Vinesh Phogat : ఖేల్ రత్న, అర్జున అవార్డును తిరిగి ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీకి లేఖ రాసిన వినేష్ ఫోగట్..

మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వెటరన్ రెజ్లర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వినేష్ ఫోగట్ తన అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించింది. నా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అర్జున్ అవార్డును తిరిగి ఇస్తున్నాను అని ఫోగట్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నన్ను ఈ పరిస్థితిలో ఉంచినందుకు సర్వశక్తిమంతుడికి చాలా ధన్యవాదాలు అని ఈ లేఖను సోషల్ మీడియా ఎక్స్‌లో ఆమె పంచుకున్నారు. వినేష్ ఫోగట్ నిర్ణయాలపై, తోటి రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ ఏ ఆటగాడు కూడా ఇలాంటి రోజు చూడకూడదని తాను పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని బజరంగ్ పునియా తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కు స్వస్తి చెప్పారు.

నిజానికి, గురువారం బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన సంజయ్ సింగ్ WFI అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. దీనికి నిరసనగా, శుక్రవారం (డిసెంబర్ 22), బజరంగ్ పునియా ప్రధాని మోడీకి లేఖ రాశారు పద్మశ్రీని తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.

ప్రధాని మోదీని కలిసి లేఖను అందజేసేందుకు పూనియా పార్లమెంటుకు చేరుకునేందుకు ప్రయత్నించగా, ఢిల్లీ పోలీసు అధికారులు ఆయనను  నిలిపివేశారు. అనంతరం పద్మశ్రీని ఫుట్‌పాత్‌పై వదిలేశారు. ఇక రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ గురువారం తన బూట్లు టేబుల్‌పై ఉంచి భావోద్వేగంతో రిటైర్మెంట్‌ను ప్రకటించింది. "మేము మనస్పూర్తిగా పోరాడాము, అయితే బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు WFI అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు, నేను రెజ్లింగ్‌ను విడిచిపెట్టాను అని ప్రకటించింది. అయితే, డబ్ల్యుఎఫ్‌ఐపై ఆరోపణలు రావడంతో, క్రీడా మంత్రిత్వ శాఖ డబ్ల్యుఎఫ్‌ఐని నిరవధికంగా సస్పెండ్ చేసింది.