Bihar Horror: పరీక్షల్లో చిట్టీ విసిరిన బాలుడు, లవ్ లెటర్ అనుకుని ఇంటికి ఫోన్ చేసిన అమ్మాయి, బాలుడిని అత్యంత దారుణంగా నరికి చంపిన యువతి ఫ్యామిలీ, నిందితులను అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు

బీహార్ భోజ్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎగ్జామ్ చిట్టీని లవ్ లెటర్ గా భావించి ఓ అమ్మాయి తన సోదరుల చేత బాలుడిని కొట్టి చంపించింది. ఆ చిట్టీ విసిరిన బాలుడ్ని వారు కిరాతకంగా హత్య చేశారు. ఉద్వంత్ నగర్ కు చెందిన దయాకుమార్ (12) తన సోదరిని పరీక్ష కేంద్రం వద్దకు తీసుకువచ్చాడు.

Bihar Horror: పరీక్షల్లో చిట్టీ విసిరిన బాలుడు, లవ్ లెటర్ అనుకుని ఇంటికి ఫోన్ చేసిన అమ్మాయి, బాలుడిని అత్యంత దారుణంగా నరికి చంపిన యువతి ఫ్యామిలీ, నిందితులను అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Patna, Oct 20: బీహార్ భోజ్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎగ్జామ్ చిట్టీని లవ్ లెటర్ గా భావించి ఓ అమ్మాయి తన సోదరుల చేత బాలుడిని కొట్టి చంపించింది. ఆ చిట్టీ విసిరిన బాలుడ్ని వారు కిరాతకంగా హత్య చేశారు. ఉద్వంత్ నగర్ కు చెందిన దయాకుమార్ (12) తన సోదరిని పరీక్ష కేంద్రం వద్దకు తీసుకువచ్చాడు. సోదరికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో, ఆమె పరీక్ష రాస్తుండగా ఓ చిట్టీని (Boy throws a chit to cheat in exams) ఎగ్జామ్ హాల్లోకి విసిరాడు. అయితే ఆ చిట్టీ మరో అమ్మాయి వద్ద పడింది.

అయితే ఆ అమ్మాయి దాన్ని ప్రేమలేఖగా (girl mistakes it for love letter) పొరబడింది. దీనిపై తన అన్నలకు సమాచారం అందించగా, వారు వెంటనే అక్కడికి చేరుకుని దయాకుమార్ ను చితకబాది, ఆపై కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ బాలుడి శరీర భాగాలు లభ్యం కావడంతో అతడు హత్యకు (her family kills the boy) గురైనట్టు వెల్లడైంది.

ముంబైలో ప్రముఖ బిల్డర్ 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, వ్యక్తిగత సమస్యల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లుగా అనుమానాలు

ఈ ఘటనతో బాలుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.సోమవారం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై అతని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు.నిందితుల్లో కొందరు బాలురు కూడా ఉన్నారు.బాలనేరస్థులను రిమాండ్‌హోమ్‌కు తరలించగా, యువకులను జైలుకు తరలించారు.

(The above story first appeared on LatestLY on Oct 20, 2022 09:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).