Wheat Purchase Price Up By 2%: రైతుల నిరసనకు దిగొచ్చిన కేంద్రం, గోధుమ మద్దతు ధరను 2 శాతం పెంచుతూ నిర్ణయం, ఈ ఏడాది క్వింటాల్‌ గోధుమ కనీస మద్దతు ధర రూ. 2,015 గా నిర్ణయం
Farmer(Photo-PTI)

New Delhi, Sep 8: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు గత కొన్ని నెలల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తక్షణమే ఈ కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్న (Amid Farmers' Protest) నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం పలు పంటల మద్దతు ధరలు (minimum support price (MSP) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ ఏడాదిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయనున్న గోధుమ మద్దతు ధరను 2 శాతం (Wheat Purchase Price Hike) పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

దాని ప్రకారం ఈ ఏడాది క్వింటాల్‌ గోధుమ కనీస మద్దతు ధరను 2,015 రూపాయలుగా (Wheat Purchase Price Up By 2%) నిర్ణయించింది కేంద్రం. గోధుమ ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు ₹ 1,008 గా అంచనా వేయబడింది. ప్రపంచంలో గోధుమ వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఏటా మద్దతు ధరను నిర్ణయిస్తూ.. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటుంది. దానిలో భాగంగానే ఈ ఏడాది గోధుమ మద్దతు ధరను 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలానే ఈ ఏడాదికి గాను ఆవాల మద్దతు ధరను కేంద్రం 400 రూపాయలు పెంచి.. క్వింటాల్‌ ధర 5,050 రూపాయలుగా ప్రకటించింది.

హర్యానాలో రైతులు ఆందోళన బాట, మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన పోలీసులు, కర్నాల్‌‌లో 144 సెక్షన్‌ అమల్లోకి

కనీస మద్దతు ధర (MSP) అనేది ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేసేందుకు నిర్ణయించే ధర. ప్రస్తుతానికి ఖరీఫ్‌, రబీ రెండు సీజన్‌లకు సంబంధించి ప్రభుత్వం 23 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ ఏడాదికి సంబంధించి కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

వ్యవసాయ ఉత్పత్తులపై ప్రైవేట్ సంస్థలకు నియంత్రణ ఇవ్వడం ద్వారా తమను దెబ్బతీస్తుందని మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎంఎస్‌పిని పెంచే చర్య వచ్చింది. చట్టాలను సవరిస్తూ సగానికి సగం రావాలని కేంద్రం అంగీకరించినప్పటికీ, రైతులు చట్టాలను ఉపసంహరించుకోవడంలో ఏమాత్రం ఇష్టపడటం లేదు. కాగా కేంద్రం రైతుల ఆరోపణలను ఖండించింది. మధ్యవర్తులను తగ్గించడం ద్వారా చట్టాలు వాస్తవానికి వారికి ప్రయోజనకరంగా ఉంటాయని కేంద్రం పేర్కొంది.

సెప్టెంబ‌ర్ 27న భారత్ బంద్, రైతు సంఘాల పిలుపుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల నేతలు

CCEA 2021-22 పంట సంవత్సరం (జూలై-జూన్) మరియు 2022-23 మార్కెటింగ్ సీజన్లలో ఆరు రబీ పంటలకు MSP పెంచడానికి ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటలు కోసిన వెంటనే అక్టోబర్ మధ్యలో రబీ పంటలు వేస్తారు. గోధుమ మరియు ఆవాలు రెండు ప్రధాన రబీ పంటలు. గోధుమలు, రేప్‌సీడ్ మరియు ఆవాలు, తరువాత కాయధాన్యాలు, పప్పు, బార్లీ మరియు కుసుమ తర్వాత వాటి ఉత్పత్తి వ్యయంపై రైతుల రాబడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినందున పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి MSP పెంచినట్లు CCEA తెలిపింది.