Hyderabad, May 7: తెలంగాణలో (Telangana) రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా భారీ వర్షాలు (Light to Heavy Rains) పడే అవకాశం ఉన్నది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు గరిష్ఠంగా 61 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Hyderabad Rains: City gets scattered showers; IMD says rainy days till May 9https://t.co/i7BeyBFmDA
— TIMES NOW (@TimesNow) May 7, 2023
ఏ జిల్లాల్లో వర్షాలంటే?
- హైదరాబాద్
- రంగారెడ్డి
- మేడ్చల్
- మహబూబ్‌నగర్
- నాగర్‌కర్నూల్
- నారాయణ్ పేట్
- సంగారెడ్డి
- వరంగల్
- భద్రాద్రి కొత్తగూడెం
8న అల్పపీడనం
ఇక బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడిందని, ఇది 8న అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ మరుసటి రోజున ఇది వాయుగుండంగా మారుతుందని చెప్పింది. వాయుగుండం ఉత్తరదిశగా పయనిస్తూ తీవ్రమైన తుఫానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.