News

Mumbai: ముంబైలో షాకింగ్ ప్రమాదం, ఫుడ్ క్యాంటీన్‌లోకి దూసుకెళ్లిన ట్రక్..ప్రాణాలు కొల్పోయిన వ్యక్తి..వీడియో ఇదిగో

Arun Charagonda

ముంబై - పూణె ఎక్స్‌ప్రెస్‌ వేలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఫుడ్ క్యాంటీన్‌లోకి దూసుకెళ్లింది ట్రక్. ట్రక్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన బీహార్‌కు చెందిన ఇంద్రదేవ్ పాశ్వాన్ అనే వ్యక్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Medak: మెదక్‌లో ముసుగుదొంగ, 4 రోజులుగా వరుస దొంగతనాలు...పోలీసులకు సవాల్‌గా మారిన దొంగతనాలు..సీసీటీవీ వీడియో

Arun Charagonda

మెదక్ జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్నాడు ముసుగు దొంగ. పాపన్నపేట మండలంలో గత 4 రోజులుగా అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడుతున్నాడు అగంతకుడు. ఇంటి బయట ఏ వస్తువులున్నా ఎత్తుకెళ్తున్నాడు గుర్తు తెలియని వ్యక్తి. సీసీటీవీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా వైరల్‌గా మారాయి.

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో దారుణం...పొలాల్లో మహిళ మృతదేహం, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి శివారులోని పంటపొలాల్లో మృతదేహం లభ్యమైంది. మృతురాలు రంగా కాలనీకి చెందిన తోకల రమాదేవిగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు.

Telangana: మామపై చెప్పుతో దాడి చేసిన కోడలు, వీల్ ఛైర్‌లో ఉన్న మామ మొఖంపై చెప్పుతో కొట్టిన కోడలు..కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని కోడలు..వీడియో ఇదిగో

Arun Charagonda

మామ పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసింది ఓ కోడలు. నల్గొండ - వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామ పై విచక్షణారహితంగా దాడి చేసింది కోడలు. వీల్ చైర్‌లో ఉన్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో దాడికి పాల్పడింది . కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదు కోడలు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

RJD leader Tejashwi Yadav: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్జేడీ తేజస్వి యాదవ్, సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం అని తెలిపిన ఆర్జేడీ నేత

Arun Charagonda

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. మమతా చేసిన ప్రకటనపై కూటమిలో అంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు తేజస్వి. కూటమికి ఎవరూ నాయకత్వం వహిస్తారనేది అంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని... కూటమిలోని సీనియర్ నాయకులు ఎవరైనా నాయకత్వం వహిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

Manchu Manoj Vs Mohan Babu: మంచు మనోజ్ వర్సెస్ మోహన్‌ బాబు, గాయాలతో పోలీస్ స్టేషన్‌కు మనోజ్..తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది .గతంలో అన్న విష్ణుతో గొడవ పడ్డారు మనోజ్. అయితే ఈ సారి మాత్రం ఏకంగా తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు మనోజ్. తన భార్యతో పాటు తనని కొట్టాడని గాయాలతో పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆస్తి, స్కూల్స్‌కు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే గొడవలు జరిగినట్లు తెలుస్తోండగా పోలీసులు విచారణ చేపట్టారు.

Aus Vs Ind: ఆడిలైడ్ టెస్టులో భారత్ పరాజయం, 10 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్...1-1తో సిరీస్ సమం

Arun Charagonda

అడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. ఓవర్ నైట్ స్కోరు 128తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 175 పరుగులకు ఆలౌట్ అయింది. నితీశ్‌ రెడ్డి 42 పరుగులతో మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ వికెట్ కొల్పోకుండానే టార్గెట్‌ను చేధించింది.ఈ గెలుపుతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఆస్ట్రేలియా.

