New Delhi, SEP 29: సోషల్ మీడియాలో అభిమానులతో ఇతర నెటిజెన్లతో (Netizens) కొంత మంది సెలెబ్రిటీలు సరదాగా ఉంటారు. ఇందులో మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా (Amit Misra) ఒకరు. జోకులతో, ఆసక్తికరమైన విశయాలతో తన ఫాలోవర్స్‭ని (Followers) ఎప్పటికప్పుడు వినోదాన్ని అందిస్తుంటాడు మిశ్రా. అయితే తాజాగా ఒక నెటిజెన్ డబ్బులు అడిగితే వెంటనే రెస్పాండ్ అయి.. డిజిటల్ పేమెంట్ (Digital Payment) ద్వారా డబ్బులు పంపించాడు. డబ్బులు తీసుకున్న ఆ నెటిజెనే కాకుండా మిగతా వారిలో కూడా ఈ వార్త కాస్త ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు కాస్త క్యూరియాసిటీని పెంచింది. ఈ మధ్యే సురేష్ రైనాకు సంబంధించిన ఒక వీడియోను మిశ్రా తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో షేర్ చేశాడు.

అయితే ఈ ట్వీట్‭తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‭కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి (Google pay) 500 రూపాయలు పంపించాడు మిశ్రా. అనంతరం అది స్క్రీన్‭షాట్ తీసి ట్విట్టర్‭లో షేర్ చేశాడు. అనంతరం ‘‘అయిపోయింది, మీ డేట్‭కి ఆల్ ది బెస్ట్’’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.