Covid in India: దేశంలో కరోనాతో మరొకరు మృతి, ఏడుకు చేరిన మరణాల సంఖ్య, గత 24 గంటల్లో 142 కేసులు నమోదు, 1,970కి చేరిన యాక్టివ్ కేసులు
దేశంలో కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. గత 24 గంటల్లో కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. నిన్న కేరళలో ఐదుగురు, యూపీలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
దేశంలో కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. గత 24 గంటల్లో కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. నిన్న కేరళలో ఐదుగురు, యూపీలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,33,318 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి 4.44 కోట్ల మంది రికవరీ కాగా, రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఒక్క కేరళలోనే తాజాగా 115 కేసులు నమోదు అయ్యాయని, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో 10 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. దేశంలో సోమవారం కొత్తగా 260 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు
Here's News
India reported 142 new cases of Covid-19 on Tuesday with the active caseload rising to 1,970, according to Union Health Ministry data.
Six deaths were reported till Monday -- five alone in Kerala and one in Uttar Pradesh, the Health Ministry data showed. The death toll has now… pic.twitter.com/lF3s8ceiY8
— IndiaToday (@IndiaToday) December 19, 2023
(The above story first appeared on LatestLY on Dec 19, 2023 05:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

