Bhopal, OCT 22: మధ్యప్రదేశ్‌లోని రీవా (Rewa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన బస్సు (Bus) అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మృతిచెందారు (15 killed). మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయింది. దీంతో అందులో నలుగురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు పోలీసులు శ్రమించారు. గాయపడ్డవారిని వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించారు.
Madhya Pradesh CM Shivraj Singh Chouhan expressed grief over the Rewa bus-trolley truck collision. He spoke to Uttar Pradesh CM Yogi Adityanath on phone this morning & apprised him of the incident. Mortal remains of passengers will be brought to Prayagraj by the MP govt: MP CMO https://t.co/9P6S5AQlDC
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 22, 2022
శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, మృతులంతా ఉత్తరప్రదేశ్ (Uttara pradesh), బీహార్ (Bihar) రాష్ట్రాలకు చెందిన కూలీలుగా పోలీసులు వెల్లడించారు. దీపావళి పండుగ సందర్భంగా వారంతా తమ స్వస్థలాలకు వెళ్తున్నారని చెప్పారు. వీళ్లంతా ఒకే కంపెనీలో కూలి పనిచేసుకునేవారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.