Kisan Mahapanchayat in Haryana (Photo Credits: ANI)

Karnal, September 7: హరియాణాలోని కర్నాల్‌ నిఘా నీడలో ఉంది. మినీ సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామన్న రైతు సంఘాల పిలుపు నేపథ్యంలో (Kisan Mahapanchayat in Haryana) అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త చట్టాల రద్దు కోరుతూ రైతులు నేడు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం (Security Beefed Up) చేస్తున్నారు. ఆ ప్రాంతంలో 144వ సెక్షన్‌ అమల్లోకి తెచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం సోమవారం ప్రకటించింది.

మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు నిలిపేశారు. కర్నాల్‌లో నలుగురుకి మించి వ్యక్తులు గుమిగూడటం కుదరదంటూ నిషేధాజ్ఞలు (Orders in Place in Karnal) జారీచేసింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తు చర్యగా ఆంక్షలు అమల్లోకి తెచ్చామని అదనపు డీజీపీ(లా అండ్‌ ఆర్డర్‌) నవ్‌దీప్‌ సింగ్‌ చెప్పారు. రైతు ఆందోళన సందర్భంగా తప్పుడు వార్తలు, పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయకుండా ఆపేందుకు కర్నాల్‌ జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఎంఎస్, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సేవలను స్తంభింపజేస్తారు.

సెప్టెంబ‌ర్ 27న భారత్ బంద్, రైతు సంఘాల పిలుపుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల నేతలు

పొరుగున ఉన్న కురుక్షేత్ర, కైథాల్, జింద్, పానిపట్‌ జిల్లాల్లోనూ ఈ సేవలనుæ నిలిపేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలనూ రప్పించారు. గత నెల 28న కర్నాల్‌లో బీజేపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బయల్దేరిన రైతులు.. జాతీయరహదారి వెంట ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తున్నారంటూ వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. ఈ ఘటనలో 10 మందికిపైగా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రైతు మరణించారు. లాఠీచార్జి కారణంగా ఆయన మరణించారని రైతు సంఘాలు చెబుతుండగా, గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.

లాఠీ చార్జిని నిరసిస్తూ మినీ–సెక్రటేరియట్‌ను ముట్టడి స్తామని సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ప్రకటించడం తెల్సిందే. ముందుగా కర్నాల్‌లో భారీస్థాయిలో పంచాయత్‌ను నిర్వహిస్తామని, తర్వాత మినీ– సెక్రటేరియట్‌ వద్ద ఆందోళన కొనసాగిస్తామని హరియాణా భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు గుర్నామ్‌ చెప్పారు.