Uttarakhand, SEP 24: ఉత్తరాఖండ్‌లో బీజేపీ ముఖ్యనేత కుమారుడిపై అత్యాచార ఆరోపణలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఓ రిసార్ట్‌లో పనిచేసే యువతిని బీజేపీ నేత కుమారుడు హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఆమె మృతదేహం సమీపంలో ఉన్న కాల్వలో దొరికింది. దాంతో బీజేపీ నేత కుమారుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం పౌరీ జిల్లాలోని యమకేశ్వర్ బ్లాక్‌లో రిసార్ట్‌లో (resort) ఉన్న బీజేపీ నాయకుడి (BJP leader) కుమారుడు, అతని ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 5 రోజులుగా అదృశ్యమైన అంకితా భండారి కేసులో పోలీసులు వివరాలు బహిర్గతం చేశారు. నిందితుడు రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పుల్కిత్ ఆర్య (Pulkit Arya) హరిద్వార్‌కు చెందిన బిజెపి నాయకుడు. ఉత్తరాఖండ్ మతి కళా బోర్డు మాజీ ఛైర్మన్ వినోద్ ఆర్య (Vinod arya) కుమారుడు. వినోద్ ఆర్యకు రాష్ట్ర మంత్రి ర్యాంక్ లభించింది కానీ ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేదు.
#WATCH | Rishikesh, Uttarakhand: Women gherao the Police vehicle that was carrying the accused in Ankita Bhandari murder case
The 19-yr-old receptionist went missing a few days ago & her body was found today. 3 accused, incl Pulkit -owner of the resort where she worked- arrested pic.twitter.com/v3IK8zE1xI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 23, 2022
కాగా,అంకితా భండారి అనే అమ్మాయి రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసింది. తప్పిపోయిన బాలికను హత్య చేసి చీలా కాలువలో పడవేసినట్లు ఒప్పుకోవడంతో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను (Ankit gupta) అరెస్టు చేసినట్లు పౌరి అదనపు పోలీసు సూపరింటెండెంట్ శేఖర్ చంద్ర సూయల్ పిటిఐకి తెలిపారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని, అయితే కఠినంగా విచారించగా నేరం అంగీకరించారని ఏఎస్పీ తెలిపారు. కాలువలో బాలిక మృతదేహాన్ని వెతకడానికి ఒక బృందాన్ని పంపామని, రెవెన్యూ పోలీసుల నుండి సాధారణ పోలీసులకు బదిలీ చేసిన 24 గంటల్లో కేసును ఛేదించినట్లు ఆయన చెప్పారు. ముగ్గురు నిందితులను కోట్‌ద్వార్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం బాలిక తన గదిలో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెవెన్యూ పోలీసు ఔట్‌పోస్టులో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోవైపు అంకితా భండారీ హత్య కేసులో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆగ్రహించిన గ్రామస్తులు రిసార్ట్‌ను ధ్వంసం చేసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న భారీ పోలీసు బలగాలు గ్రామస్తులను అడ్డుకున్నారు. పుల్కిత్ ఆర్యను కోర్టుకు తీసుకువెళుతున్న పోలీసు వాహనాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారని, నిందితులతో పాటు వారిని కూడా కొట్టారని తెలుస్తోంది. అరెస్టయిన ముగ్గురు నిందితులు అనేక రహస్యాలు పోలీసుల ఎదుట వెల్లడించారని, ఈ విషయాన్ని పోలీసులు త్వరలో వెల్లడించనున్నట్టు సమాచారం. అంకిత మరణంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.