాను ప్రభావం, బంగ్లాదేశ్‌లో 21 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు, తీరం దాటిన బుల్‌బుల్‌

Hazarath Reddy

బుల్‌బుల్‌ తుపాన్‌ (Cyclone Bulbul)పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటినా బుల్‌బుల్‌... పశ్చిమ బెంగాల్‌(West Bengal state), ఒడిశా(Odisha state) తీరాలను వణికిస్తోంది. ఆదివారం ఈ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లను కుదిపేసింది. దీని ధాటికి పశ్చిమ బెంగాల్ లో 10 మంది, బంగ్లాదేశ్‌(Bangladesh )లో 10 మంది, ఒడిశాలో ఇద్దరు మృతి చెందారు.

Reliance Jio: యూజర్లకు జియో ఝలక్, రూ.149 ప్లాన్‌లో స్వల్ప మార్పులు, ఇకపై వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే, మిగతా ప్రయోజనాలు యథాతథం

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న రూ.149 ప్లాన్ బెనిఫిట్స్‌కు పలు మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇకపై ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే 300 నిమిషాల జియో టు నాన్ జియో కాల్స్ వస్తాయి.

Karnataka Assembly Bypolls: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, డిసెంబర్ 5న ఉప ఎన్నికలు, డిసెంబర్ 9న ఫలితాలు, రేపటినుంచి కోడ్ అమల్లోకి

Hazarath Reddy

కర్ణాటక(Karnataka )లో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. అక్కడ 15 అసెంబ్లీ స్థానాలకు(15 Assembly Constituencies)సంబంధించిన ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ స్థానాలకు డిసెంబర్‌ 5(December)న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9(December 9)న విడుదల కానున్నాయి.

Advertisement

Cyclone Bulbul Effect: పశ్చిమ బెంగాల్‌‌లో బీభత్సం సృష్టిస్తోన్న బుల్‌బుల్, పూర్తిగా నిలిచిపోయిన విమాన సర్వీసులు, స్కూళ్లు, కాలేజీలకు మరో 3 రోజులు సెలవులు పొడిగింపు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన బెంగాల్‌ ప్రభుత్వం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్‌బుల్ తుఫాన్ (cyclonic storm Bulbul) పశ్చిమ బెంగాల్‌పై విరుచుకుపడింది. అక్కడ ఈ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ప్రచండ గాలులు, భారీ వర్షంతో పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాన్ని వణికిస్తోంది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో గంటకు 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచాయి.

Cyclone Bulbul: అతి తీవ్ర తుఫాన్‌గా బుల్‌బుల్, బెంగాల్ ఒడిషాలకు పొంచి ఉన్న ముప్పు, అర్థరాత్రి తీరం దాటనున్న సైక్లోన్ బుల్‌బుల్, ఏపీకి భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తుఫాన్‌ (Cyclone Bulbul ) అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌ కు దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Onion Import: ఉల్లిపై కేంద్రం కీలక నిర్ణయం, విదేశాల నుంచి లక్ష టన్నుల ఉల్లిపాయలు దిగుమతి, నాఫేడ్‌కు దేశ వ్యాప్తంగా పంపిణీ చేసే బాధ్యతలు అప్పగింత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ వెల్లడి

Hazarath Reddy

దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో అక్టోబర్ నుంచి ఉల్లిపాయల ధరలు అధికంగా పెరిగిన విషయం తెలిసిందే. తుఫాను దెబ్బకు కొన్ని రాష్ట్రాల్లో పంట పూర్తిగా దెబ్బతింది.

Free Laddu Distribution Scheme: మీనాక్షి ఆలయంలో భక్తులకు ఉచితంగా లడ్డులు, కార్యక్రామన్ని ప్రారంభించనున్న తమిళనాడు సీఎం పళనిస్వామి, పొరుగు రాష్ట్రాల నుంచి లడ్డు తయారీ యంత్రాల దిగుమతి

Hazarath Reddy

తమిళనాడులోని ప్రసిద్ధ మధురై మీనాక్షి ఆలయం(Sri Meenakshi Sundareswarar Temple)లో భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని(Free Laddu Distribution Scheme) అందించనున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఎడ ప్పాడి పళనిస్వామి(Tamil Nadu chief minister Edapaddi K Palaniswami) శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రారంభించనున్నారు.

Advertisement

ICICI Opens 57 Branches In AP,TG: తెలుగు రాష్ట్రాలకు ఐసీఐసీఐ శుభవార్త, కొత్తగా 57 బ్రాంచీల ఏర్పాటు, ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు, తెలుగు రాష్ట్రాల్లో 402కి చేరుకున్న మొత్తం బ్రాంచీల సంఖ్య

Hazarath Reddy

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ దిగ్గజం ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్రాంచీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని, వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223 శాఖలు ఉండనున్నాయి. వీటికి తోడు మొత్తం 1,580 ఏటీఎంలను ఐసీఐసీఐ నిర్వహిస్తోంది.

Rajinikanth: నా ముందు మీ ఆటలు సాగవు, బీజేపీకి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన రజినీకాంత్, నాకు బీజేపీకి సంబంధం లేదన్న తలైవా, అయోధ్య తీర్పు నేపథ్యంలో కోర్టు తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి

Hazarath Reddy

ప్రముఖ చలనచిత్ర నటుడు, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) బీజేపీ(BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ తనకు కాషాయ రంగు పులమాలని చూస్తోందని ఆయన అన్నారు. తనకు, తమిళ కవి తిరువళ్లువార్‌(Thiruvalluvar)ను బిజెపిలోకి లాక్కోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

Ayodhya To Rafale: అయోధ్య నుంచి రఫేల్ దాకా, 10 రోజులు, 6 చారిత్రాత్మక తీర్పులు, నవంబర్ 17న జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ, అందరి కళ్లు అయోధ్య తీర్పు పైనే..

Hazarath Reddy

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ (Chief Justice of India Ranjan Gogoi ) పదవీవిరమణ పొందేందుకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోగా ఆయన పలు కీలక కేసుల్లో తీర్పు ఇవ్వనున్నారు.

Indian Army Warns To soldiers: అపరిచితులతో స్నేహం విషయంలో జాగ్రత్త, పేక్ ఖాతాలతో చాలా జాగ్రత్తగా ఉండండి, జవాన్లకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్ ఆర్మీ

Hazarath Reddy

భారత ఆర్మీ రహస్యాలు దొంగిలించడానికి దాయాది దేశం పాకిస్థాన్ అడ్డదారులు తొక్కుతోంది. మన సైనికులపైకి అమ్మాయిల ముసుగుతో వల (హనీట్రాప్) విసురుతోంది. దాయాది దేశం ఈ కుట్రలకు సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది. కుటుంబానికి దూరంగా ఉంటూ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లకు మత్తుగా మాటలు చెప్పి.. నెమ్మదిగా లోబరుచుకుని ‘ట్రాప్’లోకి దింపుతోంది.

Advertisement
Advertisement