Syria President Flees: సిరియాలో అంతర్యుద్ధం.. రాజధాని డమాస్కస్‌ లోకి ప్రవేశించిన తిరుగుబాటు దళాలు.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు బషర్

Rudra

సిరియాలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్ల బృందాలు రాజధాని డమాస్కస్‌ నగరంలోకి ప్రవేశించాయి.

Advertisement

AP Minister Savita: ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కడప ఎస్పీకి ఆదేశం..విషమంగా బాధితురాలి ఆరోగ్యం

Arun Charagonda

కడప జిల్ఆలో జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు. ఎస్పీ విద్యాసాగర్ తో ఫోన్ లో మాట్లాడిన సవిత...నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలందించాలని రుమా ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.

Raging in School: స్కూల్ లో ర్యాగింగ్.. 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. మహబూబాబాద్ లో ఘటన

Rudra

మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి రుత్విక్ ను 10వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేశారు.

CM Revanth Reddy: ఎన్ని కష్టాలైనా మూసీని ప్రక్షాళన చేసి తీరుతాం...సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు..స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అన్నారు.

Top Real Estate Deal: అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఢీల్... గరుగ్రామ్‌లో ఏకంగా రూ.190 కోట్లకు అమ్ముడైన పెంట్‌హౌస్‌

Arun Charagonda

Info-x సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ గురుగ్రామ్‌లోని DLF ది కామెలియాస్‌లో ₹190 కోట్లకు 16,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ని కొనుగోలు చేసింది. ఇది భారతదేశపు అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ డీల్‌లలో ఒకటి.

Advertisement

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్ లోనే నలుగురు మృతి.. పల్నాడు జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే మృతిచెందారు.

Gajwel Hit and Run Case: మనల్ని రక్షిస్తున్న రక్షకులనే భక్షించారు.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన

Rudra

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.

Car Accident in Tirumala: తిరుమల కొండపై కారు దగ్ధం.. యజమాని అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం (వీడియో)

Rudra

దేవదేవుడు ఆ వేంకటేశుడు కొలువైన తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ కారు హఠాత్తుగా దగ్ధం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Traffic Restrictions At Tankbund: ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో, ఈ వేళ‌ల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తూ నిర్ణ‌యం

VNS

వాయుసేన విమానాలు విన్యాసాలు ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Delhi Horror: న‌చ్చిన పిల్ల‌తో పెళ్లికి ఒప్పుకోలేద‌ని క‌న్న‌తల్లినే చంపేశాడు, పైగా దోపిడీ దొంగ‌లు చంపేశార‌ని క‌థ అల్లాడు

VNS

నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లి నిరాకరించింది. దీనిపై అసంతృప్తి చెందిన కొడుకు ఆమెను హత్య చేశాడు. (Man Kills Mother) దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 22 ఏళ్ల శావన్‌ పోలీసులకు ఫోన్‌ చేశాడు

Telangana Govt Gazette on GP Merging: ఓఆర్ఆర్ స‌మీప మున్సిపాలిటీల్లో 51 గ్రామ పంచాయ‌తీల విలీనం, గెజిట్ విడుద‌ల చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

VNS

హైదరాబాద్‌ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

CM Revanth Reddy: తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న కోమటిరెడ్డి..నల్గొండ గాలి పీల్చుకుంటేనే సాయుధ పోరాటం గుర్తుకొస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాలనలో అభివృద్ధి శూన్యం అని మండిపాటు

Arun Charagonda

సరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లా జీబీ గూడెం గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాలు సభలో పాల్గొని ప్రసంగించారు రేవంత్. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా నుంచే అనేక మంది ప్రాతినిధ్యం వహించారు అన్నారు.

Nara Lokesh: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్..ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తయారుచేస్తామని నారా లోకేష్ వెల్లడి

Arun Charagonda

బాపట్ల మున్సిపల్ హైస్కూలులో పండుగ వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్ – టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో కలిసి హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా 45వేల పైచిలుకు పాఠశాలల్లో ఒకేరోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం ఒక చరిత్ర అన్నారు.

Advertisement
Advertisement