President Hyderabad Visit: నేడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు.
Hyderabad, July 4: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) నేడు హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ (Hyderabad) చేరుకుంటారు. గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సైబరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Traffic alert issued in Hyderabad in view of President Droupadi Murmu's visit today, check details
— TIMES NOW (@TimesNow) July 4, 2023
ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి
గచ్చిబౌలి నుండి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు. రాష్ట్రపతి పర్యటనకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
(The above story first appeared on LatestLY on Jul 04, 2023 08:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

