సమాచారం

Telangana Rains: హైదరాబాద్ కు పట్టిన ముసురు.. నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Rudra

నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లో ముసురు పట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Govt Jobs in Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 1,199 పోస్టుల భర్తీకి గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు, వివరాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌

Hazarath Reddy

ఏపీలో త్వరలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు.

Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు.. పూర్తి వివరాలు ఇదిగో..

Rudra

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నేడు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలోఆంద్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో నేటి నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

TSRTC Gamyam APP: టీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా మీరు వెళ్లే బస్సు ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు, డౌన్ లోడ్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్‌నకు ‘గమ్యం’గా నామకరణం చేసింది.

Advertisement

HC on Drunk Husband: భర్త అతి తాగుడు క్రూరత్వమే అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆ తాగుడు కుటుంబ పరిస్థితిని దిగజార్చుతుందని భార్యకు విడాకులు మంజూరు

Hazarath Reddy

భర్త తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే బదులు మితిమీరిన మద్యపానానికి అలవాటు పడి కుటుంబ పరిస్థితిని దిగజార్చితే అది సహజంగానే భార్య, పిల్లలతో సహా మొత్తం కుటుంబంపై మానసిక క్రూరత్వానికి దారితీస్తుందని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Yellow Alert for Telangana: తెలంగాణకు ఎల్లో అలర్ట్‌, ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు, ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

Hazarath Reddy

ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.

Annavaram: అన్నవరంలో రేపటి నుండి కొత్త నిబంధన.. రేపటి నుంచి కొండపై దుకాణాల్లో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటన.. గాజు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో నీరు విక్రయించేందుకు మాత్రమే అనుమతి

Rudra

పర్యావరణ పరిరక్షణ కోసం కాకినాడ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం కొత్త నిబంధన అమలు చేయనుంది. రేపటి (మంగళవారం) నుంచి కొండపై ప్లాస్టిక్‌ ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ఆజాద్ తెలిపారు. కొండపై ఉన్న దుకాణాల్లో కేవలం గాజు సీసాలు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో మాత్రమే నీటిని విక్రయిస్తారని చెప్పారు.

Trains Cancelled: హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో వారం పాటు 20 రైళ్లు రద్దు.. నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించిన రైల్వే శాఖ

Rudra

హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేసినట్టు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 20 వరకూ 18 రైళ్లు, 15 నుంచి 21 తారీఖుల మధ్య మరో రెండు రైళ్లు రద్దు చేసినట్టు వివరించింది.

Advertisement

Telangana Rains: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అవర్తనం.. దాని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Rudra

తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Rains in Hyderabad: హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. పలు ప్రాంతాల్లో వర్షం.. తెలంగాణలోని ఇతర జిల్లాలకూ వర్షసూచన

Rudra

కొన్ని రోజులు విరామాన్నిచ్చిన వరణుడు మళ్లీ హైదరాబాద్ పై విరుచుకుపడ్డాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

World Highest Grossing Companies: స్టాటిస్టా డేటాబేస్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టర్నోవర్ కలిగిన 10 కంపెనీలు ఇవే.. తొలి స్థానంలో వాల్ మార్ట్.. అమెజాన్, యాపిల్ కంపెనీల ర్యాంక్ ఎంతో తెలుసా?

Rudra

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టర్నోవర్ కలిగిన కంపెనీగా ప్రముఖ రిటైల్ సంస్థ వాల్ మార్ట్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ వివరాలను స్టాటిస్టా కంపెనీ డేటాబేస్ వెల్లడించింది. ఈ జాబితాలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి.

Onion Buffer Stock: సామాన్యులకు శుభవార్త.. ఉల్లి ధర నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్రం.. గోదాముల్లో బఫర్ స్టాక్‌ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటన

Rudra

నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలవుతున్న సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది.

Advertisement

ISRO Jobs: 10th పాస్ అయితే చాలు, ఇస్రో సంస్థలో ఉద్యోగం చేసే అవకాశం, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..సాలరీ తెలిస్తే షాకే..

kanha

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇందులో వివిధ అర్హతల కోసం వివిధ పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఇస్రో ఇటీవల టెక్నీషియన్ 'బి'/డ్రాఫ్ట్స్‌మెన్ 'బి' పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

Earthquake in Delhi: ఢిల్లీలో కంపించిన భూమి.. ఆఫ్ఘనిస్థాన్ హిందూకుష్ పర్వత ప్రాంతంలో భూకంపం.. హస్తినలో ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో ప్రకంపనలు

Rudra

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో శనివారం సాయంత్రం భూకంపం వచ్చింది.

Weather Forecast: ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడిన వాయుగుండం, ఏపీలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ నుంచి వర్షాలు

Hazarath Reddy

ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం మధ్యాహ్ననికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి సాయంత్రం 3.30–4.30 గంటల మధ్య బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా వద్ద తీరాన్ని దాటింది.

CBSE Class XII Results Out: సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల, ఫలితాలను cbse.gov.in లేదా cbse.nic.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు 2023 ఆగస్టు 1న ప్రకటించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్— cbse.gov.in లేదా cbse.nic.in ద్వారా చూసుకోవచ్చు.

Advertisement

TS TET 2023: తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు, ముఖ్యమైన తేదీలు ఇవిగో

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు.

HC on Matrimonial Disputes: భర్త రెండవ పెళ్లి చేసుకున్నా మొదటి భార్యను కాపాడుకోవాల్సిందే, కీలక తీర్పును వెలువరించిన కలకత్తా హైకోర్టు

Hazarath Reddy

వ్యక్తిగత చట్టం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకునే అర్హత ఉన్న వ్యక్తి తన మొదటి భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు తెలిపింది భర్త మొదటి భార్యకు నెలవారీ భరణాన్ని ₹6,000 నుండి ₹4,000కు తగ్గించిన సెషన్స్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సోమవారం పేర్కొంది.

IMD Update: ఈనెల, వచ్చే నెలలో సాధారణ వర్షపాతమే.. భారత వాతావరణశాఖ ప్రకటన

Rudra

ఆగస్టు, సెప్టెంబరులో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే రెండు నెలల్లో 94 నుంచి 99 శాతం మధ్యలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు.

Vande Bharat: ఈ నెల 6 నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్.. దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు.. సోమవారం ట్రయల్‌ నిర్వహణ, రైలు డోన్ నుంచి కాచిగూడ చేరుకున్న వైనం

Rudra

తెలుగురాష్ట్రాల ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.

Advertisement
Advertisement