COVID-19 in India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 1,52,734 మందికి కరోనా, 2,38,022 మంది కోలుకుని ఇంటికి, తాజాగా 3,128 మరణాలతో 3,29,100 కు పెరిగిన మృతుల సంఖ్య
Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

New Delhi, May 31: దేశంలో నిన్న 1,52,734 క‌రోనా కేసులు (COVID-19 in India) న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం... నిన్న 2,38,022 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,47,534కు (Coronavirus in India) చేరింది. మరో 3,128 మంది క‌రోనాతో ప్రాణాలు (Coronavirus Deaths) కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,29,100 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,56,92,342 మంది కోలుకున్నారు. 20,26,092 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 21,31,54,129 మందికి వ్యాక్సిన్లు వేశారు. COVID19 రికవరీ రేటు 91.60% కి పెరిగింది. వారాంతపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 9.04% మరియు రోజువారీ పాజిటివిటీ రేటు 9.07% వద్ద ఉంది, వరుసగా 7 రోజులు 10% కన్నా తక్కువగా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Here's ANI Update

మహారాష్ట్రలో రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,600 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో చివరిసారిగా మార్చి 16న సుమారు 18వేల కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనాతో మరో 402 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,71,801 యాక్టివ్‌ కేసులున్నాయి. కొవిడ్‌ వల్ల మరణించిన మొత్తం కేసుల సంఖ్య 94,844కు చేరింది.

వ్యవసాయరంగం తనను తాను కాపాడుకుంది, కరోనా ప్రభావం దానిపై లేదు, మ‌న్ కీ బాత్‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఓఎస్‌డీ (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా విధులు నిర్వర్తిస్తున్న ఏకే రక్షిత్‌ కొవిడ్‌ మహమ్మారికి బలయ్యారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఢిల్లీ ద్వారక ప్రాంతంలోని ఆకాశ్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేశారు. పరిస్థితి విషమించి ఈ సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. ఏకే రక్షిత్‌ మృతిపట్ల పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 946 కొవిడ్‌ పాజిటవ్‌ కేసులు నమోదయ్యాయి. 78 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.