COVID-19 Vaccination in India: కేంద్రం నుంచి శుభవార్త..జనవరి 13 నుంచి కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీ, కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధంగా ఉన్నామని తెలిపిన తెలుగు రాష్ట్రాలు
COVID-19 Vaccination in India (Photo Credits: PTI)

New Delhi, January 5: భారతదేశంలో కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. డ్రైరన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా వాక్సినేషన్‌ను (COVID-19 Vaccine First Dose in India) ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన 10 రోజుల్లోనే వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుందని వెల్లడించింది. ఇందుకు గాను ఇప్పటికే 29 వేల కోల్డ్‌ చైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అలానే దేశవ్యాప్తంగా నాలుగు డిపోలు.. 37 రాష్ట్రాల్లో స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది.

ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ (Oxford-Astrazenca), భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్‌ (Bharat Biotech) అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత ఆదివారం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి.. తొలి దశలో భాగంగా హెల్త్ కేర్ వర్కర్లకు, అత్యవసర సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, వయసు పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వ్యాక్సిన్ తయారీ సంస్థలు త్వరలో ముంబై, చెన్నై, కోల్‌కత్తా, కర్నల్, హర్యానాలోని ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోలకు విమానాల ద్వారా వ్యాక్సిన్‌ను తరలించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

ఒక్కరోజులోనే 20 కొత్త వైరస్ కేసులు, దేశంలో 58కి చేరుకున్న క‌రోనా న్యూ స్ట్రెయిన్ కేసులు, ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

అక్కడి నుంచి 37 స్టేట్ వ్యాక్సిన్‌ స్టోర్లకు తరలించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి జిల్లాల్లోని వ్యాక్సిన్ ( COVID-19 Vaccine First Dose) స్టోర్స్‌కు తరలించి.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌‌లను నిల్వ చేసేందుకు 29,000 కోల్డ్ చైన్‌ పాయింట్స్‌ను భారత్‌లో సిద్ధం చేసినట్లు ఆరోగ్య కార్యదర్శి చెప్పుకొచ్చారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్‌ లైన్‌లో పనిచేస్తున్న 3.7 లక్షల మంది వైద్య సిబ్బందిని గుర్తించింది. తొలి దశలో వీరికి వ్యాక్సిన్‌ వేయడానికి ఏర్పాట్లు చేసింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్ వచ్చే సంఖ్యను బట్టి తొలి విడతలో కానీ, రెండవ విడతలో కానీ ఇతర శాఖల ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సినేషన్ అందించనున్నారు. ఫ్రంట్‌లైన్‌లో ఇతర శాఖల సిబ్బంది సంఖ్యను 12 లక్షలుగా గుర్తించింది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొనాలంటే రూ. 400-రూ.600 పెట్టాలి, ధరల వివరాలను వెల్లడించిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా, దేశంలో తాజాగా 16,375 మందికి కరోనా పాజిటివ్

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఫ్రంట్‌లైన్‌తో పాటు దీర్ఘకాలిక రోగులు, 50 ఏళ్లు దాటిన వారి సంఖ్యను కోటి మందిగా గుర్తించారు. అయితే వైద్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ వేయాలంటే 4,5 రోజుల్లో ప్రక్రియ పూర్తికానుంది. కోటి మందికి వ్యాక్సిన్‌ వేయడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగుచోట్ల రీజియన్‌ వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. ఒకేసారి కోటి డోసులు భద్రపరిచే విధంగా ఏపీలో ఏర్పాట్లు చేశారు. రెండు డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీల మధ్యలో వ్యాక్సిన్‌ను భద్రపరచనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మందికి ఒకేసారి వ్యాక్సిన్‌ వేయడానికి కూడా వైద్య, ఆరోగ్యశాఖ ఇబ్బంది లేదని తెలిపింది.

వ్యాక్సిన్ తీసుకున్న నర్సు రెండు రోజులకే మృతి, పోర్చుగీస్‌లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సు ఆకస్మిక మరణానికి కారణం తెలపాలని కోరిన తండ్రి, విషాదం వ్యక్తం చేసిన పోర్చుగీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ

వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రాష్ట్ర వ్యాప్తంగా 20వేల బృందాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాలో డ్రై రన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. కోవిడ్‌ యాప్‌తో పాటు క్షేత్రస్థాయి సమస్యలని డ్రై రన్‌లో అధికారులు పరిశీలించారు. వ్యాక్సినేషన్‌ టీమ్‌లకి ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్‌ డోసులు ఆధారంగా ఎంతమందికి వ్యాక్సినేషన్‌ వేయాలనేది వైద్య ,ఆరోగ్యశాఖ నిర్ణయించనుంది.

ఇక తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేష‌న్‌కు సిద్ధంగా ఉన్నామ‌ని తెలంగాణ రాష్ర్ట ప్రజారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు. గురు, శుక్ర‌వారాల్లో 1,200 కేంద్రాల్లో డ్రై ర‌న్ నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. కొ-విన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న వారికే టీకా వేస్తామ‌ని పేర్కొన్నారు. వారానికి నాలుగు రోజులు కొవిడ్ టీకాల పంపిణీ చేపడుతామ‌న్నారు. బుధ‌, శ‌నివారాల్లో మిగిలిన టీకాల పంపిణీ ఉంటుంద‌న్నారు. వంద‌కు పైగా ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో టీకా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. ప‌ది రోజుల్లో వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు.