Delhi, oct 3: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత వారంలో కొత్తగా 412 డెంగ్యూ కేసులు (Dengue Cases in Delhi) నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య వెయ్యికి దగ్గరగా చేరింది. ఇప్పటివరకు 937 కేసులు (tally rises to 937) నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది.ఇదిలా ఉంటే సెప్టెంబర్ 28 నాటికి ఆ నెలలో మొత్తం 693 డెంగ్యూ కేసులు రిపోర్ట్ అయ్యాయి. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబర్ 21 వరకు 525 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
అయితే ఆ తరువాత వారం రోజుల్లోనే కొత్తగా 412 డెంగ్యూ కేసులు (Over 400 fresh cases of dengue in Delhi) వెలుగు చూశాయి. ఈ కేసులతో దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 937కు చేరింది.ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ నివేదికను సోమవారం విడుదల చేసింది. ఆగస్ట్‌లో కేవలం 75 కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిపింది.
అయితే డెంగ్యూ వల్ల ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని ఆ నివేదికలో పేర్కొంది.కాగా, 2015లో కూడా ఢిల్లీలో డెంగ్యూ విజృంభించింది. ఆ ఏడాది 10,600కు పైగా మొత్తం కేసులు నమోదయ్యాయి. 1996 నుంచి ఢిల్లీలో ఇంత భారీ సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదు కావడం అదే మొదటిసారి.